పెట్రోల్ ధరల్లో భారత్‌నే మించిపోయిన 10 దేశాలు: పూర్తి వివరాలు

భారతదేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకి తారాజువ్వలాగా పైకి పోతూనే ఉన్నాయి, ఇప్పటికే చాలా నగరాల్లో పెట్రోల్ ధరలు రూ. 100 దాటేసింది. పెట్రోల్ ధరలు సామాన్య ప్రజలపైన చాలా ప్రభావం చూపుతాయి. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పెట్రోల్ ధరలు మనదేశం కంటే రెట్టింపు ధరలవద్ద అందుబాటులో ఉన్నాయి.

ఇంతకీ పెట్రోల్ ధరలు మనదేశం కంటే ఎక్కువ ఏ దేశంలో ఉన్నాయి, అలాంటి పది దేశాలను గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

పెట్రోల్ ధర భారత్ కంటే ఎక్కువ కలిగిన 10 దేశాలు - ధరలు

హాంగ్‌కాంగ్:

పీపుల్స్ రిపబ్లిక్ చైనా యొక్క ప్రత్యేక పాలనా ప్రదేశమైన హాంగ్‌కాంగ్ లో ఒక లీటరు పెట్రోల్ ధర అక్షరాలా రూ. 242.5. దీన్ని బట్టి చూస్తే ప్రపంచంలో పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న దేశం హాంగ్‌కాంగ్ అని స్పష్టంగా తెలుస్తోంది. మన దేశంతో పోల్చుకుంటే హాంగ్‌కాంగ్ లో పెట్రోల్ ధర రెట్టింపు ధర వద్ద లభిస్తోంది.

పెట్రోల్ ధర భారత్ కంటే ఎక్కువ కలిగిన 10 దేశాలు - ధరలు

ఐస్‌లాండ్:

ది రిపబ్లిక్ ఆఫ్ ఐస్‌లాండ్ అని పిలువబడే ఐస్‌లాండ్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో గల ఒక ద్వీప దేశం. ప్రపంచంలో అత్యంత శీతల దేశాల్లో ఒకటైన ఐస్‌లాండ్ లో పెట్రోల్ ధర రూ. 186.7 గా ఉంది. ఈ దేశం ఒక ద్వీపం కాబట్టి ఇక్కడికి ఎగుమతి మరియు దిగుమతి వంటివి చాలా కష్టంగా ఉంటుంది. ఈ కారణంగానే ఈ దేశంలో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.

పెట్రోల్ ధర భారత్ కంటే ఎక్కువ కలిగిన 10 దేశాలు - ధరలు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్:

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అనేది సెంట్రల్ ఆఫ్రికాలో ఒక దేశం. ఇది చాద్, సూడాన్, దక్షిణ సూడాన్, కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్, కాంగో రిపబ్లిక్ మరియు కామెరూన్ వంటి దేశాల మధ్య ఉన్న దేశం. ఈ దేశంలో సరైన పాలన లేకుండా ఎప్పుడు అంతర్యుద్ధాల కారణంగా ముడి సరుకుల ధరలతోపాటు పెట్రోల్ వంటి ధరలు కూడా భారీగా ఉన్నాయి. ఈ దేశంలో పెట్రోల్ ధర రూ. 185.8 వరకు ఉంది.

పెట్రోల్ ధర భారత్ కంటే ఎక్కువ కలిగిన 10 దేశాలు - ధరలు

నార్వే:

ఉత్తర ఐరోపాలో ఒకదేశమైన నార్వేలో పెట్రోల్ ధరలు రూ. 177.6 వరకు ఉన్నాయి. నార్వే కూడా డెన్మార్క్ మాదిరిగానే చల్లని వాతావరణం కలిగి ఉండటం చేత రవాణా చాలా కఠినతరంగా ఉంటుంది. కావున నిత్యావసరాల ధరలతో పాటు పెట్రోల్ ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

పెట్రోల్ ధర భారత్ కంటే ఎక్కువ కలిగిన 10 దేశాలు - ధరలు

డెన్మార్క్:

మూడు స్కాండినేవియన్ దేశాల్లో ఒకటైన డెన్మార్క్ దక్షిణాన ఉంది. ఈ దేశంలో చాలా చల్లని వాతవరణ పరిస్థితులను కలిగి ఉంటుంది, కాబట్టి ఇక్కడ జనసాంద్రత కూడా ఎక్కువగా లేదు. ఈ దేశంలో కూడా ఎగుమతులు మరియు దిగుమతులు చాలా కష్టంగా ఉంటాయి. కావున డెన్మార్క్ లో పెట్రోల్ ధర రూ. 170.8.

