హైవేలో కారుపై పడిన పిడుగు.. కారులో ఉన్నవారంతా సేఫ్.. కానీ..?

వర్షాకాలం మొదలైంది, వర్షాకాలంలో పంటలు పండించుకోవడానికి రైతులకు చాలా అనుకూలంగా ఉన్నా, కొన్ని సార్లు ప్రకృతిలో జరిగే అనుకోని సంఘటనలు ప్రాణాల మీదికే వస్తాయి. వర్షాకాలంలో వర్షం పడుతున్న సందర్భంలో దాదాపు బయటకు వెళ్ళకపోవడం మంచిది. ఈ సమయంలో వాహనదారులు కూడా బయటకు వెళ్లడాన్ని వాయిదా వేసుకోవడం ఉత్తమం.

వర్షాలు పడుతున్న సమయంలో ఉరుములు మరియు మెరుపులు వస్తాయి, ఆ సమయంలోనే పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. పిడుగులు పడటం వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో దాదాపు అందరికి తెలుసు.

హైవేలో ఉన్న కారుపై పడిన పిడుగు.. కారులో ఉన్నవారంతా సేఫ్.. కానీ..?

ఇటీవల అమెరికాలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నివేదికల ప్రకారం, అమెరికాలోని కాన్సాస్‌లోని వేవర్లీలో అనే చిన్న పట్టణంలో హైవే వెంట వాహనాలు ప్రయాణిస్తున్నాయి. వర్షం పడుతుండటంతో రోడ్డుపై ఎక్కువ వాహనాలు లేవు. రోడ్డుపై వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి.

హైవేలో ఉన్న కారుపై పడిన పిడుగు.. కారులో ఉన్నవారంతా సేఫ్.. కానీ..?

ఇదే సమయంలో అకస్మాత్తుగా ఒక పిడుగు కారుపై పడింది. పిడుగు పడిన ఆ కారులో ఐదుగురు కుటుంబ సభ్యులు వెళ్తున్నారు. భారీగా వర్షం కురుస్తుండటంతో కారును ఓ పక్కకు ఆపారు. ఆ సమయంలోనే పిడుగు పడింది. అంతే ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. పిడుగుపాటుకు కారులోని వారంతా భయబ్రాంతులకు గురయ్యారు.

హైవేలో ఉన్న కారుపై పడిన పిడుగు.. కారులో ఉన్నవారంతా సేఫ్.. కానీ..?

ఇది చూసిన ఇతర వాహనాల్లో కనిపించిన వారు వెంటనే కారు వద్దకు వెళ్లి ఏమి జరిగిందో చూశారు. కానీ అదృష్టవశాత్తూ కారులోని ప్రయాణికులకు ఏమి ప్రమాదం జరగలేదు. అయితే కారు ముందుభాగం మాత్రం భారీగా దెబ్బతినింది.

హైవేలో ఉన్న కారుపై పడిన పిడుగు.. కారులో ఉన్నవారంతా సేఫ్.. కానీ..?

ఈ సంఘటన కారు వెనుక వస్తున్న మరో కారులో పొందుపరిచిన కెమెరాలో రికార్డ్ చేయబడింది. ఈ సంఘటన యొక్క వీడియో కూడా మీకు ఇక్కడ చూడవచ్చు. ఈ సంఘటన జూన్ 25 న జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగిన వెంటనే కారులోని పిల్లలు బాగున్నారా.. లేదా అని చూసినట్లు కారు ఓనర్ చెప్పారు.

హైవేలో ఉన్న కారుపై పడిన పిడుగు.. కారులో ఉన్నవారంతా సేఫ్.. కానీ..?

పిడుగు ఒక్క సారిగా మెరుపువేగంతో కారుపై పడటం వల్ల కారు యొక్క ఇంజిన్ పనిచేయలేదు. నివేదిల ప్రకారం కారులో ఉన్న 5 మంది ప్రయాణికుల్లో మూడేళ్ల పిల్లవాడు, ఒకటిన్నర సంవత్సరాల పిల్లవాడు మరియు ఎనిమిది నెలల పిల్లవాడు సహా ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు.

పిడుగు పడటం వల్ల కారు పనిచేయలేదు, కావున కారుని అక్కడ నుంచి బయటకు తీయడానికి అసాధ్యమైందని ఆ కారు ఓనర్ చెప్పుకొచ్చారు. కారు పాడైపోయిన అందులో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నారు. ఇది నిజంగా వారి అదృష్టమనే చెప్పాలి.

హైవేలో ఉన్న కారుపై పడిన పిడుగు.. కారులో ఉన్నవారంతా సేఫ్.. కానీ..?

ఇలాంటి సంఘటనలు జరుగుతాయి కావున, ప్రయాణాలు వర్షం పడే సమయంలో వాయిదా వేసుకోవాలి, లేకుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు చెట్లు, విద్యుత్ స్తంభాలు, రేకుల షెడ్ల కింద తలదాచుకోవడం ప్రమాదకరం.

Most Read Articles

English summary
Lightning Strikes Car On Highway In Kansas. Read in Telugu.
Story first published: Monday, July 5, 2021, 9:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X