ప్రపంచ కుబేరుల మనసు దోచిన సాధారణ కార్లు.. బహుశా ఇలాంటి కార్లు మీకు కూడా ఉండొచ్చు

ప్రపంచంలో అత్యంత సంపన్నులైన బిలినీయర్ల గురించి దాదాపు చాలా మందికి తెలుసు. అంతే కాకుండా వారు ఎలాంటి విలాసవంతమైన జీవితాలను గడుపుతారనే విషయం కూడా తెలిసే ఉంటుంది. కానీ ఎంత కుబేరుడైనా కానీ వారు కూడా సాధారణ ప్రజల మాదిరిగానే సాధారణ కార్లను వినియోగిస్తానే సంగతి చాలా తక్కువమందికే తెలిసి ఉంటుంది.

ఇంతకీ అలంటి సాధారణ కార్లను ఉపయోగినే బిలీనియర్లు ఎవరు, వారు ఎలాంటి సాధారణ కార్లను ఉపయోగిస్తున్నారు, అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ప్రపంచ కుబేరుల మనసు దోచిన సాధారణ కార్లు.. బహుశా ఇలాంటి కార్లు మీకు కూడా ఉండొచ్చు

మార్క్ జూకర్‌బర్గ్ (Mark Zuckerberg):

ప్రపంచంలో ఉన్న అత్యంత సంపన్నుల జాబితాలో 'మార్క్ జూకర్‌బర్గ్' (Mark Zuckerberg) ఒకరు. ఫేస్‌బుక్ వ్యవస్థపుకుడైన జూకర్‌బర్గ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువమంది ఉపయోగించే సోషల్ మీడియాల్ యాప్స్ లో ఫేస్‌బుక్ ఒకటి. ఈ రోజు దాదాపు ఫేస్‌బుక్ ప్రపంచంలోనే ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు.

ప్రపంచ కుబేరుల మనసు దోచిన సాధారణ కార్లు.. బహుశా ఇలాంటి కార్లు మీకు కూడా ఉండొచ్చు

ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడైన 'జూకర్‌బర్గ్' ఎలాంటి జీవితం అనుభవిస్తాడో అందరూ ఊహించగలరు, కానీ ఈయన కూడా సాధారణ ప్రజల మాదిరిగానే హోండా ఫిట్ వంటి కార్లను వినియోగిస్తాడంటే ఎక్కువమంది నమ్మకపోవచ్చు. అయితే ఇది నిజం. జూకర్‌బర్గ్ హోండా ఫిట్ కారుని కలిగి ఉన్నారు. దీనితోపాటు ఫోక్స్‌వ్యాగన్ జిటిఐ మరియు పగని హుయ్రా వంటి కార్లను కూడా కలిగి ఉన్నారు.

ప్రపంచ కుబేరుల మనసు దోచిన సాధారణ కార్లు.. బహుశా ఇలాంటి కార్లు మీకు కూడా ఉండొచ్చు

స్టీవ్ వోజ్నియక్ (Steve Wozniak):

ప్రపంచంలో ఉన్న అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరు మరియు ఆపిల్ కంపెనీ యొక్క సహ వ్యవస్థాపకుడు. మొదట్లో స్టీవ్ జాబ్స్ తో కలిసి మొదటి ఆపిల్ కంప్యూటర్ సృష్టించారు. అయితే యితడు స్టీవ్ జాబ్స్ మాదిరిగా చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో యితడు కూడా ఒకరు.

ప్రపంచ కుబేరుల మనసు దోచిన సాధారణ కార్లు.. బహుశా ఇలాంటి కార్లు మీకు కూడా ఉండొచ్చు

ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్న 'స్టీవ్ వోజ్నియక్' (Steve Wozniak) ఆడంబరంగా జీవితాన్ని గడుపుతారు. అంతే కాకూండా ఇతని వద్ద 'టెస్లా' మోడల్ ఎక్స్ కారు ఉంది. అంతే కాకుండా యితడు అప్పుడప్పుడు చేవ్రొలెట్ బోల్ట్ EV తో కూడా కనిపిస్తూ ఉంటాడు.

