నడి రోడ్డుపై మహిళా స్కూటరిస్ట్ చెంప చెళ్లుమనిపించిన పిఎస్‌ఐ [వీడియో]

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు పోలీసులు కఠినంగా శిక్షించడమే కాకుండా భారీ జరిమానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల రోజురోజుకి రోడ్డుప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి.

నడి రోడ్డుపై మహిళా స్కూటరిస్ట్ చెంప చెళ్లుమనిపించిన పిఎస్‌ఐ [వీడియో]

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనాలను పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, జరిమానా కూడా విధిస్తారు. వాహనాలను పోలీసులు తనిఖీ చేసేటప్పుడు కొన్నిసార్లు వాహనదారులకు మరియు పోలీసుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఈ విధమైన గొడవల కారణంగా పోలీసులు అప్పుడప్పుడు వాహనదారులపై పోలీసులు దాడిచేయడం వంటివి కూడా ఇది వరకు చాలా వెలుగులోకి వచ్చాయి.

నడి రోడ్డుపై మహిళా స్కూటరిస్ట్ చెంప చెళ్లుమనిపించిన పిఎస్‌ఐ [వీడియో]

ఇలాంటి మరో సంఘటన మాండ్యంలో జరిగింది. స్కూటర్స్ తనిఖీ సందర్భంగా తనతో వాదించిన యువతిపై మహిళ పిఎస్‌ఐ దాడి చేసింది. ఒక మహిళ పిఎస్‌ఐ ఆ యువతిని చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులపై ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

MOST READ:లంబోర్ఘిని ఉరుస్ పెర్ల్ క్యాప్సూల్ ఎడిషన్ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

నడి రోడ్డుపై మహిళా స్కూటరిస్ట్ చెంప చెళ్లుమనిపించిన పిఎస్‌ఐ [వీడియో]

మాండ్యలోని బెజరాగహళ్లి రామన్న సర్కిల్‌లో పోలీసులు వాహనదారుల రికార్డులను తనిఖీ చేస్తున్నప్పుడు, ఆ యువతిని స్కూటర్‌ యొక్క డాక్యుమెంట్స్ చూపించమని కోరారు. ఆ సమయంలో ఆ యువతి పోలీసులతో వాదించడం వల్ల, కోపంతో ఉన్న మహిళ పిఎస్‌ఐ సవితా గౌడ పాటిల్ బాలికను చెంపదెబ్బ కొట్టింది.

నడి రోడ్డుపై మహిళా స్కూటరిస్ట్ చెంప చెళ్లుమనిపించిన పిఎస్‌ఐ [వీడియో]

అప్పుడు ఆ స్కూటరిస్ట్ మరియు పిఎస్ఐ మధ్య మాటల వాగ్వాదం జరిగింది. మీరు నన్ను ఎవరు కొట్టారని యువతి ప్రశ్నిస్తున్నట్లు మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఆ యువతీ యొక్క స్కూటర్‌ను ఒక వ్యక్తి నెట్టడం కూడా వీడియోలో ఉంది.

MOST READ:బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా బుక్ చేయండి

ఈ సంఘటన తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళ, ఆమె తల్లిదండ్రులు పోలీసులకు క్షమాపణలు చెప్పారు. అంతే కాకుండా వీరికి 500 రూపాయల జరిమానా కూడా విధించినట్లు సమాచారం. ఈ సంఘటనపై నివేదిక సమర్పించాలని మాండ్యా జిల్లా ఎస్పీ డిఎస్‌పికి సూచించారు.

నడి రోడ్డుపై మహిళా స్కూటరిస్ట్ చెంప చెళ్లుమనిపించిన పిఎస్‌ఐ [వీడియో]

అంతే కాకుండా పోలీసు సిబ్బంది అందరూ ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసులు కూడా పబ్లిక్ తో మంచిగా ఉండాలని తెలిపారు. వాహనదారులు పోలీసులకు సహరించాలని, అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయని వారు తెలిపారు.

MOST READ:ఢిల్లీలో భారీగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. కారణం మాత్రం ఇదే

Image Courtesy: TV5 Kannada

Most Read Articles

English summary
Lady PSI Slaps Lady For Arguing. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X