ఇంటి వద్ద నుండే లెర్నర్స్ లైసెన్స్.. ఆర్టీఓ చుట్టూ తిరగాల్సిన అసరం లేదు..!

లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ (ఎల్ఎల్ఆర్)కి సంబంధించిన నిబంధనలు జూలై 1, 2021వ తేదీ నుండి మారబోతున్నాయి. ఈ మార్పు తరువాత, మీరు ఇకపై లెర్సర్స్ లైసెన్స్ పొందడానికి ఆర్టీఓకి వెళ్ళవలసిన అవసరం లేదు. నేరుగా మీ ఇంటి వద్ద నుండే లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటి వద్ద నుండే లెర్నర్స్ లైసెన్స్.. ఆర్టీఓ చుట్టూ తిరగాల్సిన అసరం లేదు..!

ఇందుకు మీకు కావల్సిందల్లా మీ ఆధార్ నెంబర్ మరియు ఆధార్ నెంబరుకు అనుసంధానం చేయబడి ఉన్న ఫోన్ నెంబర్. ఆధార్ అథెంటికేషన్ ద్వారా లెర్నర్స్ లైసెన్స్ మంజూరు చేసే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ విధానాన్ని తొలుతగా ఉత్తరప్రదేశ్‌లో అమలు చేయనున్నారు.

ఇంటి వద్ద నుండే లెర్నర్స్ లైసెన్స్.. ఆర్టీఓ చుట్టూ తిరగాల్సిన అసరం లేదు..!

ఆ తర్వాత, దశల వారీగా ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. అధార్ అథెంటికేషన్ చేయగలిగిన వారు ఆన్‌లైన్‌లో లెర్నర్స్ లైసెన్స్ కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు, అలా చేయలేని వారు మాత్రం యధావిధగా మునుపటి (ఆర్టీఓని సందర్శించి ధరఖాస్తు చేసుకునే) పద్ధతినే పాటించాల్సి ఉంటుంది.

ఇంటి వద్ద నుండే లెర్నర్స్ లైసెన్స్.. ఆర్టీఓ చుట్టూ తిరగాల్సిన అసరం లేదు..!

ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ సారధి సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేసింది. ఈ మార్పుల తర్వాత లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం అవుతుంది. ఇంట్లో కూర్చునే మీరు లెర్నర్స్ లైసెన్స్ కోసం ఎలా ధరఖాస్తు చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఇంటి వద్ద నుండే లెర్నర్స్ లైసెన్స్.. ఆర్టీఓ చుట్టూ తిరగాల్సిన అసరం లేదు..!

ఆన్‌లైన్ లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి, మీరు మీ రాష్ట్రానికి సంబంధించిన రవాణా శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. దీనితో పాటుగా, మీరు https://parivahan.gov.in లేదా sarathiservice/newLLDet.do ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటి వద్ద నుండే లెర్నర్స్ లైసెన్స్.. ఆర్టీఓ చుట్టూ తిరగాల్సిన అసరం లేదు..!

అదే సమయంలో, ఆన్‌లైన్ లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి, మీరు మీ ఆధార్‌ను లింక్ చేయాలి, ఇది మీ దరఖాస్తును ధృవీకరిస్తుంది. ఆ తరువాత మీరు లెర్నింగ్ డిఎల్ ఫీజును జమ చేయాల్సి ఉంటుంది. కొన్ని రోజుల తరువాత, మీ లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆన్‌లైన్‌లో మీకు పంపిచడం జరుగుతుంది.

ఇంటి వద్ద నుండే లెర్నర్స్ లైసెన్స్.. ఆర్టీఓ చుట్టూ తిరగాల్సిన అసరం లేదు..!

ఇలా ఆన్‌లైన్‌లో పొందిన లెర్నర్స్ లైసెన్స్‌ను మీరు ప్రింట్ తీసుకోవచ్చు. లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కోసం ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. మీరు ఇంటి నుండి లేదా ఏదైనా సైబర్ కేఫ్ నుండి ఈ పరీక్షకు హాజరు కావచ్చు. ఈ పరీక్షా సమయంలో రవాణా శాఖ అధికారి ఒకరు మీతో మాట్లాడుతూ పరీక్ష నిర్వహిస్తారు.

ఇంటి వద్ద నుండే లెర్నర్స్ లైసెన్స్.. ఆర్టీఓ చుట్టూ తిరగాల్సిన అసరం లేదు..!

ఈ ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే లెర్నింగ్ లైసెన్స్‌కు అనుమతి లభిస్తుంది. ఇలా వచ్చిన ఆన్‌లైన్ లెర్నర్స్ లైసెన్స్‌ను మీరు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ చేయవచ్చు. వాస్తవిక (ఒరిజనల్) లైసెన్స్ పొందడానికి మాత్రం మీరు తప్పనిసరిగా ఆర్టీఓని సందర్శించి, మీ డ్రైవింగ్/రైడింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుంది.

ఇంటి వద్ద నుండే లెర్నర్స్ లైసెన్స్.. ఆర్టీఓ చుట్టూ తిరగాల్సిన అసరం లేదు..!

రవాణా శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఈ సదుపాయం ఉత్తరప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లోనూ అందుబాటులో ఉంది. మరికొద్ది నెలల్లోనే ఈ ఆన్‌లైన్ సేవను దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రారంభించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Learner's License Application Process To Change From July 1, 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X