లలిత్ మోడీ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా.. ఇవన్నీ లండన్ లోనే..

ప్రముఖ వ్యాపారవేత్త, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ తాను ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో తాను డేటింగ్‌లో ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో ఆయన పేరు ఇంటర్నెట్ మారు మ్రోగిపోతోంది. భారతదేశపు అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్థాపించిన తర్వాత లలిత్ మోడీ జాతకమే మారిపోయింది. ఐపీఎల్ ఏర్పాటు తర్వాత ఆయన కాసుల పంట పండించారు.

లలిత్ మోడీ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా.. ఇవన్నీ లండన్ లోనే..

అయితే, 2013లో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ భారత క్రికెట్ బోర్డు లలిత్ మోడీపై జీవితకాల నిషేధం విధించింది. అప్పటి నుండి భారతదేశం వదిలి పారిపోయిన లలిత్ మోడీ, ఇప్పుడు లండన్‌ లో సెటిల్ అయ్యాడు. భారతదేశంలో సంపాధించిన డబ్బుతో ఆయన అక్కడ తన కుటుంబంతో కలిసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. లలిత్ మోడీకి వివిధ రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి, వాటితో అతను విలాసవంతమైన వస్తువులను కొనగలడు. అలా అతడు కొనుగోలు చేసిన విలాసవంతమైన వస్తువులలో కొన్ని ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. మరి ఈ మహానుభావుడు లండన్ రోడ్లపై ఊరేగే కార్లు ఏవో మనం కూడా ఓ లుక్కేద్దాం రండి.

లలిత్ మోడీ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా.. ఇవన్నీ లండన్ లోనే..

1. ఫెరారీ 488 పిస్టా స్పైడర్

ఒక నివేదిక ప్రకారం, లలిత్ మోడీ 2020 సంవత్సరంలో ఫెరారీ 488 పిస్టా స్పైడర్‌ (Ferrari 488 Pista Spider) స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశారు. ఈ స్పోర్ట్స్ కారు ఫెరారీ బ్రాండ్ యొక్క 488 లైనప్‌లోనే టాప్ మోడల్ మరియు భారతదేశంలో దీని ధర సుమారు రూ. 4.81 కోట్లు. ఈ సూపర్ కారులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 660 బిహెచ్‌పి పవర్ ను మరియు 760 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

లలిత్ మోడీ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా.. ఇవన్నీ లండన్ లోనే..

2. బెంట్లీ ముల్సాన్ స్పీడ్

బెంట్లీ తమ ముల్సాన్ స్పీడ్ కారును 2020 సంవత్సరంలో నిలిపివేయటానికి ముందు, ఇది 10 సంవత్సరాల పాటు బెంట్లీ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్ గా కొనసాగింది. బెంట్లీ ముల్సాన్ (Bentley Mulsanne) సిరీస్ లో మొత్త మూడు కార్లు ఉన్నాయి. వీటిలో ముల్సాన్, ముల్సాన్ స్పీడ్ మరియు ముల్సాన్ ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్. సమాచారం ప్రకారం, లలిత్ మోడీ వద్ద బెంట్లీ ముల్సాన్ స్పీడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారులోని మ్యాసివ్ 6.75 లీటర్ వి8 ఇంజన్‌ గరిష్టంగా 530 బిహెచ్‌పి శక్తిని మరియు 1,200 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

లలిత్ మోడీ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా.. ఇవన్నీ లండన్ లోనే..

3. మెక్‌లారెన్ 720ఎస్

లలిత్ మోడీకి సూపర్ కార్లంటే చాలా క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇతగాడి కార్ కలెక్షన్ లో ఉండే మరో అరుదైన సూపర్ కారు మెక్‌లారెన్ 720ఎస్‌ (McLaren 720S). అతని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రకారం, అతని కుమారుడు రుచిర్ మోడీ ఈ కారును కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. భారతదేశంలో ఈ రెండు సీట్ల కూపే ధర వేరియంట్‌ను బట్టి సుమారు రూ. 4.65 కోట్ల నుండి రూ. 5.04 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారు లోని 4.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 ఇంజన్‌ గరిష్టంగా 720 బిహెచ్‍‌పి శక్తిని మరియు 770 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

లలిత్ మోడీ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా.. ఇవన్నీ లండన్ లోనే..

