భారతదేశంలోనే మొట్ట మొదటి ఎల్ఈడి ట్రాఫిక్ లైట్స్.. మన హైదరాబాద్ లో

ఈ మధ్య కాలంలో మన దేశంలో వాహనాల వాడకం ఎక్కువైనది, దీని వలన ట్రాఫిక్ సమస్యలు, వాహన ప్రమాదాలు పెరుగుతూ పోతున్నాయి. ముఖ్యంగా నగరాలలో ఈ పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది. వాహనాలు ఎక్కువైయ్యే కొద్దీ సమస్యలు పెరుగుతూ పోతున్నాయి. వీటిని అధిగమించాలంటే ఆధునిక వ్యవస్థ రావాలి. ఇటువంటి వ్యవస్థను దేశంలోనే మొట్ట మొదటి సారిగా తీసుకొచ్చారు అది ఏమిటో చూద్దాం రండి..

భారతదేశంలోనే మొట్ట మొదటి ఎల్ఈడి ట్రాఫిక్ లైట్స్.. మన హైదరాబాద్ లో

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు ప్రయోగాత్మక ప్రాతిపదికన కేబీఆర్ పార్కు జంక్షన్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కొత్త పద్దతిని ప్రవేశపెట్టారు . అది ఏమిటో క్రింది చిత్రాలలో చూడండి, అర్థం కాలేదా అయితే వివరంగా తెలుసుకొందాం పదండి.

భారతదేశంలోనే మొట్ట మొదటి ఎల్ఈడి ట్రాఫిక్ లైట్స్.. మన హైదరాబాద్ లో

ఈ మధ్యే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వారు కేబీఆర్ పార్కు జంక్షన్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కొత్త ఎల్ఈడి స్పీడ్ బ్రేకర్లు అమర్చారు. ఇవి ఆటోమేటిక్ గా ఆకుపచ్చ నుంచి ఎరుపు మరియు పసుపు రంగు లలోకి ట్రాఫిక్ విధానాలకు అనుగుణంగా మారుతాయి, ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ తో సమానంగా పని చేస్తాయి.

భారతదేశంలోనే మొట్ట మొదటి ఎల్ఈడి ట్రాఫిక్ లైట్స్.. మన హైదరాబాద్ లో

ఈ కొత్త ఆలోచనను ప్రయోగాత్మకంగా కేవలం హైదరాబాద్ కేబీఆర్ పార్కు జంక్షన్ వద్ద మాత్రమే ప్రారంభం జరిగింది. రెడ్ లైట్ ను గుర్తించలేదనే సాకుతో చాలా మంది ట్రాఫిక్ సిగ్నల్స్ విధులను పాటించకుండా వెళ్లిపోతుంటారు దీని వలన ఎన్నో ప్రమాదాలు జరుతున్నాయి, ఈ ప్రమాదాలను నిరోధించడానికి ముఖ్యంగా మెరుగైన రోడ్డు భద్రతను తీసుకురావడం కోసం, ఇది వినూత్నమైన మార్గం అని చెప్పవచ్చు.

భారతదేశంలోనే మొట్ట మొదటి ఎల్ఈడి ట్రాఫిక్ లైట్స్.. మన హైదరాబాద్ లో

ఇవి క్యాట్ ఐ రిఫ్లెక్టర్ రోడ్డు సంకేతాల తరహాలోనే ఈ ఎల్ఈడీ లైట్లను కూడా రోడ్డుపై పొందుపరిచారు. అవి జలనిరోధక ఫీచర్ను కలిగి ఉన్నాయి, అందువల్ల వర్షపు నీరుగాని లేదా ఇతర ద్రవ పదార్థాలు వీటిలోకి ప్రవేశించడం జరగదు. దీని వలన సాంకేతిక పరంగా ఎటువంటి లోపం జరగదు.

భారతదేశంలోనే మొట్ట మొదటి ఎల్ఈడి ట్రాఫిక్ లైట్స్.. మన హైదరాబాద్ లో

ఈ ప్రయోగం విజయవంతంగా జరిగితే నగర వ్యాప్తంగా ఎల్ఈడీ స్పీడ్ బ్రేకర్స్ లను అమరుస్తామని, వాటిని కూడా విజయవంతంగా అమలు చేస్తామని ఇన్ స్పెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్, ఎం.నర్సింగ్ రావు ఒక సందర్భంలో పేర్కొన్నారు.

భారతదేశంలోనే మొట్ట మొదటి ఎల్ఈడి ట్రాఫిక్ లైట్స్.. మన హైదరాబాద్ లో

ఈ ఎల్ఈడి లైట్ల యొక్క ఫ్లాషింగ్, చాలా దూరం నుంచి ఎరుపు లేదా ఆకుపచ్చ ట్రాఫిక్ లైట్ సంకేతాలు కనపడుతాయి దీని వల్ల డ్రైవర్లు జంక్షన్ ముందు బాగా నెమ్మదించడానికి అవకాశం ఉంటుంది. చెట్లు, వర్షం, ఇతర ప్రకృతి కారణాలు లేదా ఇతర పెద్ద వాహనాల అటంకంతో మసకబారినప్పటికీ కూడా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ లను తేలికగా గమనించవచ్చు.

ఇవి ఏవిధంగా పని చేస్తాయంటే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న బాక్స్ యొక్క అవుట్ పుట్ కు ఈ ఎల్ఈడి స్పీడ్ బ్రేకర్ లు కనెక్ట్ చేయబడ్డాయి దీని వలన ఏకకాలంలో ట్రాఫిక్ లైట్లతో సమానంగా ఇవి మారుతూ ఉంటాయి.

భారతదేశంలోనే మొట్ట మొదటి ఎల్ఈడి ట్రాఫిక్ లైట్స్.. మన హైదరాబాద్ లో

ఈ ప్రయోగం వలన డ్రైవ్ చేసేవారి పై మంచి ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు, దీని వలన రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి మంచి మార్గం అని చెప్పవచ్చు.

భారతదేశంలోనే మొట్ట మొదటి ఎల్ఈడి ట్రాఫిక్ లైట్స్.. మన హైదరాబాద్ లో

ఈ కొత్త ట్రాఫిక్ సిగ్నల్ పద్దతి విజయవంతగా జరిగితే, ఇది హైద్రాబాద్ నగరం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ ఎల్ఈడి స్పీడ్ బ్రేకర్లు మార్గాన్ని రూపొందించవచ్చు. దీని వలన ఎన్నో ప్రమాదాలను నిరోధించవచ్చు.

Source: Overseas News/YouTube

Most Read Articles

English summary
Introduced on an experimental basis, the Traffic Police of Hyderabad’s KBR Park junction..Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X