వీడియో: రైల్వే క్రాసింగ్‌ల వద్ద అప్రమత్తంగా లేకపోతే..
కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద జాగ్రత్తగా రోడ్డు దాటమని ప్రతి రైల్వే స్టేషన్లో ప్రకటనలు ఇస్తూ ఉంటారు. అలాగే, ప్రింట్ మరియు ఎలక్టానిక్ మీడియాల్లో కూడా ఈ ప్రకటనలను అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఇలాంటి ప్రకటనలు ఎన్ని వచ్చినా కొందరి వక్ర బుద్ధి మాత్రం మారదు. వీటంన్నింటినీ పెడచెవిన పెట్టి రోడ్డు రైల్వే క్రాస్ వద్ద రోడ్డు దాటి ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు.
ఈరోజు మనం చూడబోయే ఓ వీడియోలో ఓ లేడీ డ్రైవర్ తన కొన్ని ఇన్ఫినిటీ కారుతో రైల్వే ట్రాక్‌ను క్రాస్ చేయబోయి చిక్కుల్లో పడిన సంఘటనను చూద్దాం రండి. ఓ మహిళా డ్రైవర్ తన సరికొత్త ఇన్ఫినిటీ 860 లగ్జరీ కారుతో రైల్వే ట్రాక్‌ను దాటుతూ ఉండగా, ఆ కారు సరిగ్గా రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయింది. అదే సమయంలో ఆ ట్రాక్‌పై ఓ రైలు వేగంగా కారు వైపు దూసుకొస్తోంది.
కారును పట్టాల నుంచి తప్పించడానికి ఆ మహిళా డ్రైవర్ శతవిధాల ప్రయత్నించింది. కానీ తన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలితాలనివ్వలేదు. మరోవైపు రైలు నుడుపుతున్న వ్యక్తి కూడా ట్రాక్‌పై కారును చూడగానే రైలును నిలిపేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ ప్రయత్నం కూడా ఫలించ లేదు. ఈలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది.
రైలును నడిపే వ్యక్తి బ్రేక్‌ను అప్లయ్ చేసినప్పటికీ, రైలు వేగం నియంత్రణలోకి రాకపోవటంతో ఆ రైలు కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళా డ్రైవర్ కారులో నుంచి ఎగిరి ఆమడ దూరంలో పడిపోయింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ప్రాణనష్టం సంభవించలేదు. కానీ కారు మాత్రం రిపేరు చేయటానికి కూడా వీలు లేనంతగా డ్యామేజ్ అయింది.
ఈ వీడియో చూసిన తర్వాతనైనా కొందరు తమ అలవాటును మార్చుకుంటే మంచి.. లేకపోతే అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/wgckkeo-IvU?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








