జాగ్రత్త.. ఈ కార్లన్నీ ఒక్క (డ్రైవర్ సైడ్) ఎయిర్‌బ్యాగ్‌తో మాత్రమే లభిస్తాయి!

ఏప్రిల్ 1, 2021వ తేదీ నుండి భారతదేశంలో తయారు చేయబడే మరియు విక్రయించబడే అన్ని కార్లలో ముందు వైపు రెండు ఎయిర్‌బ్యాగులు (ఒకటి డ్రైవర్ కోసం మరొకటి ప్యాసింజర్ కోసం) తప్పనిసరిగా ఉండాలని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిదే. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

జాగ్రత్త.. ఈ కార్లన్నీ ఒక్క (డ్రైవర్ సైడ్) ఎయిర్‌బ్యాగ్‌తో మాత్రమే లభిస్తాయి!

అయితే, మన దేశంలోని కార్ కంపెనీలు తమ ఎంట్రీ లెవల్ వేరియంట్లలో కేవలం ఒక్క (డ్రైవర్) ఎయిర్‌బ్యాగును మాత్రమే స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, ఏప్రిల్ 1 నాటికి కంపెనీలు ఇలాంటి కార్లలో తప్పనిసరిగా ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగును కూడా ఆఫర్ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో సింగిల్ (డ్రైవర్) ఎయిర్‌బ్యాగ్‌తో లభిస్తున్న కొన్ని కార్ల గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

జాగ్రత్త.. ఈ కార్లన్నీ ఒక్క (డ్రైవర్ సైడ్) ఎయిర్‌బ్యాగ్‌తో మాత్రమే లభిస్తాయి!

1. మారుతి సుజుకి ఆల్టో 800

మారుతి సుజుకి నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న 'ప్రజల కారు' ఆల్టో 800 లోని ఎంట్రీ లెవల్ వేరియంట్స్‌లో కేవలం డ్రైవర్-సైడ్ ఎయిర్‌బ్యాగ్ మాత్రమే లభిస్తుంది. ఇతర వేరియంట్లలో ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ ఆప్షనల్ ఫీచర్‌గా లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ధరలు రూ.2.99 లక్షల నుంచి రూ.4.48 లక్షల మధ్యలో ఉన్నాయి.

MOST READ:తల్లిదండ్రుల పెళ్లి రోజుకి కియా సొనెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లలు

జాగ్రత్త.. ఈ కార్లన్నీ ఒక్క (డ్రైవర్ సైడ్) ఎయిర్‌బ్యాగ్‌తో మాత్రమే లభిస్తాయి!

2. మారుతి సుజుకి వ్యాగన్ఆర్

మారుతి సుజుకి అందిస్తున్న టాల్ బాయ్ కార్ వ్యాగన్ఆర్‌లో కూడా ఇదే పరిస్థితి. ఈ కారులోని ఎంట్రీ మరియు మిడ్-రేంజ్ వేరియంట్లలో కేవలం డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ మాత్రమే స్టాండర్డ్‌గా లభిస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రమే ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ధరలు రూ.4.65 లక్షల నుంచి రూ.6.18 లక్షల మధ్యలో ఉన్నాయి.

జాగ్రత్త.. ఈ కార్లన్నీ ఒక్క (డ్రైవర్ సైడ్) ఎయిర్‌బ్యాగ్‌తో మాత్రమే లభిస్తాయి!

3. మారుతి సుజుకి ఎస్-ప్రెసో

మారుతి సుజుకి ఎస్-ప్రెస్ కార్ కూడా ఒకే (డ్రైవర్ సైడ్) ఎయిర్‌బ్యాగ్‌తో లభిస్తుంది. కో-ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లను కంపెనీ ఆప్షన్‌లగా మాత్రమే అందిస్తుంది. టాప్-ఆఫ్-ది-లైన్ అయిన ఎస్-ప్రెస్ విఎక్స్ ప్లస్ వేరియంట్లో మాత్రమే కంపెనీ ఫ్రంట్ డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ధరలు రూ.3.70 లక్షల నుంచి రూ.5.18 లక్షల మధ్యలో ఉన్నాయి.

MOST READ:మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీలో కనిపించిన బాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?

జాగ్రత్త.. ఈ కార్లన్నీ ఒక్క (డ్రైవర్ సైడ్) ఎయిర్‌బ్యాగ్‌తో మాత్రమే లభిస్తాయి!

4. హ్యుందాయ్ శాంత్రో

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ శాంత్రో కారు కూడా సింగిల్ (డ్రైవర్ సైడ్) ఎయిర్‌బ్యాగ్‌తో మాత్రమే లభిస్తుంది. కో-డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ కంపెనీ తమ శాంత్రో స్పోర్ట్జ్ (ఏఎమ్‌టి) మరియు ఆస్టా వేరియంట్లలో ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ధరలు రూ.4.67 లక్షల నుండి రూ.5.99 లక్షల మధ్యలో ఉన్నాయి.

