అపార్ట్‌మెంట్ కొనుగోలు చేస్తే లాంబోర్గినీ అవెంటేడర్ ఉచితం!
గతంలో అమెరికాలోని ఫ్లోరిడాలో 13 మిలియన్ డాలర్ల ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేసిన వారికి రోల్స్ రాయిస్ కారును కానుకగా ఇస్తామని ఓ ప్రాపర్టీ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసినదే. తాజాగా, ఇప్పుడు దుబాయ్‌లో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన వారికి ఏకంగా లాంబోర్గినీ అవెంటేడర్ సూపర్ కారునే కానుకగా ఇస్తామని మరో ప్రాపర్టీ సంస్థ ప్రకటించింది.
దుబాయ్‌లోని ఓ రియల్ ఎస్టేట్ డెవెలపర్ 15 మిలియన్ డాలర్ల పెంట్‌హౌస్ అపార్టుమెంట్ కొంటే 4,00,000 డాలర్ల విలువ చేసే లాంబోర్గినీ అవెంటేడర్ కారును ఉచితంగా ఇస్తామని ప్రకటించినట్లు న్యూయార్కు డెయిలీ పేర్కొంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఆకాశహార్యం అయిన బుర్జ్ కలిఫా సమీపంలో బామాస్ మాన్షన్ అపార్టుమెంట్ బిల్డింగ్‌లు నిర్మించారు. ఇందులో అన్ని విలాసవంతమైన సౌకర్యాలు, సదుపాయాలను అందుబాటులో ఉంచారు.
వీటిలో ప్రధానంగా.. స్పా, బట్లర్ సర్వీస్‌తో పాటు ప్రైవేట్ జెట్, యాచ్ చార్టర్‌ల వంటి సకల సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. ఎక్కువ డబ్బు చెల్లించి భారీ విలాసవంతమైన అపార్టుమెంటులను కొనలేని వారి కోసం కాస్తంత తక్కువ విలాసవంతమైన అపార్టుమెంటు భవనాలు కూడా ఇక్కడ నెలకొల్పారు. ఇలాంటి తక్కువ ధర కలిగిన అపార్టుమెంట్లను కొనే వారికి బిఎమ్‌డబ్ల్యూ ఎస్‌యూవీ లేదా మినీ కూపర్ హ్యాచ్‌బ్యాక్‌లను ఉచితంగా ఇచ్చేందుకు రియల్టర్లు ముందుకు వస్తున్నారు.

దుబాయ్‌లోని డామాక్ ప్రాపర్టీస్ డిఎస్‌ఎఫ్ ప్రమోషన్ ప్రతి ఏడాది సరికొత్త ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే, తాజాగా ఈ కొత్త ఆఫర్‌ను ప్రకటించామని, ఫలితంగా కంపెనీ మంచి ఫలితాలను దక్కించుకుంటోందని డామాక్ ప్రాపర్టీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ నీయిల్ మెక్ లోగ్లిన్ ఖలీజ్‌టైమ్స్‌కు వెల్లడించారు. దుబాయ్‌కి విచ్చేసే అంతర్జాతీయ పర్యాటకులు ఎంపిక చేసిన యూనిట్లు కొనుగోలు చేస్తే వారికి తప్పకుండా 2014 మోడల్ లాంబోర్గినీ, బిఎమ్‌డబ్ల్యూ, మినీ కూపర్ కార్లను ఇస్తామని తెలిపారు.
గడచిన సంవత్సరంలో (2013లో) పెంట్‌హౌస్‌లు కొనుగోలు చేసిన వారికి 2014 ఆడి ఆర్8, మూడు బెడ్‌రూమ్‍లు ఉన్న అపార్టుమెంటును కొనుగోలు చేసిన వారికి ఆడి ఏ8, రెండు బెడ్ రూమ్‌లు ఉన్న బిల్డింగ్ కొనుగోలు చేసిన వారికి ఆడి ఏ6, సింగిల్ బెండ్ రూమ్ కొనుగోలు చేసిన వారికి ఆడి ఏ4 కార్లను కానుకగా ఇచ్చారు.


Click it and Unblock the Notifications








