భర్తకు 16 లక్షల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తెలుగు యాంకర్ లాస్య

తెలుగు యాంకర్ "లాస్య" పేరు వినగానే అందిరికి గుర్తొచ్చేది 'చీమ, ఏనుగు జోక్'. యాంకర్ గా ఉంటూ అందరిని మెప్పించించి లాస్య అనేక షోలలో తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మెల్ల మెల్లగా టీవీ షోలకు దూరమైంది.

భర్తకు 16 లక్షల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తెలుగు యాంకర్ లాస్య

ఇటీవల కాలంలో జరిగిన బిగ్ బాష్ షోలో అందరితో కలివిడిగా ఉంటూ తన చేతివంటలతో వంటలక్కగా మారి, అందరి అభిమానాన్ని పొందించి. బిగ్ బాస్ షోలో తాను లవ్ చేసుకుని ఎన్ని కష్టాలు పడిందో చెప్పుకొస్తూ అందరి చేత కంటతడి పెట్టించింది. తనకి ఒక బాబు కూడా ఉన్నాడని, బాబు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.

భర్తకు 16 లక్షల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తెలుగు యాంకర్ లాస్య

లాస్య, మంజునాథ్ ని ప్రేమ వివాహం చేసుకున్న తరువాత చాలా కష్టాలు పడింది, అయితే తరువాత కుటుంభంలో అందరిని ఒప్పించి మళ్ళీ మంజునాత్ తో కుటుంభం సమక్షంలో మల్లి పెళ్లిచేసుకుంది.

MOST READ:పెట్రో ధరలకు రెక్కలొచ్చాయ్.. ఇక సామాన్యుడి వాహనం కదిలేనా ?

భర్తకు 16 లక్షల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తెలుగు యాంకర్ లాస్య

ఇక అసలు విషయానికి వస్తే ఫిబ్రవరి 15 న తమ పెళ్లి రోజు సందర్భంగా తన భర్త మంజునాథ్‌ కి 16 లక్షల ఖరీదైన మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇచ్చింది. కొత్త కారు కొన్న తర్వాత లాస్య సోషల్ వెబ్ సైట్స్ లో తాము కొత్త కారు కొన్నామని, "ఏ అనుబంధంలోనూ అన్నీ మంచి రోజులే ఉండవు. తుఫానులా చుట్టేసే కష్టం ఎదురొచ్చినా సరే ఒకే గొడుగు కింద ఉండి దాన్ని ఎదుర్కొందాం. ఆ శక్తి మనకు ప్రేమ అందిస్తుందని" కొత్త కారుతో దిగిన ఫొటోతో షేర్ చేసింది.

భర్తకు 16 లక్షల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తెలుగు యాంకర్ లాస్య

దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీదారు అయిన మహీంద్రామంచి భద్రత లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. మహీంద్రా బ్రాండ్ యొక్క ఎక్స్‌యూవీ 500 చాలా అధునాతన ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

MOST READ:వారెవ్వా.. జైలు నుంచి విడుదలైన గ్యాంగ్‌స్టర్‌కి 300 కార్లతో స్వాగతం చెప్పిన అభిమానులు

భర్తకు 16 లక్షల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తెలుగు యాంకర్ లాస్య

మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కారు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 155 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంటుంది. ఇప్పుడు కంపెనీ తన AMT ట్రాన్స్ మిషన్ ను కూడా ప్రారంభించింది. ఇది ఇప్పుడు బేస్ మోడల్ డబ్ల్యు5 మినహా అన్ని వేరియంట్లలో AMT అప్సన్ అందుబాటులో ఉంటుంది.

భర్తకు 16 లక్షల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తెలుగు యాంకర్ లాస్య

మహీంద్రా ఎక్స్‌యూవీ 500 విశాలమైన కారు. ఇది లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా అధిక భద్రతా లక్షణాలు ఉండటం వల్ల ఈ కారు దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది. ఏది ఏమైనా మహీంద్రా బ్రాండ్ వాహనాలు చాలా నమ్మికైనవిగా ఉంటాయి.

MOST READ:ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న సూపర్ ఉమెన్ వీడియో

Most Read Articles

English summary
Anchor Lasya Wedding Anniversary Car Gift Given To Her Husband. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X