పెట్రోల్ ధర భారత్ కంటే ఎక్కువ కలిగిన 10 దేశాలు - ధరలు

ఫిన్‌లాండ్:

ఫిన్‌లాండ్ అనేది స్వీడన్, నార్వే మరియు రష్యా వంటి దేశాలకు సరిహద్దు దేశంగా ఉన్న నార్డిక్ దేశం. ఉత్తర ఐరోపా‌లో సార్వభౌమాధికారం కలిగిన దేశాలలో ఇది ఒకటి. ఈ దేశంలో పెట్రోల్ ధరలు రూ. 169.5 గా ఉన్నాయి. ఈ ధరలు దాదాపు డెన్మార్క్ దేశపు ధరలకు దగ్గరలో ఉంటాయి.

పెట్రోల్ ధర భారత్ కంటే ఎక్కువ కలిగిన 10 దేశాలు - ధరలు

బార్బడోస్:

కరీబియన్ సముద్రానికి తూర్పున ఉన్న బార్బడోస్ ఖండపు ద్వీపం. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. బార్బడోస్ ప్రంపంచంలో అత్యంత జనసాంధ్రత కలిగిన ద్వీపాలలో ఒకటి. ఈ దేశంలో పెట్రోల్ ధర ఒక లీటరుకు రూ. 169.1 గా ఉంటుంది. హాంగ్‌కాంగ్ తో పోలిస్తే ఈ ధర చాలా వరకు తక్కువే అని అర్థమవుతుంది.

పెట్రోల్ ధర భారత్ కంటే ఎక్కువ కలిగిన 10 దేశాలు - ధరలు

నెదర్లాండ్స్:

ఐరోపా ఖండం ఉత్తర సరిహద్దులోని ఉన్న ఒక చిన్న దేశం ఈ నెదర్లాండ్స్. ఇది రెండు ఖండాలలో విస్తరించి ఉంది. నెదర్లాండ్స్ ఒక పాశ్చాత్య ఐరోపా దేశము. ఈ దేశాన్ని పూర్వం హాలెండ్ అని కుడా పిలిచేవారు. ప్రపంచంలోనే అత్యంత దట్టమైన రోడ్ నెట్‌వర్క్‌లలో నెదర్లాండ్స్ ఒకటి. ఈ దేశంలో పెట్రోల్ ధర రూ. 166.8 గా ఉంది.

పెట్రోల్ ధర భారత్ కంటే ఎక్కువ కలిగిన 10 దేశాలు - ధరలు

గ్రీస్:

ఆగ్నేయ ఐరోపాలో ఒక దేశమైన గ్రీస్ బాల్కన్ ద్వీపకల్పం దక్షిణ కొనలో ఉంది. ఇది చాలా గొప్ప సంస్కృతిని కలిగిన దేశాల్లో ఒకటి. ఈ దేశం ఆర్థిక విపత్తు నుండి మెల్లమెల్లగా కోలుకుంటోంది. ఈ దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ. 166.5 వరకు ఉంటుంది.

పెట్రోల్ ధర భారత్ కంటే ఎక్కువ కలిగిన 10 దేశాలు - ధరలు

స్వీడన్:

మన జాబితాలో అధిక ధరలు కలిగి ఉన్న దేశాల్లో చివరి దేశం స్వీడన్. స్వీడన్ స్కాండినేవియాలోని నార్డిక్ దేశం. ఈ దేశం చుట్టూ నార్వే, ఫిన్‌లాండ్ మరియు డెన్మార్క్ వంటి దేశాలు ఉన్నాయి. స్వీడన్ దేశంలో ఒక లీటరు పెట్రోల్ ధర రూ. 160.9. ఈ ధర హాంగ్‌కాంగ్ తో పోలిస్తే చాలా తక్కువ.

పెట్రోల్ ధర భారత్ కంటే ఎక్కువ కలిగిన 10 దేశాలు - ధరలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మనం పైన చెప్పుకున్న ఈ టాప్ 10 జాబితాలో పెట్రోల్ ధర అత్యధికంగా 'హాంగ్‌కాంగ్' ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ధరలు అక్కడ ఆర్థిక మరియు వివిధ పరిస్థితులపైనా ఆధారపడి ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మరియు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, October 27, 2022, 11:47 [IST]
English summary
List of top ten countries with highest petrol prices details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+