పోర్షే 911 కారుతో యాక్సిడెంట్ చేసిన లిండ్‌సే లోహన్

ప్రముఖ అమెరికన్ నటి 'లిండ్‌సే లోహన్' మరోసారి వార్తల్లోకెక్కింది. గతంలో ఫుల్లుగా పీకల దాకా మందుకొట్టి కారు నడిపిన కేసులో బుక్ అయిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు తాజాగా మరో సూపర్ కారును యాక్సిడెంట్ చేసి మీడియా కంట్లో పడింది. లిండ్‌సే లోహన్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'లిజ్ అండ్ డిక్' అనే సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు తన పోర్షే 911 స్పోర్ట్స్ కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో ఉన్న పసిఫిక్ కోస్ట్ హైవేపై తన పోర్షే 911 కారులో వేగంగా డ్రైవ్ చేస్తూ, ముందు వైపు వెళ్తున్న భారీ ట్రక్కును ఢీకొట్టడంతో పోర్షే కారు పచ్చడైపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో కారులో లిండ్‌సే లోహన్‌తో పాటుగా తన అసిస్టెంట్ కూడా ఉన్నాడు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో కారులోని లిండ్‌సే లోహన్‌, ఆమె అసిస్టెంట్‌కు అలాగే ట్రక్కు డ్రైవర్‌కు కూడా ఎలాంటి గాయాలు కాలేదు.


పోలీసులు ఈ యాక్సిడెంట్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గతంలో మాదిరిగా ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం, లిండ్‌సే లోహన్ తాగి డ్రైవ్ చేసి ఉండచ్చనే అనుమానం నేపథ్యంలో ఆ మేరకు కూడా టెస్టులు చేయటం జరిగింది. అయితే, ఈ యాక్సిడెంట్ జరగటానికి తప్పిదం లిండ్‌సే లోహన్ కాదని ప్రధామనిక విచారణలో తేలినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన రెండు గంటల అనంతరం ఆమె తిరిగి యధావిధిగా తమ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఈ యాక్సిడెంట్ గురించి లిండ్‌సే వివరిస్తూ.. అసలు తప్పంతా ట్రక్కు డ్రైవర్‌దేనని, అతను ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండా లైన్‌లను అటూ ఇటూ మారుతుండటం వల్లనే ప్రమాదం జరిగిందని పేర్కొంది. ఈ సమయంలో కారును లిండ్‌సే లోగన్ డ్రైవ్ చేస్తుండగా, ఆమె అసిస్టెంట్ వెనుక సీట్లో కూర్చుని ఉన్నట్లు తెలిపారు.

అయితే, ఈ ప్రమాదంపై కొత్త కొత్త పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తప్పు తనపై వేసుకోమని ట్రక్కు డ్రైవర్‌కు లిండ్‌సే లోహన్ లంచమివ్వజూపిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ మాంచి కిక్కు మీద ఉండే ఈ అమెరికన్ అమ్మడు, గతంలో ఇలాగే ఓసారి ఫుల్లుగా మందుకొట్టి యాక్సిడెంట్ చేసి నానా గందరగోళం సృష్టించింది.

More from DriveSpark

Article Published On: Monday, June 11, 2012, 14:40 [IST]
English summary
A Porsche 911 is the latest victim of Hollywood actress Lindsay Lohan's problems. American actress and socialite Lindsay Lohan has crashed her new Porsche 911 in to an 18 wheeler truck on the Pacific Coast Highway in Santa Monica, California and has completely damaged the car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+