ఇది కదా మంచితనమంటే.. మీరెప్పుడైనా ఇలా చేశారా! వీడియో చూడండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో పంక్చర్ షాప్ మెకానిక్ ఖరీదైన 'ల్యాండ్ రోవర్' కారును డ్రైవ్ చేయడం చూడవచ్చు. ఇంత ఖరీదైన కారుని ఓ సాధారణ మెకానిక్ డ్రైవ్ చేయడం ఏంటని చాలా మందికి అనుమానం వచ్చి ఉంటుంది.

నిజానికి మోహన్ కుమార్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పేజీలో షేర్ చేసిన వీడియోలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారుని దాని ఓనర్ పంక్చర్ షాప్ మెకానిక్‌కు డ్రైవ్ చేయడానికి ఇచ్చినట్లు, వారిరువురికి అప్పటికే పరిచయం ఉన్నట్లు.. ల్యాండ్ రోవర్ ఓనర్ తరచుగా పంక్చర్ షాపుకు వెల్తూ ఉండేవాడని, ఇందులో భాగంగానే కారుని మెకానిక్ వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. కారు చూసి ముచ్చటపడిన మెకానిక్ డ్రైవ్ చేయడానికి అడిగి ఉంటుందని తెలుస్తోంది.

Land Rover Defender Owner

ల్యాండ్ రోవర్ కారును డ్రైవ్ చేసే సమయంలో మెకానిక్ మరియు కారు ఓనర్ మాట్లాడుకునే సంభాషణను వినవచ్చు. డ్రైవ్ చేస్తున్న మెకానిక్ అసలు ఈ కారు సౌండ్ రావడం లేదు, కదులుతున్నట్లు కూడా అనిపించడం లేదని చెప్పడం చూడవచ్చు. ఆ తరువాత అందులోని 360 డిగ్రీ కెమెరా చూసి కొంత ఆశ్చర్యపోతాడు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు స్క్రీన్ చూస్తే గందరగోళంగా ఉంటుందని చెప్పాడు.

కెమెరాల మీద ఆధారపడకుండా ఎప్పుడూ పరిసరాలను చూస్తూ ఉండటం మంచిదని చెప్పడం కూడా వీడియోలో గమనించవచ్చు. అంతే కాకుండా మీరు వీడియోలో స్పష్టంగా గమనిస్తే.. అతని ముఖంలో ఖరీదైన కారు డ్రైవ్ చేస్తున్నానని సంతోషం, ఉత్సాహం కనిపిస్తాయి. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎంతో మంది హృదయాలను దోచుకుంది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు తమదైన రీతిలో అభినందనలు తెలియజేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ల్యాండ్ రోవర్ డిఫెండర్

భారతదేశంలోని అత్యంత సంపన్నులు, సెలబ్రిటీలు మరియు ఇతర ప్రముఖులు ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఒకటి. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ కారు ఫీచర్స్ పరంగా తనకు తానే సాటి అనే విధంగా ఉంటుంది. ఇది 90, 110 మరియు 130 అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. 90 వెర్షన్ మూడు డోర్లు, 110 వెర్షన్ 5 డోర్లు కలిగి ఉంటుంది.

130 వెర్షన్ అనేది మిగిలిన రెండు వెర్షన్ల కంటే కూడా కొంత ఎక్కువ పొడవుగా ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే.. వీటిలో 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 12.3-ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్-ఆఫ్ డిస్‌ప్లే, కనెక్టెడ్ కార్ ఫీచర్స్, 360 డిగ్రీ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ట్రాక్షన్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు మొదలైనవి ఉంటాయి.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ అనేది 2.0 లీటర్ పెట్రోల్, 3.0 లీటర్ పెట్రోల్ మరియు 3.0 లీటర్ డీజిల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అయితే కంపెనీ గత ఏడాది 110 మరియు 90 వెర్షన్ల కోసం 5.0 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ తీసుకువచ్చింది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ యొక్క అన్ని ఇంజిన్లు స్టాండర్డ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి.

దేశీయ మార్కెట్లో సరికొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధరలు రూ. 93.55 లక్షల నుంచి రూ. 2.35 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. అయితే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న కారు ఏ వేరియంట్, ఏ ఇంజిన్ ఆప్షన్ కలిగి ఉంది, దాని ధర ఎంత అనే వివరాలు వెల్లడికాలేదు. మొత్తానికి మీకు ప్రారంభంలో మనసులో మెదిలిన ప్రశ్నకు సమాధానం దొరికేసిందా..

More from DriveSpark

Article Published On: Monday, February 19, 2024, 18:07 [IST]
English summary
Land rover defender owner allowed puncture shop mechanic to drive his car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+