మాల్దీవులకు గట్టి షాక్.. హాట్ కేకుల్లా అమ్ముడైన లక్షద్వీప్ విమాన టికెట్లు, వాళ్లు మరో 3 నెలలు ఆగాల్సిందే.!!
భారత్ సహా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షద్వీప్(Lakshadweep) టాపిక్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించడమే ఇందుకు కారణం. ఆయన పర్యటనపై మాల్దీవుల నేతల వ్యాఖ్యలే ఇందుకు కారణం. దీంతో మాల్దీవులకు ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారంతా క్యాన్సిల్ చేసుకొని.. లక్షద్వీప్‌కు క్యూ కడుతున్నారు. తద్వారా మార్చి వరకు లక్షద్వీప్‌కు టికెట్లన్నీ బుక్ అయిపోయాయి.
వరుస సెలవులు, పండుగలు, వేసవి సీజన్ వచ్చిందంటే చాలు ప్రముఖ పర్యాటక ప్రాంతం మాల్దీవులకు భారతీయులు క్యూ కడతారన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆ చిన్న ద్వీపం మాల్దీవుల(Maldives) నేతలు చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో నెటిజన్లు భగ్గుమన్నారు. లక్షద్వీప్‌లో పర్యటించిన మోదీ అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మన లక్షద్వీప్ చాలా అందంగా ఉందని.. ప్రతి ఒక్కరూ దీనిని సందర్శించి, ఇక్కడ సాహసాలు చేయాలని పీఎం మోదీ(Modi Tweet On Maldives) ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో మాల్దీవుల నేతలు భారత్‌లో పరిశుభ్రత, సౌకర్యాలపైన చులకనగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలతో మండిపడ్డ నెటిజన్లు #boycott maldives అంటూ నెట్టింట్లో వైరల్ చేశారు.
ఈ ఎఫెక్ట్‌తో మాల్దీవులకు ఫ్లైట్(Lakshadweep Flight Tickets Sold Out) టికెట్ బుక్ చేసుకున్న వారంతా క్యాన్సిల్ చేసుకున్నారు. లక్షద్వీప్ అందాలను చూసేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో వచ్చే 3 నెలలు విమానాలన్నీ బుక్ అయిపోయాయి. మొత్తంగా లక్షద్వీప్ పర్యాటకంగా అభివృద్ధి చెందే సూచనలు తొందర్లోనే వస్తాయని భారతీయులు సంబరపడుతున్నారు.

ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించడమే కాకుండా ఆ దీవికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ అక్కడి అందాలను వివరించడంతో.. గూగుల్‌లో లక్షద్వీప్ టాపిక్ ట్రెండింగ్‌లో ఉంది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతం కోసం లక్షలాది మంది గూగుల్‌లో శోధిస్తున్నారు. గత 20 ఏళ్లలో ఇదే అత్యధికం అని నివేదికలు పేర్కొంటున్నారు.
అయితే ఇప్పటికే లక్షద్వీప్‌లో పర్యటించినవారు కూడా ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అని నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్‌తో లక్షద్వీప్‌లో పర్యాటకానికి కొత్త ఊపు వచ్చిందనేది వాస్తవం. విదేశాలకు వెళ్లడం కంటే.. లక్షద్వీప్‌ను అభివృద్ధి చేసి టూరిజంకు అందుబాటులోకి తేవాలని పర్యాటకులు కోరుకుంటున్నారు.

కాగా లక్షద్వీప్‌కు రెండు మార్గాల్లో చేరుకోవచ్చు. ఒకటి సముద్ర మార్గంలో వెళ్లడం, మరొకటి విమాన(వాయు మార్గం) సర్వీసులు. ప్రధాని పర్యటన తర్వాత లక్షద్వీప్‌కు ఆదరణ పెరగడంతో.. రాబోయే మూడు నెలల వరకూ అంటే మార్చి వరకూ లక్షద్వీప్‌కు విమానాలన్నీ బుక్ అయ్యాయి. అయితే ఫ్లైట్‌లో వెళ్లాలి అనుకునేవారు మార్చి వరకూ ఆగాల్సిందే..
సహజమైన బీచ్‌లు, లేత నీలి సముద్రం, ప్రకృతి అందాలను నింపుకొన్న పరిసరాలు, పగడపు దిబ్బలతో తక్కువ జనసాంద్రత కలిగిన ప్రాంతం లక్షద్వీప్. మొన్నటి వరకు బయటి ప్రపంచానికి ఈ ప్రాంతం గురించి అంతగా తెలియకపోవడానికి కారణం.. ఇక్కడ పర్యాటకం ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని సమస్యల కారణంగా సుప్రీంకోర్టు దీనిపై కొన్ని ఆంక్షలు విధించింది.

కాగా లక్షద్వీప్‌కు కూరగాయల నుంచి ఆహార పదార్థాలు, భవన నిర్మాణ సామగ్రి వరకు అన్నీ మంగళూరు నుంచి రవాణా అవుతాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రతిరోజూ యాభైకి పైగా నౌకలు సేవలందిస్తాయి. లక్షద్వీప్‌లోని 36 దీవుల్లో కేవలం ఆరు దీవుల్లో మాత్రమే నివాసాలు ఉంటుండగా, మరో మూడు దీవుల అభివృద్ధికి టెండర్లు పిలిచినట్లు సమాచారం.
లక్షద్వీప్‌లో అగత్తి(Agatti Airport) పేరిట ఒకే ఒక ఎయిర్‌పోర్టు ఉండగా.. దీన్ని 1987-88 నిర్మించారు. ఈ అగత్తి విమానాశ్రయం ల్యాండింగ్ ప్యాడ్‌కు రెండు వైపులా సముద్ర తీరం ఉండటంతో.. ఈ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ పర్యాటకులకు ఎంతో అందమైన అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, ద్వీపాలను చూస్తూ పర్యాటకులు ల్యాండింగ్, టేకాఫ్ అవ్వొచ్చు. కాగా లక్షద్వీప్‌లో మరో ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది.
దీంతో పాటు సముద్ర మార్గం ద్వారా కూడా లక్షద్వీప్ చేరేలా ఏర్వాట్లు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఇందుకోసం నౌకలను అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నారు. ఈ మూడు నెలలూ విమానాలు పూర్తిగా బుక్ అవడంతో లక్షద్వీప్‌కు పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ కొత్తగా హోటళ్లు నిర్మించే ప్రణాళికలో కూడా ఉన్నారు.


Click it and Unblock the Notifications








