ఏడు పదుల వయసులో కూడా హుందాగా జీపు డ్రైవ్ చేసిన 'లాలూ ప్రసాద్ యాదవ్'.. వీడియో

సాధారణంగా అందరికి కార్లు మరియు బైకులపైనా ఎంతో కొంత వ్యామోహం తప్పనిసరిగా ఉంటుంది. ఈ కారణంగానే వారు తమకు నచ్చిన కార్లు మరియు బైకులను అప్పుడప్పుడు నడుపుతూ చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల బీహార్ మాజీ ముఖ్యమంత్రి 'లాలూ ప్రసాద్ యాదవ్' తన నివాసంలో జీప్ నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో షేర్ చేశారు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఏడు పదుల వయసులో కూడా హుందాగా జీపు డ్రైవ్ చేసిన 'లాలూ ప్రసాద్ యాదవ్'.. వీడియో

'లాలూ ప్రసాద్ యాదవ్' పాట్నాలోని తన నివాసంలో ఈ వయసులో జీపులో ప్రయాణించి ప్రజలందరిని ఆశ్చర్యపరిచారు. ఏడు పదుల వయసుదాటినప్పటికీ లాలూ ప్రసాద్ యాదవ్ చాలా ఉత్సాహంగా జీప్ డ్రైవ్ హేయడం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. అతనే స్వయంగా జీపును నడుపుతున్న వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.

ఏడు పదుల వయసులో కూడా హుందాగా జీపు డ్రైవ్ చేసిన 'లాలూ ప్రసాద్ యాదవ్'.. వీడియో

ఈ వీడియో షేర్ చేసిన లాలూ ప్రసాద్ యాదవ్, చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజే తన మొదటి కారును డ్రైవ్ చేశానని తెలిపారు. ఈ ప్రపంచంలో జన్మించిన వారందరూ ఏదో ఒక రూపంలో డ్రైవర్లే అని కూడా ప్రస్తావించారు. మీ జీవితం ప్రేమ, సామరస్యం, సమానత్వం, శ్రేయస్సు, శాంతితో నిండి ఉండాలి. సహనం, న్యాయం మరియు సంతోషం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచుతుంది అని కూడా ఆయన తెలిపారు.

ఏడు పదుల వయసులో కూడా హుందాగా జీపు డ్రైవ్ చేసిన 'లాలూ ప్రసాద్ యాదవ్'.. వీడియో

లాలూ ప్రసాద్ యాదవ్ అనుకుంటే ఆధునిక కార్లనే నడపవచ్చు, కానీ లాలూ తన పాత జీపునే నడపాలని గత మంగళవారం రాత్రి నుంచి పట్టుబడ్డాడు. అయితే, ఏదో లోపం కారణంగా జీపు గ్యారేజ్ కి వెళ్ళింది. తన జీపు ఎప్పుడు వస్తుంది అని అయన అడుగుతూనే ఉన్నారు. అయితే బుధవారం ఉదయం జీపు రాగానే ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఒంటరిగా డ్రైవింగ్‌కు వెళ్లిపోయారు. ఆ సమయంలో లాలూ నివాసం వద్ద ఉన్న ఎవరికీ లాలూ యాదవ్ జీపు నడపడానికి తనంతట తానుగా బయటకు వస్తాడనే ఆలోచన కూడా లేదు. కానీ ఆ సమయంలో పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆయన నివాసానికి హాజరయ్యారు.

ఏడు పదుల వయసులో కూడా హుందాగా జీపు డ్రైవ్ చేసిన 'లాలూ ప్రసాద్ యాదవ్'.. వీడియో

నివేదికల ప్రకారం లాలూ యాదవ్ యొక్క ఇక్కడ కనిపించే పాత మహీంద్రా జీప్ అతని మొదటి వాహనం అని తెలిసింది. అతడు అనేక సార్లు తన ఎన్నికల ర్యాలీల్లో ఈ జీపులో నుంచి ప్రచారం చేశారు. అయితే తరువాత కాలంలో ఈ జీపును వాడకపోవడం వల్ల ఈ జీపు పాడైందని తెలిపారు. కానీ ఇటీవల అతడు తన జీపును డ్రైవ్ చేయాలని పట్టుబట్టడం వల్ల పాట్నాకు చెందిన మెకానిక్ దీనిని మళ్ళీ రిపేర్ చేసారు.

