లేడీ సెహ్వాగ్‌కు మామూలు కారు సరిపోతుందా? టాటా గిఫ్ట్ కంటే ముందే 75లక్షల కారు కొన్న వరల్డ్ కప్ విన్నర్

క్రికెట్‌ను మతంలా భావించే భారతదేశం ఎందరో దిగ్గజాలను అందించింది. వారిలో వీరేంద్ర సెహ్వాగ్ తన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాంటి సెహ్వాగ్ స్టైల్‌లోనే బ్యాటింగ్ చేసే మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

దేశానికి మూడు ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహించిన అతి చిన్న వయస్కురాలైన షఫాలీ, ఇటీవల ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి జట్టును గెలిపించింది. ఇప్పుడు ఈ యువ కెరటం తన విజయాలను మరింత ఘనంగా చాటుకునేందుకు తన స్టైల్‌కు సరిపోయే కొత్త స్పోర్ట్స్ కారును కొనుగోలు చేసింది.

Lady Sehwags New Ride Shafali Verma Buys MG Cyberster EV to Celebrate World Cup Win

తన దూకుడైన ఆటతీరు వల్ల కెరీర్ ప్రారంభంలో ప్రశంసలు అందుకున్న షఫాలీ, కీలక మ్యాచ్‌లలో వికెట్ కోల్పోవడం వల్ల విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇటీవల ఆమె జాతీయ జట్టు నుంచి కూడా తప్పించబడింది.

అయితే, 2025 ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్‌లో అసలు స్క్వాడ్‌లో చోటు దక్కించుకోలేకపోయిన షఫాలీ, ఓ ప్లేయర్‌కు గాయం కావడంతో షెఫాలీ జట్టులోకి వచ్చింది. టోర్నమెంట్ ఫైనల్‌లో భారత్ దక్షిణాఫ్రికాను ఓడించి కప్పు గెలిచింది. ఈ మ్యాచులో బ్యాట్, బాల్‌తో అదరగొట్టిన షఫాలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుంది. తన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసిన వారికి ఆటకు మైదానంలోనే సమాధానం చెప్పింది.

Lady Sehwags New Ride Shafali Verma Buys MG Cyberster EV to Celebrate World Cup Win

ప్రపంచకప్ గెలిచిన మహిళా క్రికెటర్లకు టాటా మోటార్స్ తమ సరికొత్త సియెర్రా ఎస్‌యూవీని గిఫ్ట్‌గా ప్రకటించింది. ఈ బహుమతి అందకముందే షఫాలీ తన విజయాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. తన స్టైల్‌కు, దూకుడైన స్వభావానికి సరిపోయేలా యంగ్ స్టార్ షఫాలీ ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును కొనుగోలు చేసింది. ఎంజీ ఇండియా సంస్థ దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను విడుదల చేసింది.

షఫాలీ తన కారు రంగుకు తగ్గ దుస్తులు ధరించి డెలివరీ వేడుకలో పాల్గొంది. ఆమె కొనుగోలు చేసిన కారు ఆండీస్ గ్రే కలర్లో ఉంది. ఈ కలర్ ఆప్షన్ ఎరుపు రంగులో ఉండే సాఫ్ట్ టాప్‌తో (కన్వర్టిబుల్ రూఫ్) వస్తుంది. ఈ కారును కంప్లీట్లీ బిల్ట్-అప్ యూనిట్‌గా దేశంలోకి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది సిజర్ డోర్లు (పైకి తెరుచుకునే డోర్లు), కన్వర్టిబుల్ రూఫ్ (50 కి.మీ వేగంలో కూడా రూఫ్‌ను మడత పెట్టవచ్చు).

Lady Sehwags New Ride Shafali Verma Buys MG Cyberster EV to Celebrate World Cup Win

ఎంజీ సైబర్‌స్టర్ ఈవీకి సెలబ్రిటీల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ఇది ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 75 లక్షలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ మోడల్ 77kWh బ్యాటరీ ప్యాక్‌తో, 509bhp పవర్‌ను, 725Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.2 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదని ఎంజీ కంపెనీ చెబుతోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 580 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

విస్, కంఫర్ట్, స్పోర్ట్, కస్టమ్, సూపర్ స్పోర్ట్ వంటి డ్రైవ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. ఇంటీరియర్‌లో 7.0 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, బోస్ సౌండ్ సిస్టమ్ (8 స్పీకర్లు), వెంటిలేటెడ్ సీట్లు, 4 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2 ADAS వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Sunday, November 23, 2025, 15:37 [IST]
English summary
Lady sehwags new ride shafali verma buys mg cyberster ev to celebrate world cup win
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+