భారత వాయు సేనలో చేరనున్న లైట్ కోంబాట్ హెలికాప్టర్లు.. వీటి ప్రత్యేకత ఏంటంటే..

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత సైన్యం మరింత పటిష్టంగా తయారయ్యింది. భారత సైన్యాన్ని బలోపేతం చేసి, ప్రపంచ దేశాలకు పోటీగా ఉంచడంలో మోదీ సర్కార్ చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. సైన్యానికి అవసరమైన ఆయుధాలను సమీకరించడం నుండి అధునాతన యుద్ధనౌకలు మరియు విమానాలను అందించడం వరకూ వివిధ రంగాలో భారత ప్రభుత్వం చాలా చురుకుగా వ్యవహరిస్తోంది.

Recommended Video

Yezdi Motorcycles Review In Telugu | Roadster, Adventure & Scrambler

తాజాగా, భారత వాయు సేనలోకి కొత్త యుద్ధ హెలికాప్టర్లు రానున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

భారత వాయు సేనలో చేరనున్న లైట్ కోంబాట్ హెలికాప్టర్లు.. వీటి ప్రత్యేకత ఏంటంటే..

భారతీయ వైమానిక దళం భారతదేశంలో తయారు చేసిన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ హెలికాప్టర్‌ దేశంలోని పశ్చిమ సరిహద్దును మరింత సురక్షితంగా చేయడానికి త్వరలోనే అమలు చేయబోతోంది. లైట్ కోంబాట్ హెలికాప్టర్లుగా పిలువబడే ఈ యుద్ధ హెలికాప్టర్లు అక్టోబర్ 3వ తేదీన జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో పోస్ట్ చేయబడుతాయి. ఈ హెలికాప్టర్ల సహాయంతో భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల చుట్టూ పూర్తి నిఘా ఉంచడం జరుగుతుంది. అంతేకాకుండా, ఈహెలికాప్టర్లు మన దేశంలోకి ప్రవేశించే ఉగ్రవాదులు మరియు చొరబాటుదారులను అరికట్టడానికి సైనికులకు ఎంతగానో సహాయపడనున్నాయి.

భారత వాయు సేనలో చేరనున్న లైట్ కోంబాట్ హెలికాప్టర్లు.. వీటి ప్రత్యేకత ఏంటంటే..

శత్రుదేశాల వాయు రక్షణను ధ్వంసం చేయగల ఈ మేడ్ ఇన్ ఇండియా మల్టీ-రోల్ లైట్ కంబాట్ హెలికాప్టర్ (LCH) లను అక్టోబరు 3న జోధ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ఎల్‌సిహెచ్‌ని ప్రవేశపెట్టే కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరియు చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి పాల్గొంటారని అధికారులు తెలిపారు. యుద్ధానికి వసరమైన అన్ని సాయుధాలతో ఈ హెలికాప్టర్లు అమర్చబడి ఉంటాయి. కోంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ (CSAR), డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ (DEAD) మరియు కౌంటర్ ఇన్‌సర్జెన్సీ (CI) కార్యకలాపాల కోసం ఈ హెలికాప్టర్లను వినియోగిస్తారు.

భారత వాయు సేనలో చేరనున్న లైట్ కోంబాట్ హెలికాప్టర్లు.. వీటి ప్రత్యేకత ఏంటంటే..

లైట్ కంబాట్ హెలికాప్టర్ ఫీచర్లు

ఇద్దరు వ్యక్తులు (పైలట్‌తో కలిపి) కూర్చోగల ఈ లైట్ కోంబాట్ హెలికాప్టర్ 51.10 అడుగుల పొడవు, 15.5 అడుగుల ఎత్తు మరియు 5800 కిలోల బరువును కలిగి ఉంటుంది. ఇది 700 కిలోల వరకు ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఈ హెలికాప్టర్ గరిష్ట వేగం గంటకు 268 కిలోమీటర్లు. ఫుల్ ట్యాంక్ ఇంధనంతో సుమారు 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు లేదా గాలిలో 3 గంటలు 10 నిమిషాల పాటు ఎగరగలదు. ఇది తగినంత మొత్తంలో ఆయుధాలు మరియు అవసరమైన వస్తువులను నేల పైనుండి 16,400 అడుగుల ఎత్తుకు కూడా తీసుకెళ్లగలదు.

భారత వాయు సేనలో చేరనున్న లైట్ కోంబాట్ హెలికాప్టర్లు.. వీటి ప్రత్యేకత ఏంటంటే..

