డైవర్లు నిద్ర పోకుండా రోడ్లపై లేజర్ షో.. ఇక దూసుకుపో!!
ఫేవరెట్ సాంగ్స్, మ్యూజిక్ వింటూ హైవేలపై లాంగ్ డ్రైవ్‌కు వెళ్లడమంటే చాలా మందికి సరదా.. ఇంకా ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో ఈ లాంగ్ డ్రైవ్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే లాంగ్ జర్నీలో డ్రైవ్ చేసేవారికి ఒక్కోసారి విపరీతమైన నిద్ర కారణంగా.. నిద్ర మత్తులో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
లాంగ్ జర్నీల్లో నిద్ర మత్తు ప్రధాన సమస్య.. హైవేలపై రాత్రి వేళల్లోనే ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ప్రధానంగా ఈ సమస్యే కారణం.. అయితే ఈ పరిస్థితిని నివారించేందుకు చైనా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు డ్రైవర్ నిద్రపోకుండా ఉండేందుకు లేజర్ షో(Laser Light Show)ను సిద్థం చేసింది. పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి. సమాచారం అర్థమవుతుంది.

చైనాలో రోడ్లపై ప్రయాణించేటప్పుడు డ్రైవర్లకు ఉపయోగపడే అత్యాధునిక టెక్నాలజీనే లేజర్ లైట్లు. రోడ్డుపై మల్టీ కలర్ లేజర్(Multi Colour Laser Light Show) లైట్లను అందించడం ద్వారా రాత్రిపూట ప్రయాణాల్లో డ్రైవర్లు నిద్రపోకుండా నిరోధించవచ్చని చైనా ప్రభుత్వం భావిస్తోంది. డ్రైవ్ చేసేటప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఎదురుగా కనిపించడం ద్వారా.. డ్రైవర్ మెలకువతోనే ఉండటానికి అవకాశాలు ఉంటాయి.
X(ట్విట్టర్) పేజ్‌లో ఇందుకు సంబంధించి వీడియోను పోస్ట్ చేశారు. అయితే దీనిని చాలా మంది లైక్ చేస్తూ సమర్థించగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. లేజర్ లైట్లపై డ్రైవర్ దృష్టి సారిస్తే.. రోడ్డుపై దృష్టి సారించలేరని.. దీని ద్వారా ప్రమాదాలు పెరుగుతాయని కొందరి వాదన. కానీ లేజర్ లైట్లను చాలా శాస్త్రీయంగా, సురక్షితంగా చైనా ప్రభుత్వం అమర్చింది. దీని కాంతి రెండు కిలోమీటర్ల వరకు చేరుకుంటుంది.

రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని.. డ్రైవర్లకు ఉపయోగకరమైన రీతిలో మల్టీ కలర్ లేజర్ లైట్ షోను చైనా ఏర్పాటు చేసింది. ప్రధానంగా వీటిలో ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల లేజర్ లైట్లను ఉపయోగించారు. ఈ కలర్స్ ద్వారా డ్రైవర్లు అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుందని వారి అంచనా.. అయితే దీనికి ముందుగానే ఆస్ట్రేలియాలో గతంలో ఇటువంటి ప్రయోగాలు జరిగాయి.
కాగా భారత్‌లోనూ రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. లాంగ్ డ్రైవ్‌లో డ్రైవర్‌కు నిద్ర వచ్చినట్లు అనిపిస్తే.. వాహనం కాసేపు ఆపి నిద్రపోవడం బెటర్. కానీ ట్రక్కు మరియు బస్సు డ్రైవర్లు నైట్ డ్యూటీ చేయడం లేదా తగినంత విశ్రాంతి లేకుండా ఎక్కువ గంటలు నడపడం ద్వారా హైవేలపై ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు సమాచారం.

ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశంగా భారత్ నిలవడం బాధాకరం. నివేదికల ప్రకారం రోడ్డు ప్రమాదాలు అమెరికా, చైనాల కంటే భారత్‌లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఏటా లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశంలో సాంకేతికత పెరుగుతున్నా ఇలాంటి సంఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.

కాగా 2025 లోగా దేశంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలను సాధ్యమైనంతగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రోడ్డు భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రూ.14,000 కోట్లతో పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించారు. అత్యాధునిక సాంకేతికత వ్యవస్థలను ప్రవేశపెట్టి యాక్సిడెంట్లను తగ్గించేందుకు చర్యలు చేపట్టనుంది.


Click it and Unblock the Notifications








