దొంగలించిన 6 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన మాజీ ముఖ్యమంత్రి కారు

మన దేశంలో కార్ల దొంగతనం కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ కారణంగానే కంపెనీలు కార్లలో అనేక కొత్త ఫీచర్లను అందిస్తున్నాయి. ఈ కొత్త ఫీచర్స్ ద్వారా కారు దొంగతనాలు నివారించవచ్చని కంపెనీ వారు చెప్పినప్పటికీ ఈ వాహన దొంతనాలు పూర్తిగా నిలువరించలేకపోతున్నారు. దొంగలు కూడా కొత్త కొత్త టెక్నాలజీలు ఉపయోగించి దొంగతనాలకు పాల్పడుతున్నారు.

దొంగలించిన 6 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన మాజీ ముఖ్యమంత్రి కారు

ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో దొంగిలించబడిన 26 వాహనాలను ఇటానగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 22 టయోటా ఫార్చ్యూనర్, 2 హ్యుందాయ్ క్రెటా మరియు 2 మారుతి బ్రెజ్జా కార్లు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న కార్లలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన టయోటా ఫార్చ్యూనర్ కూడా ఉంది.

దొంగలించిన 6 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన మాజీ ముఖ్యమంత్రి కారు

లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన టయోటా ఫార్చ్యూనర్ కారు ఆరేళ్ల క్రితం దొంగిలించబడింది. ఈ టయోటా ఫార్చ్యూనర్ కారు యాదవ్ ఇంటి నుండి దొంగలించబడింది. అప్పుడు హర్యానాలోని గురుగ్రామ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

MOST READ:భారీగా పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు : ఎంతో తెలుసా

దొంగలించిన 6 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన మాజీ ముఖ్యమంత్రి కారు

ఢిల్లీ, హర్యానా, గుజరాత్, పంజాబ్‌లలో ఎక్కువ వాహనాలు దొంగిలించబడ్డాయని పోలీసు అధికారి తెలిపారు. వీటిలో ఐదు వాహనాలు ఇంకా కనుగొనబడలేదు. ఈ కేసులో పన్సాగ్ తమగ్, విక్కీ గురుంగ్లను అరెస్టు చేశారు. ఇద్దరినీ బెయిల్‌పై విడుదల చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు అనేక వాహనాల దొంగతనం గురించి కూడా తెలిపాడు. దొంగిలించబడిన ఈ కార్లలో లాలూ ప్రసాద్ యాదవ్ కారు కూడా కనుగొనబడింది.

దొంగలించిన 6 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన మాజీ ముఖ్యమంత్రి కారు

స్వాధీనం చేసుకున్న వాహనాల్లో నకిలీ నంబర్ ప్లేట్లు ఉన్నాయి. వీటిలో 5 వాహనాల్లో ఒకే నెంబర్ ప్లేట్ ఉంది. స్వాధీనం చేసుకున్న ఈ వాహనాలన్నింటికీ సుమారు రూ. 9.34 కోట్లు ఖర్చవుతాయి. దొంగలు కార్లకు ఎటువంటి నష్టం కలిగించలేదు. అన్ని కార్లు మంచి స్థితిలో ఉన్నాయి.

MOST READ:హ్యుందాయ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే ?

దొంగలించిన 6 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన మాజీ ముఖ్యమంత్రి కారు

సాధారణంగా కార్లు దొంగిలించబడిన తరువాత విడిగా అమ్ముతారు. తద్వారా వాటిని ఎవరూ గుర్తించలేరు. కారు దొంగతనం నివారించడానికి వాహన తయారీ సంస్థలు ఇటీవల కాలంలో అనేక ఫీచర్స్ అందిస్తున్నారు.

దొంగలించిన 6 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన మాజీ ముఖ్యమంత్రి కారు

కొత్త కార్లలో జీపీఎస్ సిస్టం అంరచడం జరిగింది. ఒకవేళ దొంగతనాలు జరిగినట్లయితే ఈ జిపిఎస్ సిస్టం ద్వారా సులభంగా దొంగలించబడిన కార్లను గుర్తించవచ్చు. ఇది ప్రస్తుతం కాలంలో చాలా అవసరం. ఎందుకంటే దొంగలించిన వాహనాలను సులభంగా గుర్తించవచ్చు.

MOST READ:సురక్షితమైన ప్రయాణానికి శానిటైజ్ క్యాబ్ సర్వీస్, ఇదే

Most Read Articles

English summary
Lalu Prasad Yadav stolen Toyota Fortuner recovered after 6 years. Read in Telugu.
Story first published: Saturday, June 13, 2020, 10:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X