ఒక్క క్రాష్‌తో తీవ్రంగా డ్యామేజ్‌ అయిన లంబోర్ఘినీ హురాకాన్‌ సూపర్‌ కారు.. అందుకు కారణమిదే.!!

అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కార్లలో లంబోర్ఘిని(Lamborghini) ఒకటి. ఇటాలియన్‌ బ్రాండ్‌ లంబోర్ఘినీ సూపర్‌ లగ్జరీ స్పోర్ట్స్‌ కారు భారతదేశంలో కూడా ప్రజాదరణ పొందిందనడంలో సందేహం లేదు. ఎందుకంటే దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల వద్ద లంబోర్ఘిని కారు ఉంది. కాగా ఇటీవల ఈ కారు ఘోర ప్రమాదానికి గురైంది.

అరుదుగా కనిపించే లంబోర్ఘనీ లగ్జరీ కార్లు ర్యాలీ లేదా ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు బయటకు వస్తాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే లంబోర్ఘిని బ్రాండ్ తన 60వ వార్షికోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేడుకల్లో భాగంగా రాజస్థాన్‌లో లంబోర్ఘినీ ఓనర్స్ కమ్యూనిటీ ఇన్ ఇండియా ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీకి చాలా విదేశీ కార్లు వచ్చాయి.

Lamborghini-Huracan-Super-Car-Crashed

ఈ క్రమంలో ఇదే ర్యాలీలో రూ. కోట్ల ఖరీదైన లంబోర్ఘినీ హురాకాన్(Lamborghini Huracan) కారు అనుకోకుండా ప్రమాదానికి గురి కావడం ఆందోళన కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. రాజస్థాన్‌లో జైసల్మేర్ వెళ్లే హైవే మార్గంలో ఈ ఘటన జరిగింది.

Aventador, Huracan, Urus, Huracan STOలు ఈ హైవేపై హై స్పీడ్‌లో వెళ్తుండటాన్ని వీడియోలో చూడవచ్చు. ఆకర్షణీయమైన కలర్స్‌లో ఉన్న పలువురి లంబోర్ఘిని కార్లు రోడ్డుపై చక్కర్లు కొడుతూ వెళ్తున్నాయి. కాగా ఈ కాన్వాయ్‌లో దాదాపు 60 కార్లు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన లంబోర్ఘినీ హురాకాన్ కాన్వాయ్‌లో భాగమేనని తెలుస్తోంది.

Lamborghini-Huracan-Super-Car-Crashed

ప్రమాదానికి కారణం ఈ సూపర్‌ కారు అతివేగంతో వెళ్లడమే కారణమని సమాచారం. అయితే లంబోర్ఘినీ హురాకాన్‌ కారుకు ఎదురుగా ఆవు రావడంతో కారు అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగిందని అక్కడున్న వారు చెబుతున్నారు. జైసల్మేర్‌కు 10 కిలోమీటర్ల దూరంలోని మూల్ సాగర్ గ్రామ సమీపంలో ఈ యాక్సిడెంట్‌ జరిగింది.

ఏది ఏమైనప్పటికీ, రోడ్డు పక్కన డ్యామేజ్ అయిన లంబోర్ఘిని హురాకాన్ పడి ఉండటం చూస్తుంటే.. అది ఎంత ఖరీదైన లగ్జరీ కారు అయినా, హై-స్పీడ్ ప్రమాదకరమని అని సూచిస్తుంది. కారు అదుపు తప్పి ఒక్కసారిగా 30 అడుగుల మేర రోడ్డు పక్కన ఉన్న పొదలు, చెట్లను ఢీకొట్టింది. ప్రమాదంలో కారు పూర్తిగా దుమ్ముతో పేరుకుపోయి ఉంది.

Lamborghini-Huracan-Super-Car-Crashed

ఇంత పెద్ద ప్రమాదం జరిగినా అదృష్టవశాత్తూ డ్రైవర్‌కు పెద్దగా గాయాలు కాలేదు. అతడిని అక్కడున్న మరో వ్యక్తి ట్యాక్సీ ఏర్పాటు చేసి వెనక్కి పంపించాడు. కాగా ప్రమాదం జరిగినప్పుడు రోడ్డుపై ఇతర వాహనాలేవీ లేకపోవడం అదృష్టమనే చెప్పాలి. హురాకాన్ మరేదైనా కారుతో ఢీకొని ఉంటే, ఆ ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేది. కాగా ప్రమాదానికి గురైన కారు యజమాని, కారుకు జరిగిన నష్టంపై ఇంకా వివరాలేమీ తెలియలేదు.

లంబోర్ఘిని హురాకాన్ 2013లో ఐకానిక్ గల్లార్డోకు ప్రత్యామ్నాయంగా సంస్థ పరిచయం చేసింది. ఇది 640 PS పవర్ మరియు 600 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా 5.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ V10 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. భారతదేశంలో హురాకాన్ ప్రారంభ ధర ప్రస్తుతం రూ. 3.12 కోట్లుగా గుర్తించాలి. ఇది ఎక్స్‌ షోరూమ్‌ ధర.

Lamborghini-Huracan-Super-Car-Crashed

కాగా భారత్‌లోనూ ప్రముఖుల వద్ద లంబోర్ఘినీ హురాకాన్‌ సూపర్‌ స్పోర్ట్స్‌ కారు ఉంది. టీమ్‌ ఇండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ లగ్జరీ కార్ల జాబితాలో ఈ కారు ప్రత్యేకం. ఏదేమైనా ఎంత సూపర్‌ లగ్జరీ కారు అయినా హై స్పీడ్‌ అనేది ఎంతటి నష్టాన్ని ఇస్తుందో ఈ సంఘటన ఓ ఉదాహరణ.

More from DriveSpark

Article Published On: Wednesday, October 11, 2023, 20:29 [IST]
English summary
Lamborghini huracan super car crashed due to high speed in jaisalmer rajasthan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+