4. ఫెరారీ ఎఫ్12 బెర్లినెట్టా

లలిత్ మోదీ కుమారుడు రుచిర్ మోదీ 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఫెరారీ ఎఫ్12 బెర్లినెట్టా (Ferrari F12 Berlinetta) ను బహుమతిగా ఇచ్చారు. ఈ కారు నిలిపివేయడానికి ముందు భారతదేశంలో ఈ కారు యొక్క చివరి రికార్డు ధర రూ. 5.60 కోట్లుగా ఉంది. రెండు-సీట్ల కూపే బాడీ స్టైల్ లో లభించే ఈ కారులో శక్తివంతమైన వి12 ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 730 బిహెచ్‌పి శక్తిని మరియు 690 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

లలిత్ మోడీ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా.. ఇవన్నీ లండన్ లోనే..

5. ఫెరారీ 812 జిటిఎస్

లలిత్ మోడీ కొనుగోలు చేసిన మరో ఫెరారీ బ్రాండ్ కారు ఫెరారీ 812 జిటిఎస్ (Ferrari 812 GTS), అయితే అతను ఈ కారును నడపడం లేదు. గత ఏడాది తన కుమారుడు రుచిర్ మోదీ పుట్టినరోజు కానుకగా ఓ నల్ల రంగు కారును కొనుగోలు చేశాడు. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు 5.75 కోట్లు మరియు దీని పవర్‌ఫుల్ ఇంజన్ గరిష్టంగా 788.52 బిహెచ్‌పి పవర్ ను మరియు 718 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది.

లలిత్ మోడీ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా.. ఇవన్నీ లండన్ లోనే..

6. బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 760 ఎల్ఐ

లలిత్ మోడీ కార్ గ్యారేజీలో బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 760 ఎల్ఐ (BMW 7-Series 760 Li) కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 1.95 కోట్లు. ఈ లగ్జరీ సెడాన్ లో శక్తివంతమైన 6-లీటర్ వి12 పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది గరిష్టంగా 540 బిహెచ్‌పి శక్తిని మరియు 760 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 760 ఎల్ఐ క్లాసీ లగ్జరీ క్యాబిన్‌తో వస్తుంది.

లలిత్ మోడీ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా.. ఇవన్నీ లండన్ లోనే..

7. ఆస్టన్ మార్టిన్ రాపిడ్

జేమ్స్ బాండ్ కారుగా ప్రసిద్ది చెందిన ఆస్టన్ మార్టిన్ కారు కూడా లలిత్ మోడీ కార్ గ్యారాజ్ లో ఉంది. ఓ నివేదిక ప్రకారం, లలిత్ మోడీ దివంగత భార్య మినాల్ తన భర్త నుండి ఓ ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్‌ (Aston Martin Rapide) కారును బహుమతిగా అందుకున్నారు. అధిక-పనితీరు గల ఈ స్పోర్ట్స్ సెలూన్ 2010లో ప్రవేశపెట్టబడింది. ఇందులోని 6-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి12 పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 350 బిహెచ్‌పి శక్తిని మరియు 600 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

లలిత్ మోడీ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా.. ఇవన్నీ లండన్ లోనే..

8. ఫెరారీ కాలిఫోర్నియా

లలిత్ మోడీ కార్ గ్యారాజ్ లో ఉన్న మూడవ ఫెరారీ బ్రాండ్ కారు ఫెరారీ కాలిఫోర్నియా (Ferrari California). ఈ కారును లలిత్ మోదీకి ఆయన భార్య బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. సుమారు రూ. 3.3 కోట్ల విలువైన ఈ కన్వర్టబుల్ స్పోర్ట్స్ కారు ఇప్పుడు ఉత్పత్తిలో లేదు. ఈ రెండు-సీట్ల సూపర్ కారులో ట్విన్-టర్బో 3.9-లీటర్ వి8 ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 482.7 బిహెచ్‌పి శక్తిని మరియు 505 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, July 18, 2022, 15:00 [IST]
English summary
Lalit modi s luxury car collection in london details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+