అమ్మకానికి సిద్ధంగా ఉన్న విరాట్ కోహ్లీ Lamborghini కార్.. మీరు కొంటారా..!!

సాధారణంగా సూపర్ కార్స్ మరియు లగ్జరీ కార్ అంటే చాలా మందికి ఇష్టం. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కార్లను కొనుగులు చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొనుగోలు చేసే వారిలో సీనీ పరిశ్రమలోని వారు, క్రికెటర్స్, పారిశ్రామిక వేత్తలు మరియు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. అయితే వీరిలో అప్పుడప్పుడు తమ కార్లను అమ్మకానికి పెడుతుంటారు. ఆ సమయంలో వాహనప్రియులు వాటిని సొంతం చేసుకోవడానికి ఎగబడుతుంటారు.

అమ్మకానికి సిద్ధంగా ఉన్న విరాట్ కోహ్లీ Lamborghini కార్.. మీరు కొంటారా..!!

ఇప్పుడు ఇండియా క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ Lamborghini Gallardo (లంబోర్ఘిని గల్లార్డో) కారుని అమ్మకానికి పెట్టారు. విరాట్ కోహ్లీ యొక్క ఈ కారు 2013 మోడల్. దీనిని కోహ్లీ 2015 లో కొనుగోలు చేశారు. ఇప్పుడు కోహ్లీ యొక్క లంబోర్ఘిని గల్లార్డో కారును సొంతం చేసుకునే అరుదైన అవకాశం ఇప్పుడు మీరు కూడా పొందవచ్చు.

అమ్మకానికి సిద్ధంగా ఉన్న విరాట్ కోహ్లీ Lamborghini కార్.. మీరు కొంటారా..!!

భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనుగోలు చేసిన Lamborghini Gallardo కారుని ఎక్కువ కాలం ఉపయోగించలేదు. దీనిని కోహ్లీ 2015 కొనుగోలు చేసి అతి తక్కువ కాలంలోనే అమ్మినట్లు తెలిసింది. ప్రస్తుతం, ఈ కారు కొచ్చిలోని రాయల్ డ్రైవ్ సమీపంలో అమ్మకానికి అందుబాటులో ఉంది, ఇక్కడ ఈ కారు ధర రూ .1.35 కోట్లుగా నిర్ణయించారు. ఈ Lamborghini Gallardo నారింజ రంగులో ఉంది.

అమ్మకానికి సిద్ధంగా ఉన్న విరాట్ కోహ్లీ Lamborghini కార్.. మీరు కొంటారా..!!

Lamborghini కంపెనీ స్పోర్ట్స్ కార్లు మరియు SUV లను తయారు చేస్తుంది. స్పోర్ట్స్ ట్రాక్‌లో బలమైన పనితీరు కోసం కంపెనీ తన కార్లలో అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌లను ఉపయోగిస్తుంది. ఇందులో భాగంగానే Lamborghini Gallardo 560 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే 5.2-లీటర్, వి 10 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఈ కారు కేవలం 4 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగవంతం చేయగలదు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 324 కిమీ.

అమ్మకానికి సిద్ధంగా ఉన్న విరాట్ కోహ్లీ Lamborghini కార్.. మీరు కొంటారా..!!

Lamborghini కంపెనీ ఈ Lamborghini Gallardo కారుని 2003 నుండి 2013 వరకు తయారు చేసింది. అయితే ఆ తరువాత కంపెనీ ఈ మొల్ల ని నిలిపివేసించి. ఈ కారు హార్డ్ టాప్ మరియు కన్వర్టిబుల్ రూఫ్‌టాప్ వేరియంట్‌లలో తయారు చేయబడింది. అమ్మకానికి అందుబాటులో ఉన్న విరాట్ కోహ్లీ కారు కన్వర్టిబుల్ రూఫ్‌టాప్ మోడల్, దీని బటన్‌ను నొక్కడం ద్వారా పైకప్పును ఓపెన్ చేయవచ్చు మరియు క్లోజ్ చేయవచ్చు.