లైట్ కంబాట్ హెలికాప్టర్‌లో 20 మిమీ ఫిరంగి (క్యానన్) కూడా ఉంటుంది. ఇది నాలుగు హార్డ్ పాయింట్లను కలిగి ఉంటుంది. అంటే రాకెట్లు, క్షిపణులు మరియు బాంబులను విసరడానికి అవసరమైన క్యానన్ స్లాట్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఇందులో పైలట్ మరియు కో-పైలట్ గన్నర్ కోసం టెన్డం కాక్‌పిట్ కాన్ఫిగరేషన్, అనేక స్టెల్త్ ఫీచర్లు, ఆర్మర్ ప్రొటెక్షన్, నైట్ ఎటాక్ సామర్ధ్యం మరియు మెరుగైన మనుగడ కోసం క్రాష్ యోగ్యమైన ల్యాండింగ్ గేర్‌లను కూడా కలిగి ఉంటుంది. ఇది డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)చే రూపొందించబడింది మరియు అభివృద్ధి చేయబడింది.

భారత వాయు సేనలో చేరనున్న లైట్ కోంబాట్ హెలికాప్టర్లు.. వీటి ప్రత్యేకత ఏంటంటే..

భవిష్యత్తులో అవసరమైతే హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 150 లైట్ కంబాట్ హెలికాప్టర్లను తయారు చేయగదని అధికారులు చెప్పారు. ఈ సంస్థ ప్రతి సంవత్సరం ఇలాంటివి 10 హెలికాప్టర్లు చేయాలని యోచిస్తోంది. ఫిబ్రవరి 2010 లో, ఇది బెంగళూరులోని హెచ్ఏఎల్ యొక్క హెలికాప్టర్ కాంప్లెక్స్ నుండి 20 నిమిషాల పాటు గాలిలో ఎగిరింది. ఆ సమయంలో రోట్రాఫ్ట్ తక్కువ వేగాన్ని, బోర్డులోని వ్యవస్థపై తక్కువ ఎత్తును పరిశీలించింది. దీని తరువాత 23 మే 2010 న LCH ప్రోటోటైప్ యొక్క మూడవ పరీక్ష జరిగింది.

భారత వాయు సేనలో చేరనున్న లైట్ కోంబాట్ హెలికాప్టర్లు.. వీటి ప్రత్యేకత ఏంటంటే..

టెస్ట్ ఫ్లైట్స్ విజయవంతంగా పూర్తయిన తరువాత, హెలికాప్టర్ మరియు దాని వ్యవస్థ యొక్క పనితీరు సంతృప్తికరంగా ఉందని సిబ్బంది నివేదించారు, ఏరో ఇండియా దీనిని ఫిబ్రవరి 2011 లో బహిరంగంగా ఆవిష్కరించింది. ఈ ఏడాది మార్చి 30వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (సిసిఎస్) నేతృత్వంలోని యూనియన్ క్యాబినెట్ భద్రతపై కమిటీ 15 లైట్ కంబాట్ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు రూ .3,887 కోట్ల నిధులను కూడా ఆమోదించింది. ఇది కాకుండా మౌలిక సదుపాయాల నిర్మాణానికి అదనంగా మరో రూ. 377 కోట్లను కూడా మంజూరు చేయడం జరిగింది.

భారత వాయు సేనలో చేరనున్న లైట్ కోంబాట్ హెలికాప్టర్లు.. వీటి ప్రత్యేకత ఏంటంటే..

ఇటీవలే ప్రారంభమైన మేడ్ ఇన్ ఇండియా ఐఎన్ఎస్ విక్రాంత్..

ఇదిలా ఉంటే, భారత సైన్యం కోసం మనదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant) కూడా ఈ నెలలోన ప్రారంభించబడింది. సెప్టెంబరు 02, 2022వ తేదీన ఈ యుద్ధ నౌక భారత నావికాదళం లోకి చేరింది. ఇది పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేయబడిన మరియు నిర్మించబడిన విమాన వాహక నౌక. భారత సైన్యంలో 1961 మరియు 1997 మధ్యకాలంలో భారత నౌకాదళానికి సేవలందించిన పాత ఐఎన్ఎస్ విక్రాంత్‌కు నివాళిగా IAC-1 (ఇండీజెనస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్-1) కి ఐఎన్ఎస్ విక్రాంత్ అని పేరు పెట్టారు.దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Light combat helicopters to join in indian air force details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X