వీడియో: గాల్లోకి ఎగిరిన లాంబోర్గినీ, ఖరీదైన కార్లు ధ్వంసం
లాంబోర్గినీ వంటి సూపర్ కార్లంటే డబ్బున్నోళ్ల పిల్లలకి ఆట వస్తువుల్లాంటివి. ఇలాంటి కార్లు చాలా శక్తివంతమైనవి. వీటిని నడపాలంటే, సరైన శిక్షణ, నైపుణ్యం మరియు అవాగహన ఎంతో అవసరం. అనుభవం లేకుండా, నేరుగా ఇలాంటి కార్లను నడపాలని ప్రయత్నిస్తే, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
ఇదిగో ఈ వీడియోలో చూడండి, రద్దీగా సిటీ రోడ్డుపై రయ్యమంటూ దూసుకొచ్చిన ఓ లాంబోర్గినీ కారు ఎంత రచ్చ రచ్చ చేసిందో. ఓ నలుపు రంగు లాంబోర్గినీ అవెంటేడర్ సూపర్‌కారు వేగంగా వచ్చి, అదుపు తప్పడంతో పక్కగా వెళ్తున్న ఓ మజ్దా కారును, అలాగే రోడ్డుకు మరో పక్క పార్క్ చేసి ఉన్న బిఎమ్‌డబ్ల్యూ కారును గుద్దుకుంటూ పోయింది.
అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు కానీ, మూడు కార్ల మాత్రం ముందు వైపు భాగా దెబ్బతిన్నాయి. ఈ యాక్సిడెంట్ వీడియోను రోడ్డుపై నిలుచున్న ఓ వ్యక్తి తన కెమరాలో బంధించాడు. మరి ఆ వీడియోని మనం కూడా చూసేద్దామా..?
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/kfS8iz2NaLE?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