అమ్మకానికి సిద్ధంగా ఉన్న విరాట్ కోహ్లీ Lamborghini కార్.. మీరు కొంటారా..!!

సాధారణంగా విరాట్ కోహ్లీకి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అంతే కాకుండా యితడు ఆడి ఇండియా బ్రాండ్ అంబాసిడర్ కూడా. కోహ్లీ యొక్క గ్యారేజ్ లో ఆడి ఆర్ 8, ఆడిక్యూ 7, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ మరియు బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ వంటి ఖరీదైన వాహనాలు ఉన్నాయి. దీనితో పాటు ఆడి R8 V10 ని కూడా కలిగి ఉన్నారు. ఈని ధర 3 కోట్లు కాగా, భారతదేశంలో బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ ప్రారంభ ధర రూ .3.50 కోట్లు

అమ్మకానికి సిద్ధంగా ఉన్న విరాట్ కోహ్లీ Lamborghini కార్.. మీరు కొంటారా..!!

Audi R8 (ఆడి R8):

విరాట్ కోహ్లీ కలిగి ఉన్న కార్లలో ఆడి బ్రాండ్ యొక్క ఆడి R8 V10 ఒకటి. కోహ్లీ ఈ కారులో చాలాసార్లు ప్రయాణిస్తూ కనిపించాడు. విరాట్ ఆడి ఇండియా బ్రాండ్ అంబాసిడర్ కూడా, కాబట్టి అతను తన గ్యారేజీకి కొత్త ఆడి కార్లను జోడిస్తూ ఉంటాడు. ఈ కారు ఖరీదు రూ .2.6 కోట్లు.

అమ్మకానికి సిద్ధంగా ఉన్న విరాట్ కోహ్లీ Lamborghini కార్.. మీరు కొంటారా..!!

Audi Q7 (ఆడి క్యూ7):

విరాట్ కోహ్లీ అడా మరొక ఆడి కార్ 'ఆడి క్యూ 7'. ఇది అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ కారు కేవలం 5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. భారతదేశంలో దీని ధర 70 లక్షల రూపాయలు. ఇది వాహన వినియోగదారులకు లగ్జరీ అనుభవాన్ని అందిస్తుంది.

అమ్మకానికి సిద్ధంగా ఉన్న విరాట్ కోహ్లీ Lamborghini కార్.. మీరు కొంటారా..!!

Land Rover Range Rover (ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్):

విరాట్ కోహ్లీ బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ Land Rover యొక్క ఆఫ్-రోడర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీని కలిగి ఉన్నారు. ఈ కారు దాని ఆఫ్-రోడింగ్ సామర్ధ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఈ కారు భారతదేశంలోని ఆఫ్-రోడింగ్ ప్రేమికులకు బాగా నచ్చిన కారు. ఇండియన్ మార్కెట్లో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ధర రూ. 2 కోట్ల నుండి ప్రారంభమవుతుంది.

అమ్మకానికి సిద్ధంగా ఉన్న విరాట్ కోహ్లీ Lamborghini కార్.. మీరు కొంటారా..!!

Bentley Flying Spur (బెంట్లీ ఫ్లయింగ్ స్పర్):

విరాట్ గ్యారేజీలోని అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటి బెంట్లీ ఫ్లయింగ్ స్పర్. కోహ్లీ చాలాసార్లు ఢిల్లీలో తన వైట్ కలర్ బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ నడుపుతూ కనిపించాడు. భారతదేశంలో బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ బేస్ వేరియంట్ ధర రూ. 3.41 కోట్లు, ఎక్స్-షోరూమ్, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ .3.93 కోట్లు వరకు ఉంటుంది.

Most Read Articles

English summary
Lamborghini gallardo available for sale once owned by virat kohli
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X