కోట్ల విలువ చేసే కారు నడి రోడ్డులో కాలిపోయింది.. కారణం ఏమంటే?

వాహనాల్లో మంటలు చెలరేగటం మన దేశంలో చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. కానీ విదేశాలలో ఇలాంటి సంఘటనలు చాలా ఎక్కువగా జరుగుతాయి. ఇటీవల కాలంలో ఒక కారులో మంటలు చెలరేగిన వీడియో ఒకటి బయటపడింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం రండి.

కోట్ల విలువ చేసే కారు నడి రోడ్డులో కాలిపోయింది.. కారణం ఏమంటే?

నివేదికల ప్రకారం టెస్లా యొక్క ఎలక్ట్రిక్ కార్లు యుఎస్ మరియు చైనాలో ఎక్కువ మంటల్లో చిక్కుకున్నట్లు నివేదించబడ్డాయి. ఇక్కడ జరిగిన సంఘటన తైవాన్‌లో జరిగినట్లు తెలిసింది. కానీ ఈ సారి మంటల్లో చిక్కుకున్నది టెస్లా కారు కాదు. అత్యంత ఖరీదైన లంబోర్ఘిని బ్రాండ్ యొక్క ఉరుస్.

కోట్ల విలువ చేసే కారు నడి రోడ్డులో కాలిపోయింది.. కారణం ఏమంటే?

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో చాలా వైరల్ అయ్యింది. లంబోర్ఘిని ఉరుస్ కారు నేషనల్ హైవే మీద వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో కారు ఓనర్ వెంటనే అప్రమత్తమై రోడ్డు పక్కన పార్క్ చేసాడు.

MOST READ:మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఇప్పుడు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో

కోట్ల విలువ చేసే కారు నడి రోడ్డులో కాలిపోయింది.. కారణం ఏమంటే?

రహదారిపై కారు కాలిపోవడాన్ని చూసిన లారీ డ్రైవర్ మంటలను ఆర్పడానికి ప్రయత్నించాడు. కానీ అతని శ్రమ మొత్తం వృధా అయిపోయింది. రహదారి పక్కన కాలిపోయిన ఈ లంబోర్ఘిని కారు ఎక్కువ మెటల్స్ మరియు ప్లాస్టిక్ ఉండటం వల్ల ఎక్కువ కాలిపోవడానికి కారణమైంది.

కోట్ల విలువ చేసే కారు నడి రోడ్డులో కాలిపోయింది.. కారణం ఏమంటే?

అయితే ఈ ప్రమాదకర సంఘటన జరిగినప్పుడు కారు డ్రైవ్ చేస్తున్న 29 ఏళ్ల వ్యక్తి ఎటువంటి ప్రమాదానికి గురవ్వకుండా బయటపడ్డాడు. ఈ లంబోర్ఘిని కారును అతడు 8 నెలల క్రితం కొన్నాడు. అయితే అప్పుడే ఈ ఖరీదైన కారు మంటల్లో చిక్కుకుని కాలిపోవడం నిజంగా చాలా బాధాకరం.

MOST READ:2021 ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్.. కారణం ఇదే

కోట్ల విలువ చేసే కారు నడి రోడ్డులో కాలిపోయింది.. కారణం ఏమంటే?

ఈ లంబోర్ఘిని కారులో మంటలు వ్యాపించడానికి ప్రధాన కారణం ఏమిటో అతనికి ఖచ్చితంగా తెలియదు. తైవానీస్ షాంఘై కౌంటీ అగ్నిమాపక విభాగం యొక్క ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, షార్ట్ సర్క్యూట్ వల్ల 'కారులో మంటలు సంభవించి ఉండవచ్చు అని భావిస్తున్నారు.

కోట్ల విలువ చేసే కారు నడి రోడ్డులో కాలిపోయింది.. కారణం ఏమంటే?

సాధారణంగా అధికంగా ఇంధనం నింపడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. లంబోర్ఘిని ఉరుస్ కారులో అత్యంత సురక్షితమైన సాఫ్ట్ ఫీచర్స్ ఉన్నాయి. కావున దీ నిని అనుమానించడం కొంతవరకు సరికాదు. ఉరుస్ లంబోర్ఘిని కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన కార్ మోడల్.

MOST READ:కర్ఫ్యూ సమయంలో పట్టుబడ్డారో.. ఇక అంబులెన్స్‌లోకే, ఎందుకంటే?

కోట్ల విలువ చేసే కారు నడి రోడ్డులో కాలిపోయింది.. కారణం ఏమంటే?

2020 నాటికి లంబోర్ఘిని కార్ల అమ్మకాల్లో ఉరుస్ కార్లు 59.1% వాటా కలిగి ఉన్నాయి. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4,391 యూనిట్ల ఉరుస్ కార్లు అమ్ముడయ్యాయి. దీని బట్టి చూస్తే ప్రపంచ మార్కెట్లో లంబోర్ఘిని కారుకి ఎంత డిమాండ్ ఉందొ మనకు తెలుస్తుంది.

లంబోర్ఘిని ఉరుస్ కారులో 4.0 లీటర్, డ్యూయల్-టర్బో వి 8 ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ 647 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. లంబోర్ఘిని ఉరుస్ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 190 కిలోమీటర్లు.

MOST READ:కరోనా రోగుల కోసం కార్లనే మొబైల్ హాస్పిటల్స్‌గా మార్చిన యువకులు

కోట్ల విలువ చేసే కారు నడి రోడ్డులో కాలిపోయింది.. కారణం ఏమంటే?

ఈ కారు కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. లంబోర్ఘిని ఉరుస్ కారు తైవాన్‌లో 9.99 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీ ప్రకారం దీని విలువ దాదాపు రూ. 2.63 కోట్ల రూపాయలు. ఈ కారు అత్యంత ఖరీదైనది కావడం వల్ల సామాన్య ప్రజలు కొనలేకపోతారు.

Most Read Articles

English summary
Lamborghini Urus Car Catches Fire While Moving In Highway. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X