జాగ్రత్త.. ఈ కార్లన్నీ ఒక్క (డ్రైవర్ సైడ్) ఎయిర్‌బ్యాగ్‌తో మాత్రమే లభిస్తాయి!

5. మారుతి సుజుకి సెలెరియో, సెలెరియో ఎక్స్

ఈ జాబితాలో మారుతి సుజుకి అందిస్తున్న సెలెరియో మరియు సెలెరియో ఎక్స్ మోడళ్లు కూడా ఉన్నాయి. మారుతి సెలెరియో మరియు సెలెరియో ఎక్స్ రెండూ కూడా పలు సేఫ్టీ ఫీచర్లతో పాటుగా స్టాండర్డ్ డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతాయి. అయితే కో-ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌ను మాత్రం ఆప్షనల్‌గా అందిస్తున్నారు. మార్కెట్లో దీని ధరలు రూ.4.53 నుంచి రూ.5.78 లక్షల మధ్యలో ఉన్నాయి.

MOST READ:మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

జాగ్రత్త.. ఈ కార్లన్నీ ఒక్క (డ్రైవర్ సైడ్) ఎయిర్‌బ్యాగ్‌తో మాత్రమే లభిస్తాయి!

6. రెనో క్విడ్

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ కార్ క్విడ్ కూడా స్టాండర్డ్ డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌ను మాత్రమే కలిగి ఉంటుంది. ఇందులో ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ ఆప్షనల్‌గా ఉంటుంది. మార్కెట్లో ఈ కారు ధరలు రూ.3.12 లక్షల నుంచి రూ.5.31 లక్షల మధ్యలో ఉన్నాయి.

జాగ్రత్త.. ఈ కార్లన్నీ ఒక్క (డ్రైవర్ సైడ్) ఎయిర్‌బ్యాగ్‌తో మాత్రమే లభిస్తాయి!

7. డాట్సన్ రెడి-గో

డాట్సన్ గతేడాది భారత మార్కెట్లో తమ ఫేస్‌లిఫ్టెడ్ రెడి-గో కారును మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కారులో సీటు-బెల్ట్ రిమైండర్, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ అసిస్ట్ సెన్సార్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మరియు ఇతర సేఫ్టీ ఫీచర్లను కంపెనీ స్టాండర్డ్‌గా అందిస్తోంది. అయితే, ఇందులోని టాప్-ఎండ్ టి (ఓ) వేరియంట్‌లో మాత్రమే కంపెనీ డ్యూయల్ ఎయిర్‌బ్యాగులను అందిస్తోంది. మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ.2.83 లక్షలుగా ఉంది.

MOST READ:అద్భుతంగా ఉన్న శ్రీమంతుడు 'మహేష్ బాబు' కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి

జాగ్రత్త.. ఈ కార్లన్నీ ఒక్క (డ్రైవర్ సైడ్) ఎయిర్‌బ్యాగ్‌తో మాత్రమే లభిస్తాయి!

8. మహీంద్రా బొలెరో

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా విక్రయిస్తున్న బొలెరో కారు కూడా ఒకే ఎయిర్‌బ్యాగ్‌తో లభిస్తుంది. గతేడాది ఇందులో కంపెనీ తమ కొత్త బిఎస్ 6 వెర్షన్‌ను విడుదల చేసింది. మహీంద్రా పోర్ట్‌ఫోలియోలో ఒకే ఎయిర్‌బ్యాగ్‌తో లభిస్తున్న ఏకైక కారు బొలెరో అయినప్పటికీ, ఇందులో కంపెనీ పలు ఇతర సేఫ్టీ ఫీచర్లను కూడా అందిస్తోంది. మార్కెట్లో ఈ కారు ధరలు రూ.7.95 లక్షల నుంచి రూ.8.94 లక్షల మధ్యలో ఉన్నాయి.

జాగ్రత్త.. ఈ కార్లన్నీ ఒక్క (డ్రైవర్ సైడ్) ఎయిర్‌బ్యాగ్‌తో మాత్రమే లభిస్తాయి!

9. మారుతి సుజుకి ఈకో

మారుతి సుజుకి అందిస్తున్న చవకైన ఎమ్‌పివి ఈకో కూడా డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌తో మాత్రమే లభిస్తుంది. అయితే, ఇతర మోడళ్ల మాదిరిగానే ఇందులో కూడా కంపెనీ పలు సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఈ కారును ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ లేకుండానే విక్రయిస్తోంది. మార్కెట్లో దీని ధరలు రూ.3.97 నుంచి రూ.6.94 లక్షల మధ్యలో ఉన్నాయి.

గమనిక: పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్.

Most Read Articles

English summary
List Of Cars In India With Only One (Driver Side) Airbag As Standard, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X