లాంబోర్గినీ కార్ల తయారీకి బీజం ఎలా పడిందో తెలుసా?
లాంబోర్గినీ.. ఈ పేరు వినగానే అత్యంత అరుదైన, విలాసవంతమైన, ఖరీదైన లగ్జరీ స్పోర్ట్స్/సూపర్ కార్లు గుర్తుకు వస్తాయి. ఇటలీకు చెందిన సూపర్ కార్ కంపెనీ లాంబోర్గినీ గురించి ఓ చిన్న సత్యాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
వాయువేగంతో దూసుకు వెళ్లే కార్లను తయారు చేసే లాంబోర్గినీ అసలు మొట్టమొదట ట్రాక్టర్లను ఉత్పత్తి చేసేది. అప్పట్లో లాంబోర్గీని ట్రాక్టర్ల ఉత్పత్తి గురించే తెలుసు తప్ప, కార్ల ఉత్పత్తి గురించి అస్సలు తెలిసేది కాదు. మరి లాంబోర్గినీ కార్ల ఉత్పత్తికి బీజం ఎలా పడింది?
లాంబోర్గీనీ సంస్థ యజమాని ఫెరుషియో లాంబోర్గినీ (Ferrucio Lamborghini) వద్ద అప్పట్లో ఓ ఫెరారీ కారు ఉండేది. తన ఫెరారీ కారులో విరిగిపోయిన క్లచ్‌ను రీప్లేస్ చేయమని ఫెరారీ వద్దకు వెళ్లగా, తానొక ట్రాక్టర్ తయారీదారుడన్న కారణంగా, అతడిని లోకువ చేసి, సదరు క్లచ్‌ను రీప్లేస్ చేయటానికి ఫెరారీ నిరాకరించిందట.
అంతే.. ఫెరారీ మీద కోపంతో ఫెరుషియో ఫెరారీ కన్నా అందమైన కార్లను తయారు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. రాజు తలుచుకుంటే, దెబ్బలకు కొదవా.. అన్నట్లుగా, ఫెరుషియో వెంటనే ట్రాక్టర్ల ఉత్పత్తి వైపు నుంచి కార్ల ఉత్పత్తి వైపు దృష్టి పెట్టాడు. అలా పుట్టినవే నేడు మనం చూస్తున్న లాంబోర్గినీ కార్లు. (లాంబోర్గినీ ఇప్పటికీ ట్రాక్టర్లను ఉత్పత్తి చేస్తూనే ఉంది).



Click it and Unblock the Notifications








