అఘోరి కారు చూశారా? లోపల అన్ని పుర్రెలు.. రిజిస్ట్రేషన్ నంబర్ కూడా లేదు, భయపెట్టే స్టిక్కరింగ్!
లేడీ అఘోరి నాగ సాధు (Lady Aghori Naga Sadhu) ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో ట్రెండ్ అవుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె హాట్ టాపిక్‌గా మారారు. ప్రస్తుతం ఆమె ఎక్కడికెళ్లిన జనాలు వింతగా చూస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆత్మార్పణ చేసుకుంటానని షాకింగ్ ప్రకటనతో ఆమె భయభ్రాంతులకు గురిచేశారు. కొన్నిచోట్ల ఆమెకు చేదు అనుభవాల సైతం ఎదురవుతున్నాయి. తాజాగా మంగళగిరిలో ఆమెను కొంతమంది యువకులు నిలువరించారు. దీంతో సహనం కోల్పోయిన నాగ సాధు ఆ యువకులపై రాళ్లు, త్రిశూలంతో దాడి చేయడం వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఆమె రెండు తెలుగు రాష్ట్రాల్లోని ధ్వంసమైన దేవాలయాలను సందర్శిస్తున్నారు. కొన్నిచోట్ల ఆలయం లోపలికి ప్రవేశం లేదని పోలీసులు అనుమతించడం లేదు.
ఇంటర్‌నెట్‌లో వైరల్ అవ్వడంతో పాటు అటు రాజకీయ నాయకులపై సైతం అఘోరి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బట్టలు లేకుండా ఒంటిపై బూడిద పూసుకొని జనావాసాల్లోకి సంచరిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె రోజు వారి కార్యకలాపాలు, ఆహారపు అలవాట్లను వెల్లడిస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఏకంగా మనిషి మెదడుని ఆహారంగా తీసుకుంటానని చెప్పారు. ఇది వారం మొత్తానికి సరిపోతుందని అన్నారు.

ఇదిలా ఉంటే కొంతమంది అఘోరిని వ్యతిరేకిస్తుండగా.. మరి కొంతమంది ఇళ్లకు పిలిపించుకొని మరీ పూజలు చేయించుకుంటున్నారు. ఆమె కంటూ ఓ ప్రత్యేక శైలితోపాటు తాను తిరిగే కారుపై కూడా వివిధ రకాల స్టిక్కరింగ్‌ని ఆమె అంటించారు. ఈమె ప్రస్తుతం హ్యుందాయ్ i20 కారులో తిరుగుతున్నారు. ఈ కారుపై లోపల, బయట ఎటువంటి విచిత్ర స్టిక్కరింగ్ ఉన్నాయో చూసేయండి.
ఈ అఘోరి వినియోగిస్తున్న హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్‌గా ఉంది. ఈ కారుకి భారతీయ మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. చాలా తక్కువ సమయంలో ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఐ20 ఒకటిగా అవతరించింది. అయితే ఈ కారు ఎక్స్‌టీరియర్‌ని స్టిక్కరింగ్‌తో అఘోరి మొత్తం మార్చేసింది. ముఖ్యంగా కారును తనకు నచ్చిన విధంగా అచ్చం భయపెట్టే విధంగా మార్పు చేసింది.

ముందు భాగంలో జెండా, లేడీస్, లేడీ అఘోరి నాగ సాధు అని పెద్ద అక్షరాలు ఉన్నాయి. ఇక కారు సైడ్ ఫ్రొఫైల్‌లో కాళీ చిత్రం, డేంజర్ స్టిక్కరింగ్ చూడవచ్చు. రెండో డోర్‌కి శివుడి స్టిక్కరింగ్ ఉంది. కారుపై చిత్ర విచిత్ర స్టిక్కర్లు ఉన్నాయి. కానీ దానిపై రిజిస్ట్రేషన్ నంబర్ పెట్టలేదు. రిజిస్ట్రేషన్ స్థానంలో అఘోరి నాగ సాధు అని రాసి ఉంది.
ఈ కారు ఎక్ట్సీరియర్ మాత్రమే కాదు, ఇంటీరియర్ కూడా భయపెడుతుంది. కారులో పుర్రెలు, శివలింగంతో పాటు రాళ్లు, రుద్రాక్షలు, బిందెలు ఉన్నాయి. లక్షలు విలువ చేసే ఈ కారును అఘోరి తనకు నచ్చినట్లుగా మార్చేసుకుని కారు రూపామే లేకుండా చేసింది. ప్రస్తుతం ఈ కారు ధర మార్కెట్‌లో 7.04 లక్షలుగా ఉంది. ఇది ఎంట్రీ లెవల్ పరీక్ష ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే. ఆమె ఏ వేరియంట్ వినియోగిస్తుందో తెలియరాలేదు.
డ్రైవ్‌స్పార్క్ కామెంట్స్: ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో ఇంజనీర్లు, డాక్టర్ల సంఖ్య పెరుగుతున్నట్లే, గాడ్‌మెన్‌గా మారుతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో క్రమంగా పెరుగుతోంది. వాస్తవానికి సాధువులు కేవలం దేవాలయాలు, ఆథ్యాత్మిక ప్రదేశాల్లో మాత్రమే సంచరిస్తారు. కానీ ఈ మధ్య జనావాసాల్లోకి వచ్చి ట్రెండ్ అవుతున్నారు. దీనిని ఇతరులు సైతం అనుసరించే అవకాశం లేకపోలేదు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








