బ్రిటన్‌లో 92 సార్లు డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ అయిన ఘనుడు
డ్రైవింగ్ టెస్ట్‌లో పాస్ అవ్వటం గొప్ప కాదు, ఫెయిల్ అవ్వటం కూడా గొప్ప విషయమే. దురదృష్టం అదృష్టంలా పట్టుకుంటే ఇలానే జరుగుతుందేమో. బ్రిటన్‌లోని లీసిస్టర్‌కు చెందిన ఓ యువకుడు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా 92 సార్లు డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ అయ్యాడు. కేవలం డ్రైవింగ్ పరీక్షల కోసమే మొత్తం 2,852 యూరోలు (మన కరెన్సీలో సుమారు రూ.1.90 లక్షల) వెచ్చించాడు.
బ్రిటన్‌లో వ్రాత పరీక్ష పూర్తి చేస్తే కానీ ప్రాక్టికల్ టెస్ట్‌కు అనుమతించరు. ఒక గంటపాటు నిర్వహించే ఈ వ్రాత పరీక్షలో రోడ్డు నియమాల గురించి మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. అంతేకాకుండా డ్రైవింగ్ వీడియోలో రోడ్డు ప్రమాదాలను గుర్తించే హజార్డ్ ప్రెసెప్షన్ టెస్ట్‌లో కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రీఢమ్ ఇన్‌ఫర్మేషన్ అభ్యర్థన మేరకు డ్రైవింగ్ స్టాండర్డ్ ఏజెన్సీ ఈ సమాచారాన్ని విడుదల చేసింది.


Click it and Unblock the Notifications









