వీడియో: మీ బ్యాట్‌మొబైల్‌ని మీరే తయారు చేసుకోండి

ప్రముఖ బొమ్మల తయారీ కంపెనీ (టాయ్స్ మేకర్) లెగో మరియు ప్రముఖ బ్యాట్‌మొబైల్ టంబ్లర్ (క్రిస్ నోలాన్ నటించిన డార్క్ నైట్ ట్రయాలజీలో ఉపయోగించిన వాహనం)లు రెండూ కలిస్తే, ఇక పిల్లల వినోదానికి అడ్డూ అదుపు ఉండదు. లెగో ఎల్లప్పుడూ పిల్లలు, పెద్దలలోని సృజనాత్మకతకు పనిపెట్టేటటువంటి బొమ్మలను తయారు చేస్తుంది.

లెగో తయారు చేసే బొమ్మలను మనమే అసెంబ్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. లెగో ఈ బొమ్మలను కిట్‌ల రూపంలో విక్రయిస్తుంది. తాజాగా లెగో బ్యాట్‌మ్యాన్ టంబ్లర్ కిట్‌ను విడుదల చేసింది. ఈ టంబ్లర్ కిట్‌లో మొత్తం 1,869 పార్ట్స్ ఉంటాయి. ఒరిజినల్ బ్యాట్‌మొబైల్‌ని తలపించేలా అచ్చుగుద్దినట్లుగా అలానే ఉండేలా ఈ కిట్‌ను తయారు చేశారు.

The Lego Tumbler

ఈ టంబ్లర్ కిట్ బరువు రెండు కేజీలు. ఒరిజినల్ టంబ్లర్ మాదిరిగానే అడ్జస్టబల్ వింగ్స్, డీటైల్డ్ ఇంటీరియర్, రబ్బర్ రేసింగ్ టైర్స్ వంటి ఫీచర్లతో ఈ కిట్‌ను తయారు చేశారు. అసెంబల్ చేసిన తర్వాత ఈ టంబ్లర్ 40 సెం.మీ. పొడవును, 24 సెం.మీ. వెడల్పును, 15 సెం.మీ. ఎత్తును కలిగి ఉంటుంది.

ఈ కిట్‌తో పాటుగా లెగో ఉచితంగా క్రిస్టియన్ బేల్ స్టైల్ బ్యాట్‌మ్యాన్ క్యారెక్టర్ బొమ్మను, అలాగే హీత్ లెడ్జెర్ స్టైల్ జోకర్ మీనియేచర్లను కూడా అందిస్తోంది. సెప్టెంబర్ 2014 నుంచి అందుబాటులోకి రానున్న ఈ టంబ్లర్ కిట్ స్టికర్ ధర రూ.12,000. ఈ కిట్‌ను కొనుక్కుంటే మీ టంబ్లర్ బ్యాట్‌మొబైల్‌ను మీ చేతులతో మీరే తయారు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి లెగో ఏం చెబుతుందో ఈ వీడియోలో చూడండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/riPTENi587w?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Monday, July 28, 2014, 17:41 [IST]
English summary
Lego fans of all ages exist the world over, and why not? Lego sets are known for their attention to detail, high quality of finish, and inspire you to create scaled-down designs and working practically with your hands. The famous Danish company's latest creation is the Tumbler, inspired by Christopher Nolan's Dark Knight Trilogy franchise.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+