Live video కార్లపైకి దూసుకొచ్చిన భారీ బండరాయి.. సెకన్లలోనే నుజ్జునుజ్జయిన వాహనాలు.. ఇద్దరు మృతి
అది నాగాలాండ్ రాజధాని కొహిమా సమీపంలోని 29వ జాతీయ రహదారి.. సాయంత్రం సుమారు 5 గంటల సమయం.. చిన్నపాటి వర్షపు చినుకులు కురుస్తున్నాయి. వాతావరణ కొంచెం ప్రశాంతంగా ఉంది. జాతీయ రహదారిపైన పకల్ పహర్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. వరుసగా కార్లు నిలిపి ఉన్నాయి. అయితే కాసేపట్లో ఘోర ప్రమాదం జరుగుతుందని ఎవరూ ఉహించని సమయం అది.
కాసేపటికే పక్కనే ఉన్న ఎత్తైన కొండ పైనుంది ఓ భారీ బండ రాయి కార్లపైకి దూసుకొచ్చింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. ఆ రాయి అలానే ముందుకెళ్లి మరో కారును ఢీకొట్టింది. ఆ కారు కూడా భారీగా డ్యామేజీ అయింది. ఏం జరిగిందో తెలుసుకొనే లోపలే కారులో ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

ఈ ఘటన మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో.. వెనుక ఉన్న కారు డ్యాష్‌బోర్డు కెమెరాల్లో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెకన్లలోనే కార్లు నుజ్జునుజ్జవడం వీడియోలో మనం గమనించవచ్చు.
ఎంతటి వారికైన ఈ ఘటన కచ్చితంగా కలచివేస్తుంది. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు కూడా తీవ్ర విషాదం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మారుతి సుజుకి ఆల్టో ఎల్‌ఎక్స్ కారు, టాటా హ్యారియర్, మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ కార్లు భారీగా దెబ్దతిన్నాయి.

ఈ ఘోర ప్రమాదంలో టాటా హ్యారియర్ కారుపైన భారీ బండరాయి పడడంతో నుజ్జునుజ్జు అయింది. ఆ కారులో ఉన్నవారు మరణించి ఉంటారని అంతా భావించారు. కానీ వారు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మారుతి సుజుకి ఆల్టో ఎల్‌ఎక్స్ కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. తమిళనాడుకు చెందిన 52 ఏళ్ల మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. వ్యాగన్‌ఆర్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మృతిచెందారు.

ఈ ఘటన పట్ల నాగాలాండ్ సీఎం నెఫ్యూ రియో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వంతో కలిసి నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం.. జాతీయ రహదారులో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, తగిన భద్రతా చర్యలు తీసుకుంటామని నాగాలాండ్ సీఎం నెఫ్యూ రియో ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఉపయోగించి, మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








