ర్యాపిడో డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌.. కారణం తెలిస్తే షాక్‌ అవుతారు..

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయడమనేది చాలా మంది యువత కల. ఆ ఉద్యోగంపై ఉన్న అభిరుచితో సాంకేతికతకు అందిపుచ్చుకుని కష్టపడి చదివి కెరీర్‌లో త్వరగా పైకి ఎదిగేందుకు మల్టీ నేషనల్‌ కంపెనీలో ఉద్యోగం సాధిస్తారు. కానీ ఆర్థిక మాంద్యం కారణంగా చాలా ప్రముఖ కంపెనీలు ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లను అందిస్తున్నాయి.

ఆర్థిక మాంద్యం కారణంగా పలు మల్టీ నేషనల్ కంపెనీలు ఉద్యోగుల లేఆఫ్‌ను మొదలుపెట్టాయి. ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లను అందించి వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాయి. గూగుల్, అమెజాన్, మెటాతో సహా పలు ఎంఎన్‌సీలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి.

Software-Developer-as-Rapido-Driver

ఈ క్రమంలో హెచ్‌సీఎల్‌ తమ కంపెనీ నుంచి ఓ ఉద్యోగిని తొలగించడంతో వేరే మార్గం లేక బెంగళూరులో ర్యాపిడో బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌గా మారాడు. కాగా అతను ఈ ర్యాపిడో డ్రైవర్‌గా మారడానికి ఓ కారణమూ ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

శ్రీనివాస్ రాపోలు 2020 సెప్టెంబర్‌లో హెచ్‌సీఎల్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా చేరారు. ఆర్థిక మాంద్యం కారణంగా శ్రీనివాస్‌ను ఈ ఏడాది జూన్‌లో ఉద్యోగం నుంచి తొలగించారు. ఉద్యోగం పోవడంతో శ్రీనివాస్‌ క్రుంగిపోకుండా వెంటనే రాపిడోలో బైక్ టాక్సీ డ్రైవర్‌గా చేరాడు. ఇక్కడే అసలు విషయముంది. అదేంటంటే..

బైక్ ట్యాక్సీ రైడర్స్ ద్వారా మళ్లీ ఏదో ఒక ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాలని శ్రీనివాస్‌ ఆశపడటమే తను ఈ వృత్తి ఎంచుకోవడానికి కారణం. ఏదైనా జావా డెవలపర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుని అందులో చేరాలనేది శ్రీనివాస్ రాపోలు ఆలోచన.

శ్రీనివాస్‌ అనుకున్నట్లుగా తన ఆలోచన వెంటనే ఫలించడం ప్రారంభించింది. ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న లోవినీష్ ధీర్ ఇటీవల శ్రీనివాస్ బైక్‌పై వెళ్లాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా శ్రీనివాస్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కథ తెసుకున్నారు లోవినీష్‌ ధీర్‌. వెంటనే ఆయన తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.

శ్రీనివాస్‌ జాబ్‌ గురించి ధీర్‌ వెంటనే తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. 'నేను కలిసిన రాపిడో బైక్ టాక్సీ డ్రైవర్ జావా డెవలపర్. ఇటీవలే హెచ్‌సీఎల్‌ కంపెనీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. కాబట్టి జాబ్‌కు సంబంధించి రిక్రూట్‌మెంట్స్‌ తెలుసుకోవడానికి అతను బైక్ టాక్సీని నడుపుతున్నారు. అతని సీవీ నా దగ్గర ఉంది. ఉద్యోగం ఉంటే నాకు తెలియజేయండి' అని ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఈ మంచి ప్రయత్నానికి చాలా మంది లోవినీష్ ధీర్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. మరికొందరు ఉద్యోగానికి సంబంధించిన పలు వివరాలను కూడా ట్విట్టర్‌లో పంచుకున్నారు. అయితే ఇది పబ్లిసిటీ స్టంట్ అని మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ విమర్శలపై స్పందించిన లోవినీష్ ధీర్ శ్రీనివాస్ రాబోలు కథను వారితో పంచుకున్నారు.

నిరుద్యోగులు ఉద్యోగ శోధనలో భాగంగా లింక్‌డ్‌ ఇన్‌, నౌకరి ఇలా పలు యాప్‌లలో తమ పోర్ట్‌ఫోలియోను జత చేసేవారు ఎంతో మంది. ఇటీవల ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపుల కారణంగా, అనేక మంది నిరుద్యోగ యువకులు లింక్‌డ్‌ఇన్‌పై ఆధారపడుతున్నారు. శ్రీనివాస్‌ వంటి వారు ఇలా సమయం వృథా చేయకుండా ప్రత్యామ్నాయ మార్గంలో అటు సంపాదిస్తూ ఇటు ఉద్యోగ వేటలో పడ్డారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, June 25, 2023, 8:21 [IST]
English summary
Laid off from hcl employee turns rapido driver to get job leads
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+