జనవరి 31, 2022 వరకు లెర్నర్ లైసెన్స్‌ చెల్లుబాటు గడువు పొడగింపు!

ఫిబ్రవరి 2020 మరియు నవంబర్ 2021 మధ్య గడువు ముగిసే లెర్నర్ లైసెన్స్‌ల చెల్లుబాటును జనవరి 31, 2022 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి మరియు డ్రైవింగ్ టెస్ట్ కోసం స్లాట్‌లను పొందడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబడింది. ఢిల్లీ రవాణా శాఖ తన పరిధిలోని వివిధ ఆర్టీఓ కార్యాలయాలు మరియు ఫిట్‌నెస్ కేంద్రాల వద్ద ఏర్పడుతున్న భారీ రద్దీపై ఆందోళన వ్యక్తం చేసింది, ఇది దరఖాస్తుదారులు మరియు పబ్లిక్ సర్వీస్ ఉద్యోగులకు భద్రతా సమస్యగా పరిణమిస్తుందని మరియు వైరస్ వ్యాప్తికి దారితీ ప్రమాదం ఉందని రవాణా శాఖ పేర్కొంది.

జనవరి 31, 2022 వరకు లెర్నర్ లైసెన్స్‌ చెల్లుబాటు గడువు పొడగింపు!

అంతేకాకుండా, ఢిల్లీ రోడ్లపై సంచరించే వాహనాలు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణను నిర్ధారించే పియుసి (కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం) సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలని ఢిల్లీ రవాణా శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, ఢిల్లీలో లెర్నర్ లైసెన్స్‌ని పొందే ప్రక్రియ ఇప్పటికే ఆన్‌లైన్‌ చేయబడింది. ఢిల్లీలో లెర్నర్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 11 నుండి ప్రారంభమైంది, ఇప్పుడు దరఖాస్తుదారులు లెర్నర్ లైసెన్స్ కోసం ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి అవసరం లేదు. వారు ఇంటి వద్ద కూర్చొనే ఆన్‌లైన్ ద్వారా ర్నింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

జనవరి 31, 2022 వరకు లెర్నర్ లైసెన్స్‌ చెల్లుబాటు గడువు పొడగింపు!

సమాచారం ప్రకారం, లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, దరఖాస్తుదారునికి ఆన్‌లైన్ పరీక్ష తేదీ మరియు టైమ్ స్లాట్ గురించి తెలియజేయబడుతుంది. దాని తర్వాత, దరఖాస్తుదారు నిర్ణీత సమయంలో ఇంటి వద్ద కూర్చొని ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ ద్వారా పరీక్ష రాయవలసి ఉంటుంది. ఇది ఆధార్ అనుసంధానం ద్వారా ప్రారంభించబడిన ప్లాట్‌ఫారమ్, దీనిలో దరఖాస్తుదారుని యొక్క బయోమెట్రిక్ సమాచారం సాఫ్ట్‌వేర్ ద్వారా గుర్తించబడుతుంది మరియు ఇది సదరు దరఖాస్తుదారుడే పరీక్షకు హాజరయ్యాడనే విషయాన్ని ధృవీకరిస్తుంది.

జనవరి 31, 2022 వరకు లెర్నర్ లైసెన్స్‌ చెల్లుబాటు గడువు పొడగింపు!

లెర్నర్స్ లైసెన్స్ ఈ ఆన్‌లైన్ పరీక్ష తర్వాత, దరఖాస్తుదారుడు అర్హత పొందినట్లయితే, శాశ్వత లైసెన్స్ కోసం ఆర్టీఈ వద్దకు వచ్చి భౌతికంగా డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వవలసి ఉంటుంది. ఇ-లెర్నర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన ఆన్‌లైన్ సేవల ప్రయోజనాన్ని పొందడానికి దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఆధార్ కార్డును కలిగి ఉండాలి.

జనవరి 31, 2022 వరకు లెర్నర్ లైసెన్స్‌ చెల్లుబాటు గడువు పొడగింపు!

ఇ-లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తుదారు ఢిల్లీ రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్ (https://transport.delhi.gov.in/home/transport-department)కి లాగిన్ అవ్వాలి. ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సేవల కోసం, దరఖాస్తుదారు వ్యక్తిగత వివరాలను మరియు అతని శారీరక దృఢత్వానికి సంబంధించిన స్వీయ-డిక్లరేషన్‌ను నమోదు చేసే ప్రత్యేక ఫారమ్‌లను పూరించాలి. దరఖాస్తుదారుడు ఇలా ఆన్‌లైన్ లో ఫారమ్ ను నుసమర్పించిన తర్వాత ఎసమ్ఎమ్ ద్వారా అప్లికేషన్ నంబర్‌ను అందుకుంటారు.

