మీరు తరచూ టోల్ ఫీజు కడుతుంటారా.. ఈ వాహనాలకు టోల్ నుంచి మినహాయింపు ఉందని తెలుసా.!!
భారత్‌లో టోల్ గేట్ల(Toll Charge) వద్ద 5 రకాల వాహనాలకు ఎలాంటి రుసుము లేకుండా మినహాయింపు ఉంది. ఆ వాహనదారులు ఎలాంటి ఛార్జ్ చెల్లించకుండానే టోల్ గేట్ మార్గంలో వెళ్లిపోవచ్చు. ఇంతకీ ఆ 5 రకాల వాహనాలేంటి.. వాటికే ఎందుకు మినహాయింపు ఉంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
జాతీయ రహదారులపై టోల్ బూత్(Toll Booth)ల ద్వారా వాహనదారుల నుంచి కేంద్ర ప్రభుత్వం టోల్ ఛార్జీలు వసూలు చేస్తుంది. రహదారి నిర్వహణ, నిర్మాణం కోసం ఈ ఛార్జెస్ వసూలు చేస్తారు. గతంలో టోల్ ఛార్జీలు నగదు రూపంలో లేదా డిజిటల్ పేమెంట్స్‌లో చెల్లించేవారు. కానీ ఇప్పుడు పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా దీన్ని మరింత ఈజీగా చేసేందుకు FASTag ను ప్రవేశపెట్టింది.

ఈ టోల్ బూత్ ఛార్జెస్(కస్టమ్స్ ట్యాక్స్) ద్వారా ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం వస్తుంది. అయితే ఈ టోల్ బూత్ మీదుగా వెళ్లేందుకు 5 రకాల వాహనాలకు ఎలాంటి టోల్ చెల్లించకుండా మినహాయింపు లభిస్తుంది. ఈ వాహనాలు కస్టమ్స్ బూత్ మీదుగా వెళ్లేటప్పుడు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కొన్ని కారణాల వల్ల వీటికి మినహాయింపు ఇచ్చారు.
ఆ ఐదు రకాల వాహనాలు ఏంటంటే.. సైనిక వాహనాలు, VIP వెహికల్స్, ప్రభుత్వ అధికారులు లేదా ప్రముఖుల వాహనాలు, అత్యవసర వాహనాలు కాగా చివరిది టూ వీలర్లు. వీరు దేశ వ్యాప్తంగా ఎటువంటి టోల్ ఫీజు(Toll Tax) చెల్లించకుండా జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు.

దేశంలో భారత ఆర్మీ సిబ్బంది(Army vehicles) తమ వాహనాల్లో ప్రయాణించేటప్పుడు జాతీయ రహదారులపై ఎలాంటి టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వీరు అత్యవసర పనుల నిమిత్తం ప్రయాణిస్తారు కాబట్టి దేశ సైనికుల వద్ద నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు.
భారత్‌లో VIPలు అంటే రాజకీయ నాయకులు, ప్రభుత్వం నియమించిన వ్యక్తులు, ప్రజాప్రతినిధులు మొదలైనవారి నుంచి దేశంలోని ఏ టోల్ బూత్‌లోనూ టోల్ ఛార్జ్ వసూలు చేయరు. ఇందుకోసం వీరికి వీఐపీ పాస్‌లు ఇచ్చారు. ఈ పాస్ ఉన్న వాహనాలు టోల్ బూత్ మార్గంలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

మూడవది ఉన్నత స్థాయి వ్యక్తులు.. అంటే కోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ సచివాలయం, పార్లమెంట్‌లోని ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు ఇలా ఉన్నత స్థాయిలోని అధికారులకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. వీరు జాతీయ రహదారులపై ఎలాంటి టోల్ ఛార్జెస్ చెల్లించకుండా వెయిట్ చేయకుండా వెళ్లిపోవచ్చు.
భారత్‌లో కొన్ని అత్యవసర వాహన సర్వీసులు ఉన్నాయి. అవి అంబులెన్స్‌లు, సైరన్‌లతో కూడిన అగ్నిమాపక వాహనాలు.. ఈ వాహనాలు కూడా టోల్ బూత్ గుండా వెళ్లేటప్పుడు టోల్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక చివరగా టూ వీలర్లు(ద్విచక్ర వాహనాలు).. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరై.. ఏ టూ వీలర్ కూడా టోల్ ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రయాణించవచ్చు.
కాగా టోల్ అనేది ఒక నిర్దిష్ట రహదారిపై ప్రయాణించడం ద్వారా వాహనానికి వసూలు చేసే రుసుము. టూ వీలర్ల ద్వారా రోడ్లు పెద్దగా డ్యామేజ్ అవ్వవు కాబట్టి.. వారి నుంచి టోల్ ఫీజు వసూలు చేయరు. కానీ ఇతర వాహనాలపై అంటే... వాహన రకాన్ని బట్టి టోల్ ఛార్జీలు మారుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి.
అయితే ఈ కస్టమ్స్ బూత్‌లలో ఉన్న ఒక కీలక విషయం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అదేంటంటే.. టోల్ బూత్ వద్ద 100 మీటర్లకు పైగా వాహనాలు బారులు తీరి ఉంటే క్యూలో నిలబడిన వాహనాలను ఎలాంటి రుసుము చెల్లించకుండా పంపించాలనే నిబంధన ఉంది. వాహనాల క్యూ పొడవు 100 మీటర్ల కంటే తక్కువ ఉండే వరకు వాహనాలను ఉచితంగా అనుమతించాలని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఇందుకోసం కస్టమ్స్ బూత్‌కు దాదాపు 100 మీటర్ల దూరంలో పసుపు రేఖను(Yellow Line) ఏర్పాటు చేస్తారు. ఆ లైను వెనుక వాహనాలు బారులు తీరితే గేటు ప్రాంతంలోని వాహనాన్ని ఎలాంటి ఛార్జీలు లేకుండా పంపించాలని నిబంధన ఉంది. దీని ద్వారా ట్రాఫిక్ క్లియర్ అవుతుందనే ఆలోచననే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


Click it and Unblock the Notifications








