బెంగళూరులో ఇండికా కారు మీదకు దూసుకెళ్లిన లాంబోర్గిని హురాకాన్
ఇండియాలో ఇప్పుడిప్పుడు సూపర్ కార్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. అయితే ఆ సూపర్ కార్ల యజమానుల మళ్లీ భారీ మొత్తంలో చెల్లించే రిపేరీలు చేయించుకుంటున్నారు.
భారత దేశపు ఐటి రాజధాని నగరం బెంగళూరులో లాంబోర్గిని హురాకాన్ సూపర్ కారు ఒకటి టాటా ఇండికా కారు మీదకు దూసుకెళ్లింది. అయితే హురాకాన్ ప్రక్కవైపుల భారీగా ధ్వంసమయ్యింది.

టాటా ఇండికాను ఢీకొన్న అనంతరం హురాకాన్ ముందు మరియు ప్రక్కవైపున భారీగా ధ్వంసమైంది. కానీ ఈ ప్రమాదానికి కారణమైన మరో కారుకు సంభందించిన వివరాలు లభించలేదు.

ఫ్రంట్ బంపర్ మరియు అల్లాయ్ విడిభాగాలు స్వల్పంగా డ్యామేజ్‌కు గురయ్యాయి. ప్రమాద ధాటికి హురాకాన్ కారులోని డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ కూడా విచ్చుకుంది.

ప్రమాద కారకులు ఇండికా కారు డ్రైవరా లేదా లాంబోర్గిని కారు డ్రైవరా అనే వివరాలు తెలియరాలేదు. కానీ ప్రమాదం జరిగిన తీరును వివరించే ఫోటోలను చూస్తే లాంబోర్గిని డ్రైవర్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఈ ఏడాదిలో రోడ్డు ప్రమాదాలు భారీగా సంభవిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అధిక వేగం. మీరు ఎలాంటి వాహనం నడుపుతున్నామనేది ముఖ్యం కాదు, పబ్లిక్ రోడ్ల మీద అత్యధిక వేగంతో అస్సలు నడపకూడదు.


Click it and Unblock the Notifications