జనవరి 31, 2022 వరకు లెర్నర్ లైసెన్స్‌ చెల్లుబాటు గడువు పొడగింపు!

లెర్నర్స్ లైసెన్స్ కోసం సుమారు 20 ప్రశ్నలతో కూడిన ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది. కొత్తగా లెర్నింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు 20 ప్రశ్నలకు సరైనా సమాధానాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా రహదారి భద్రత మరియు ట్రాఫిక్ సంకేతాలకు సంబంధించినవిగా ఉంటాయి. వీటిలో మొత్తం 10 మార్కులకు గానూ ఆరు లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు ఉత్తీర్ణులుగా పరిగణించబడతారు.

జనవరి 31, 2022 వరకు లెర్నర్ లైసెన్స్‌ చెల్లుబాటు గడువు పొడగింపు!

ఒకవేళ, ఎవరైనా వేరొక వ్యక్తి సహాయం తీసుకొని ఈ ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందే సమయంలో అతను/ఆమె రవాణా కార్యాలయం నిర్వహించే ఫిజికల్ టెస్ట్‌లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి తర్వాత ఢిల్లీ రవాణా శాఖ మొత్తం 33 రకాల ఆర్టీఓ సేవలను ఆన్‌లైన్‌ చేసింది. వీటిలో డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, అడ్రస్ మార్పు, కొత్త కండక్టర్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎన్ఓసి, ఇండస్ట్రియల్ డ్రైవింగ్ పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్ రీప్లేస్‌మెంట్, రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్ ఎన్ఓసి, గూడ్స్ వెహికల్ కొత్త పర్మిట్, పర్మిట్ రెన్యూవల్, డూప్లికేట్ పర్మిట్, సరెండర్ పర్మిట్, పర్మిట్ ట్రాన్స్‌ఫర్ మరియు ప్రయాణీకుల సేవా వాహన బ్యాడ్జ్‌లు వంటి ఇతర సేవలు చేర్చబడ్డాయి.

జనవరి 31, 2022 వరకు లెర్నర్ లైసెన్స్‌ చెల్లుబాటు గడువు పొడగింపు!

mParivahan యాప్‌తో ఉపయోగాలేంటో తెలుసా..?

ఇదిలా ఉంటే, వాహనా పత్రాలు మరియు డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని మొబైల్ ఫోన్ లో డిజిటల్‌గా స్టోర్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఎమ్‌పరివాహన్' (mParivahan) అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది Android మరియు Apple ప్లేస్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ యాప్ సాయంతో మీరు నడిపే వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను మరియు మీ డ్రైవింగ్ లెసెన్స్ వివరాలను క్యూఆర్ కోడ్ రూపంలో స్టోర్ చేసుకోవచ్చు. ఈ యాప్ ను భారత ప్రభుత్వం ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించింది.

జనవరి 31, 2022 వరకు లెర్నర్ లైసెన్స్‌ చెల్లుబాటు గడువు పొడగింపు!

ఈ mParivahan యాప్‌లో డ్రైవర్లు భద్రపరచుకునే డిజిటల్ పత్రాలు రవాణా మంత్రిత్వ శాఖచే ఆమోదించబడ్డాయి మరియు అందువల్ల అవి అసలైన పత్రాలుగా గుర్తించబడతాయి. ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆర్‌సి కోసం అడిగితే, మీరు ఎటువంటి సందేహం లేకుండా మీ ఫోన్‌లో ఉండే mParivahan యాప్‌లో స్టోర్ చేసిన డిజిటల్ పత్రాలను వారికి చూపించవచ్చు. కాగితపు పత్రాల మాదిరిగానే ఈ డిజిటల్ పత్రాలు కూడా పూర్తిగా చెల్లుబాటు అవుతాయి. పేపర్లు లేకుండా వాహనం నడపడం వలన మీరు చెల్లించాల్సిన భారీ చలాన్ల నుండి ఈ యాప్ మిమ్మల్ని కాపాడుతుంది.

Most Read Articles

English summary
Learner licence validity extended in delhi till 31st jan 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X