Just In
Don't Miss
- Movies
Bigg Boss Tamil 4 Winner: తమిళ బిగ్ బాస్‌లో అనుకున్నదే జరిగింది.. విన్నర్‌గా టాలెంటెడ్ యాక్టర్
- News
బిడెన్ బాధ్యతల స్వీకరణ సజావుగా సాగేనా?: 9/11 నాటి పరిస్థితులు: అమెరికా గరంగరం: మిలటరీ జోన్
- Lifestyle
సోమవారం దినఫలాలు : అనవసరమైన పనులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు...!
- Finance
పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గినా.. ఆదాయం అదుర్స్: ఎందుకంటే
- Sports
సెహ్వాగ్ చెప్పిన ప్రకారం గబ్బాలో భారత్‌దేనా విజయం..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిహాల్ కల నెరవేర్చిన లాంబోర్గినీ ముంబై డీలర్షిప్
లాంబోర్గినీ ముంబై డీలర్షిప్ తమ మానవత్వాన్ని చాటుకుంది. ఈ ఫొటోలో బాలుడి పేరు నిహాల్. జన్యుపరమైన లోపం కారణంగా ఇతను ఇలా మారిపోయాడు. ఇప్పుడు ఇతని వయస్సు పదిహేనేళ్లు. ప్రోగెరియా అనే అత్యంత అరుదైన జెనిటిక్ డిసార్డర్‌తో నిహాల్ బాధపడుతున్నాడు. లాంబోర్గినీ కారులో వెళ్లాలనేది అతని చిరకాల కోరిక.
అతను కోరికను గుర్తించిన వైద్యులు, మీడియామెడిక్ కమ్యూనికేషన్, ప్రోగెరియా రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన వ్యక్తులు ఆ బాలుడి కోరికను తెలుసుకొని, ముంబైలోని లాంబోర్గినీ షోరూమ్ యాజమాన్యాన్ని సంప్రదించారు. నిహాల్ 15వ జన్మదినాన్ని విశిష్టంగా జరుపుకోవాలని లాంబోర్గినీ ముంబై షోరూమ్‌ని సంప్రదించగా, వారు అందుకు సానుకూలంగా సంప్రదించి ఈ ఏర్పాట్లు చేశారు.
మానవతా ధృక్పదంతో స్పందిన లాంబోర్గినీ నిహాల్ 15వ బర్త్‌డే అతనికి జీవితాంతం గుర్తిండిపోయేలా సెలబ్రేట్ చేసింది.

వాస్తవానికి నిహాల్ జన్మదినమైన జనవరి 20వ తేదీనే లాంబోర్గినీ ముంబై షోరూమ్‌ని సంప్రదించాల్సి ఉంది, కానీ అతని ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా ఆ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 13కి మార్చుకున్నారు.

నిహాల్ లాంబోర్గినీకి ఓ పెద్ద హార్డ్ కోర్ ఫ్యాన్. లాంబోర్గినీ కార్ల గురించి, మోడళ్ల గురించి అతను చెప్పిన విషయాలు విని షోరూమ్ యాజమాన్యం షాక్‌కు గురైంది.

నిహాల్ తన తీరిక సమయంలో ఇంటర్నెట్లో ఎక్కువగా లాంబోర్గినీ గురించి తెలుసుకుంటూ ఉంటాడు. లాంబోర్గినీ పట్ల నిహాల్‌కు ఉన్న ఉత్సుకత, ప్యాషన్‌ను చూసి డీలర్షిప్ వాళ్లు అతనికి హాట్సాఫ్ చెప్పారు.

ఈ సందర్భంగా.. నిహాల్‌కు లాంబోర్గినీ కారులో రైడ్‌ని ఆఫర్ చేయడమే కాకుండా.. అతని బర్త్‌డేని సెలబ్రేట్ చేసి ఓ లాంబోర్గినీ స్కేల్ మోడల్‌ను కానుకగా కూడా ఇచ్చారు. మరి నిహాల్ ఆరోగ్యం బాగుండాలని, అతను ఇలాంటి మరిన్ని జరుపుకోవాలని మనం కూడా కోరుకుందాం.