రూ.28 లక్షల బైక్ రైడ్ చేస్తున్న నటి మంజు వారియర్ - వీడియో చూడండి
ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో సమస్యలు.. ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఎన్నో మార్గాలను వెతుక్కుంటారు. ప్రశాంతత కోసం కొందరు విహారయాత్రలు చేస్తే.. మరి కొందరు లాంగ్ రైడ్ ఎంచుకుంటారు. ఈ లాంగ్ రైడ్ అనేది నేడు ఓ ట్రెండ్ అయిపోయింది.
సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా రైడింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఇటీవల ప్రముఖ మలయాళీ నటి మంజు వారియర్ ఓ ఖరీదైన బైక్ రైడ్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఈమె హెల్మెట్ ధరించి, మోటార్‌సైకిల్ గ్లోవ్‌లను ధరించి బైక్ రైడ్ చేయడం చూడవచ్చు.

నటి మంజు వారియర్ రైడ్ చేస్తున్న బైక్ 'బిఎండబ్ల్యు ఆర్ 1250 జీఎస్' (BMW R 1250 GS) అని తెలుస్తోంది. ఈ 28 లక్షలు. నటి ఈ వీడియోను మంజు వారియర్ అనే అకౌంట్ ద్వారా పోస్ట్ చేస్తూ.. ఇప్పటికీ మీకు భయంగా ఉంటే గేర్ మార్చండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఎక్కువ మంది సెలబ్రిటీలకు ఇష్టమైన బైకులలో ఈ బీఎండబ్ల్యూ ఆర్1250 జీఎస్ ఒకటి. ఇప్పటికే తమిళ నటుడు అజిత్ కూడా ఈ బైక్ కలిగి ఉన్నారు. ఇది అడ్వెంచర్ బైక్. ఈ విభాగంలో అత్యంత శక్తివంతమైన బైక్. ఇందులో 1254-సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7750 rpm వద్ద 134 bhp పవర్ మరియు 6250 rpm వద్ద 143 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అద్భుతమైన డిజైన్.. అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ బైక్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. బీఎండబ్ల్యూ ఆర్1250 జీఎస్ బైక్ మాత్రమే కాకుండా నటి మంజు వారియర్ వద్ద మినీ కూపర్, మారుతి బాలెనొ మరియు రేంజ్ రోవర్ వంటి కార్లు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈమెకు కార్లు మరియు బైకుల మీద ఉన్న ఇష్టం ఇట్టే అర్థమైపోతుంది.
నటి మంజు వారియర్ గురించి తెలుగు ప్రజలకు పెద్దగా తెలియక పోవచ్చు. ఎందుకంటే.. ఈమె మలయాళీ నటి. మంజు వారియర్ తన 16వ ఏట 1995లో సాక్ష్యం అనే సినిమాతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత నటించిన సల్లాపం, కొట్టరం, కలియట్టం, ఏ పళయుం కాదన్ను బాగా ప్రజాదరణ పొందాయి. ఇప్పటికే ఈమె కేరళ ఉత్తమ సినీ నటి పురష్కారం మరియు నాలుగు ఫిలింఫేర్ అవార్డులను కైవసం చేసుకుంది.
బీఎండబ్ల్యూ ఆర్1250 జీఎస్ ఎక్కువ ఖరీదైన అడ్వెంచర్ బైక్. కాబట్టి దీనిని సాధారణ ప్రజలు కొనుగోలు చేయడానికి సుముఖత చూపించరు. కాబట్టి ఈ బైకును ఎక్కువగా సెలబ్రిటీలు మాత్రమే కొనుగోలు చేస్తుంటారు. ఖరీదైన ఈ బైక్ మైలేజ్ కేవలం 15 కిమీ / లీ కావడం విశేషం. లక్షలు ఖర్చు పెట్టి బైక్ కొనేవారు మైలేజ్ గురించి ఆలోచించే అవకాశం లేదు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








