ఇళ్ల కొనుగోలు పై ల్యాంబోర్గిని లేదా బిఎమ్‌డబ్ల్యూ ఉచితం: డమాక్ ప్రాపర్టీస్
కొత్తగా ఫ్లాట్లు గాని, ఇళ్లు గాని కొనుగోలు చేసేవారికి ఉచిత గిఫ్ట్‌ల క్రింద ఏ టీవీలనో, ఫ్రిజ్‌లనో కొన్ని సార్లు బైకులను ఉచితంగా ఇస్తుంటారు. కాని ఒక లగ్జరీ రియల్ ఎస్టేట్ సంస్థ తమ ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారికి ల్యాంబోర్గిని లేదా బిఎమ్‌డబ్ల్యూ కార్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ప్లాట్లు కొంటే లగ్జరీ కార్లను బహుమతిగా ఇవ్వడమేంటి అని అశ్చర్యపోతున్నారా ...! దీనికి సంభందించిన అన్ని సందేహాలు గురించి క్రింది కథనంలో తెలుసుకోవచ్చు.

దుబాయ్ కు చెందిన డమాక్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ తమ లగ్జరీ విల్లాలను మరియు అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేసిన వారకి ఈ ల్యాంబోర్గిని మరియు బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్లను ఉచితంగా అందిస్తోంది.

అయితే వీరు ఇలా ఆఫర్లను కల్పించడానికి మరొక కారణం కూడా ఉందిలేండి. దాదాపుగా గత నెల కాలం నుండి దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (డిఎస్‌ఎఫ్) పండుగ జరుగుతోంది. అందులో భాగంగానే ఇలా తమ వినియోగదారులకు ఆఫర్లను ప్రకటించామని నిర్వాహకులు తెలిపారు.

డమాక్ ప్రాపర్టీస్ వారు ఇంత ఖరీదైన కార్లను బహుమతిగా ఇస్తున్నారంటే మరి వారి విల్లాల ఖరీదు ఏ రేంజ్‌లో ఉంటుందో తెలుసా ? డమాక్ ప్రాపర్టీస్ వారి ఒక్కొక్క అపార్ట్‌మెంట్ దాదాపుగా 188,000 అమెరికన్ డాలర్లు గా ఉంది.

డమాక్ విల్లాలను కొనుగోలు చేసేవారికి అందించడానికి డమాక్ సంస్థ 2016 మోడల్‌కు చెందిన ల్యాంబోర్గిని హురాకాన్, బిఎమ్‌డబ్ల్యూ 730 ఐ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎక్స్ డ్రైవ్ 35ఐ మరియు ఇతర లగ్జరీ కార్లను సిద్దం చేసుకుంది.

డమాక్ వారి విల్లాలను కొనుగోలు చేసిన అనంతరం వారు కొనుగోలు చేసిన ఇంటి ధరలో 20 శాతం చెల్లిస్తే మిగతా సొమ్మును డమాక్ ప్రాపర్టీస్ వారు చెల్లించి వినియోగదారులకు కారును అందిస్తారు.

కారును వద్దు అనుకునే వారికి నగదు రూపంలో బహుమానంగా అందించనున్నారు.

2016 లో దుబాయ్‌లో జరుగుతున్న దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది వచ్చి పాల్గొంటుంటారు ఈ పండుగులో డమాక్ ప్రాపర్టీస్ సంస్థ తరపున పాల్గొంటుంన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సంస్థ ప్రెసిడెంట్ తెలిపాడు.

- యస్-క్రాస్ మీద 5.5 లక్షల రుపాయలు డిస్కౌంట్ ప్రకటించిన నెక్సా షోరూమ్ డీలర్లు
- ప్రపంచ వ్యాప్తంగా 2016 సంవత్సరానికి అత్యంత సురక్షితమైన ఎయిర్‌లైన్స్: ఇక్కడ క్లిక్ చేయండి
- షెవర్లే లో కూడా ఒక బోల్ట్ కారు ఉంది తెలుసా ?


Click it and Unblock the Notifications








