లంబోర్ఘిని కార్ దొంగలించిన 14 ఏళ్ల యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?

ప్రపంచవ్యాప్తంగా వాహన దొంగతనాలు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి దొంగతనాలకు సంబంధించిన సంఘటనలు ప్రతి రోజూ ఏదో ఒక మూలలో జరుగుతూనే ఉన్నట్లు మనం నిత్యం చూస్తూనే ఉంటాము. మన దేశంలో కూడా దొంగతనాలు ఏ మాత్రం తక్కువగా లేదు. అయితే విదేశాల్లో ఎక్కువ సంఖ్యలో సూపర్ కార్ల దొంగతనాలు జరుగుతుంటాయి.

ఇలాంటి సంఘటన ఇటీవల అమెరికాలో జరిగినట్లు తెలిసింది. నివేదికల ప్రకారం సూపర్ కార్ దొంగలించిన వ్యక్తి నుంచి అతి తక్కువ కాలంలోనే ఆ కార్ స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి పూర్తి సమచారం ఇక్కడ తెలుసుకుందాం.

లంబోర్ఘిని కార్ దొంగలించిన 14 ఏళ్ల యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?

అమెరికన్ ఫ్లోరిడా రాష్ట్రంలో ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ కారుని 14 ఏళ్ల క్రిస్ సాండర్స్ పార్కింగ్ లో ఉంచినప్పుడు దొంగిలించాడు. దొంగలించబడింది. అయితే ఆ లంబోర్ఘిని ఉరుస్ కారు యజమాని కారును దొంగిలించి దొంగను వెంబడించి, అతనిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. ఈ కారు ధర 2 లక్షల అమెరికన్ డాలర్లు, అంటే భారత కరెన్సీ ప్రకారం దీని ధర రూ. 1.46 కోట్లు.

లంబోర్ఘిని కార్ దొంగలించిన 14 ఏళ్ల యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?

కారు యజమాని ఇంటి లోపల కూర్చుని ఉన్నప్పుడు, తన ఇంటి ఆవరణలో కారు నిలిపి ఉంచిన ప్రదేశంలో కొంత శబ్దం వచ్చిందని తెలిపాడు. ఆ సమయంలో అతను కారుని చూడటానికి ఇంటి యొక్క కిటికీ ఓపెన్ చేసి చూసాడు. ఆ యజమానికి అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

లంబోర్ఘిని కార్ దొంగలించిన 14 ఏళ్ల యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?

ఆ సమయంలో ఆ కారు యజమాని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, స్కూటర్ తో దొంగని అనుసరించాడు. అయితే కారు దొంగలించిన ఆ వ్యక్తి ఒకానొక సమయంలో కారుపై నియంత్రణ కోల్పోయాడు. ఆ సమయంలో అతడు చెట్టుని ఢీ కొట్టాడు. ఈ విధంగా జరగడం వల్ల ఆ దొంగ ఆ కారులోనే ఇరుక్కున్నాడు. ఆ సమయంలో అతడు పట్టుబడ్డాడు.

లంబోర్ఘిని కార్ దొంగలించిన 14 ఏళ్ల యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?

పోలీసులు ఆ దొంగని ప్రశ్నించగా, అతడు పోలీసులతో ఈ విధంగా చెప్పాడు, తనకు ఆ కారు డ్రైవ్ చేయాలనిపించిందని, అందువల్ల కారుని తీసుకెళ్లినట్లు చెప్పాడు. అతనికి 14 సంవత్సరాల వయసు కావున అతనిపై ఎలాంటి చర్య తీసుకున్నారో అనే దానిపై ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు.

ఇక లంబోర్ఘిని విషయానికి వస్తే, ఇది ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన కారు. ఈ లంబోర్ఘిని ఉరుస్ లో 4.0 లీటర్ వి8 ఇంజిన్ ఇవ్వబడింది. ఈ ఇంజిన్ 850 ఎన్ఎమ్ టార్క్ 641 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 305 కిలోమీటర్ల.

లంబోర్ఘిని కార్ దొంగలించిన 14 ఏళ్ల యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?

లంబోర్ఘిని కార్లకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉంది. ఈ సూపర్ కార్స్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకూండా మంచి పర్ఫామెన్స్ కలిగి ఉటుంది. ఇటీవల కాలంలో ప్రభాస్, ఎన్టీఆర్ మరియు రన్వీర్ సింగ్ ఈ లంబోర్ఘిని కార్లను కొనుగోలుచేశారు. లంబోర్ఘిని కార్లు అత్యధిక ధర కలిగి ఉండటం వల్ల సంపన్నులు మాత్రమే కొనుగోలు చేస్తారు.

Most Read Articles

English summary
Lamborghini Urus SUV Stolen By A Teenager. Read in Telugu.
Story first published: Wednesday, June 16, 2021, 12:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X