ఏడు పదుల వయసులో కూడా హుందాగా జీపు డ్రైవ్ చేసిన 'లాలూ ప్రసాద్ యాదవ్'.. వీడియో

'లాలూ ప్రసాద్ యాదవ్' డ్రైవ్ చేసిన ఈ జీపులో బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, శివానంద్‌ తివారీ, శరద్‌ యాదవ్‌ సహా పలువురు పెద్ద నేతలు ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన సంఘటనగా అతను చెప్పుకొచ్చారు. చాలా రోజుల తరువాత అతడు ఈ జీపు నడిపి చాలా ఆనందం పొందాడు.

ఏడు పదుల వయసులో కూడా హుందాగా జీపు డ్రైవ్ చేసిన 'లాలూ ప్రసాద్ యాదవ్'.. వీడియో

నివేదికల ప్రకారం, దాణా కుంభకోణానికి సంబంధించిన మరో కేసులో లాలూ యాదవ్ మంగళవారం పాట్నాలోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఇది పశుగ్రాసం కుంభకోణం 1980 లు మరియు 1990 లలో అవిభక్త బీహార్‌లోని అనేక ట్రెజరీల నుండి సుమారు రూ.1,000 కోట్ల మోసానికి సంబంధించినది. వివిధ జిల్లాల్లో అక్రమాలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. 2017 మరియు 2018 లో పలు ఇతర కేసుల్లో దోషిగా తేలడంతో రాంచీలోని జైలులో చాలా కాలం గడపాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో జార్ఖండ్ హైకోర్టు బెయిల్‌పై విడుదలయ్యాడు. ప్రస్తుతం బెయిల్‌పై, RJD నాయకుడు ఢిల్లీలో తన పెద్ద కుమార్తె మిసాతో ఉన్నారు. అక్కడే అతను కావాల్సిన వైద్య సదుపాయాలను పొందుతూ ఉన్నారు.

ఏడు పదుల వయసులో కూడా హుందాగా జీపు డ్రైవ్ చేసిన 'లాలూ ప్రసాద్ యాదవ్'.. వీడియో

లాలూ ప్రసాద్ యాదవ్ విషయానికి వస్తే, సాధారణ రైతుకుటుంభం నుంచి వచ్చిన ఇతడు ఏడు సంవత్సరాలు పాటు బీహార్ ముఖ్యమంత్రిగా ఉండటమే కాకుండా, గడచిన 20 సంవత్సరాల్లో రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న రాజకీయ దురంధరుడు.

ఇక లాలూ ప్రసాద్ యాదవ్ ఉపయోగించిన జీప్ విషయానికి వస్తే, ఇది చూడటానికి సింపుల్ గా ఉన్నప్పటికీ చాలా దృడంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇవి ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. కావున ఎలాంటి రోడ్డులో అయినా సజావుగా ముందుకు సాగవచ్చు.

ఏడు పదుల వయసులో కూడా హుందాగా జీపు డ్రైవ్ చేసిన 'లాలూ ప్రసాద్ యాదవ్'.. వీడియో

సాధారణంగా చాలామంది సెలబ్రెటీలకు ఎన్ని కార్లు మరియు బైకులు ఉన్నప్పటికీ తమ వద్ద వున్న తమ మొదటి కారుని చాలా ప్రత్యేకంగా మరియు చాలా అపురూపంగా చూస్తారు. సచిన్ వంటి వారి వద్ద కూడా తమ మొదటి కారు ఇప్పటికి కూడా ఉంది. చాలామందికి తమ మొదటి కార్లంటే చాలా ఇష్టం, కావున వీటిపై వారికున్న అభిమానం ఎప్పుడూ ప్రత్యేకమైనదే అని చెప్పాలి.

Most Read Articles

English summary
Lalu yadav drives his first jeep vehicle in patna residence details
Story first published: Thursday, November 25, 2021, 11:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X