Just In
- 1 hr ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 1 hr ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
- 2 hrs ago
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 16 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
Don't Miss
- News
నాన్సీ ల్యాప్‌టాప్ చోరీ? రష్యా ఇంటలిజెన్స్‌కు చేరవేసే ప్లాన్.. ఎఫ్‌బీఐ అఫిడవిట్లో సంచలనాలు..
- Sports
వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డు.. ధోనీ కన్నా వేగంగా!!
- Finance
Gold prices today : స్థిరంగా బంగారం ధరలు, వెండి ధరలు జంప్
- Lifestyle
మీరు ఎప్పుడూ ఎందుకు అలసిపోతున్నారు?అందుకు సాధారణ కారణాలు ఇక్కడ ఉన్నాయి..
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లంబోర్ఘినితో చేతులు కలిపిన అమెరికన్ సింగర్ లేడీ గాగా ; ఎందుకో తెలుసా ?
కరోనా మహమ్మరి భారతదేశాన్ని మాత్రమే కాకుండా దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలను ప్రభావితం చేసింది. కరోనా సమయంలో భాదితులకు సహాయం చేయడానికి చాలా సంస్థలు మరియు వ్యక్తులు ముందుకు వచ్చారు. ఇప్పుడు ప్రముఖ కార్ తయారీ సంస్థ లంబోర్గిని సంస్థ లేడీ గాగా తో కలిసి ప్రజలకు సహాయం చేయడానికి, ముందుకు వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

వృత్తిపరంగా "లేడీ గాగా" అని పిలబడే "స్టెఫానీ జోవాన్ ఏంజెలీనా" ఒక అమెరికన్ సింగర్. అంతే కాకుండా ఈమె సాంగ్స్ రైటర్, యాక్టర్ మరియు వ్యాపారవేత్త. లేడీ గాగా ఇప్పుడు ప్రముఖ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని యొక్క ప్రయోజనం కోసం చేతులు కలిపినట్లు సమాచారం. కోవిడ్-19 బాధితులకు సహాయం చేయడానికి లంబోర్ఘిని కంపెనీ మరియు లేడీ గాగా పనిచేసినట్లు చెబుతున్నారు.

దీని ద్వారా కరోనా పీడిత బాధితుల సహాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కరోనావైరస్ బాధితుల కోసం డబ్బును సేకరించడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడానికి ఈమె ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభంలో ప్రపంచంలోని దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు వివిధ మార్గాల్లో మద్దతు ఇచ్చాయి.
MOST READ:37 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ అందజేసిన మొదటి మారుతి 800 కారు ఇదే, చూసారా..!

భారతదేశంలో టాటా గ్రూప్ యొక్క సహకారం నింజంగా చాలా ప్రశంసనీయం. టాటా మోటార్స్‌తో పాటు మహీంద్రా & మహీంద్రా వంటి సంస్థలు కూడా చాలా వరకు ఆర్థిక సహాయం చేశాయి. కరోనావైరస్ బాధితులకు ఆర్థిక సహాయం అందించడానికి లంబోర్ఘిని ఇప్పుడు లేడీ గాగాతో జతకట్టింది. నిధుల సేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

కరోనా బాధితుల సహాయార్థం ఈ పనులు డిసెంబర్ 16 వరకు జరుగుతాయి. గాగా యొక్క ప్రత్యేక కార్యక్రమాలు ఒమాజ్ ప్లాట్‌ఫాం ద్వారా జరుగుతాయి. ఇందులో పాల్గొనడానికి ఎటువంటి ఛార్జీ లేదని చెబుతారు. కానీ కరోనా వైరస్‌తో బాధపడేవారికి సహాయం చేయడానికి డబ్బును సమీకరిస్తున్నారు.
MOST READ:ఈ-రిక్షాలు ఇవ్వనున్న సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

ఆదాయంలో ఎక్కువ భాగం లేడీ గాగా యొక్క బోర్న్ ది వే ఫౌండేషన్‌కు వెళ్తుంది. అంతే కాకుండా లేడీ గాగా టుగెదర్ రైజింగ్ అనే సంస్థకు సహాయం చేయాలనుకుంటున్నారు. బాధితులకు సేవ చేయడానికి ముందుకు వచ్చిన లేడీ గాగాని చాలామంది ప్రశంసిస్తున్నారు.

ఇక్కడ మనం గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఆశ్చర్యకరమైన బహుమతి ఇవ్వబడుతుంది. ఇందులో పాల్గొనే వారిలో ఒక అదృష్టవంతులకి 911 ఆల్బమ్‌లో లేడీ గాగా ఉపయోగించిన లంబోర్ఘిని కారు ఇవ్వబడింది.

సింగర్ లేడీ గాగా మరియు లంబోర్ఘిని కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ పని కోసం ఇద్దరూ భారీ మొత్తంలో డబ్బును సమీకరించాలని భావిస్తున్నారు. ప్రదర్శన చివరి రోజు డిసెంబర్ 16 న ఫలితాలు ప్రకటించబడతాయి. వీరు చేస్తున్న ఈ పనికి ఇప్పటికే చాలామంది ప్రజల నుండి మద్దతు పెరుగుతుండటం కూడా గమనార్హం.