ప్రపంచ కుబేరుల మనసు దోచిన సాధారణ కార్లు.. బహుశా ఇలాంటి కార్లు మీకు కూడా ఉండొచ్చు

వారెన్ బఫెట్ (Warren Buffett):

వారెన్ ఎడ్వర్డ్ బఫెట్ (వారెన్ బఫెట్) ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరు మరియు ప్రముఖ వ్యాపార వేత్త కూడా. బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ ఛైర్మన్ అయిన వారెన్ బఫెట్ చిన్న స్థాయి నుంచి ఈ రోజు ప్రపంచ ధనవంతుల జాబితాలో చేరాడని చెబుతుంటారు. అంతే కాకూండా యితడు చాలా తక్కువ మొత్తంలో ఖర్చు చేస్తాడని కూడా కొంతమంది చెబుతారు.

ప్రపంచ కుబేరుల మనసు దోచిన సాధారణ కార్లు.. బహుశా ఇలాంటి కార్లు మీకు కూడా ఉండొచ్చు

వారెన్ బఫెట్ అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) కోసం $3.17 కంటే క్కువ ఖర్చు పెట్టాడు. అంతే కాకుండా 1958 నుంచి ఒకే ఇంటిలో ఉన్నాడు. అప్పట్లో ఆ ఇంటి విలువ $31,500, కానీ ఈ రోజు ఆ ఇంటి విలువ సుమారు $260000 వరకు ఉంటుంది. లగ్జరీ కార్లను కొనగలిగే స్థాయి ఉన్న ఇతడు కాడిలాక్ XTS వినియోగిస్తున్నారు. అయితే తన కుమార్తె దానిని మార్చమని చెప్పినప్పుడు 2014 లో XTS కొనుగోలు చేశాడు.

ప్రపంచ కుబేరుల మనసు దోచిన సాధారణ కార్లు.. బహుశా ఇలాంటి కార్లు మీకు కూడా ఉండొచ్చు

రోమన్ అబ్రమోవిచ్ (Roman Abramovich):

ఇజ్రాయిల్ లో రెండవ అత్యంత ధనవంతుడు మరియు రష్యాలో పదకొండవ ధనవంతుడైన 'రోమన్ అబ్రమోవిచ్' (Roman Abramovich) ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరు. రోమన్ అబ్రమోవిచ్ చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఫుట్ బాల్ చూసేవారికి ఈయన గురించి చెప్పవలిసిన అవసరం లేదు.

ప్రపంచ కుబేరుల మనసు దోచిన సాధారణ కార్లు.. బహుశా ఇలాంటి కార్లు మీకు కూడా ఉండొచ్చు

రోమన్ అబ్రమోవిచ్ గ్యారేజీలో అనేక అన్యదేశ మరియు ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటితో పాటు అతను తన స్నేహితులు మరియు వ్యాపార భాగస్వాములకు బహుమతిగా ఇవ్వడానికి మొత్తం 20 టెస్లా ఎలక్ట్రిక్ కార్లను కూడా కలిగి ఉన్నారు.

ప్రపంచ కుబేరుల మనసు దోచిన సాధారణ కార్లు.. బహుశా ఇలాంటి కార్లు మీకు కూడా ఉండొచ్చు

జెఫ్ బెజోస్ (Jeff Bezos):

అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అయిన 'జెఫ్ బెజోస్' (Jeff Bezos) ప్రపంచ ధనవంతుల్లో ఒకరు. జెఫ్ బెజోస్ ఆస్తి విలువ $19,140. ప్రపంచ కుబేరుడైన జెఫ్ బెజోస్ ఎలాంటి కార్లను ఉపయోగిస్తారు, ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తారు అనేది ఎవరైనా ఊహించవచ్చు. అయితే అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న ఈ వ్యక్తి 1997 లో కొనుగోలు చేసిన 'హోండా అకార్డ్' వంటి కారుని కూడా కలిగి ఉన్నారు.

ప్రపంచ కుబేరుల మనసు దోచిన సాధారణ కార్లు.. బహుశా ఇలాంటి కార్లు మీకు కూడా ఉండొచ్చు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ప్రపంచంలో అత్యంత సంపన్నులైన వ్యక్తులు అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉండటమే కాకుండా, సాధారణ కార్లను కూడా వినియోగిస్తున్నారు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో పాటు కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, November 12, 2022, 16:29 [IST]
English summary
List of billionaires who use humble cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+