రన్నింగ్‌లో ఉన్న కారుపై బోల్తా పడిన కంటైనర్.. నుజ్జునుజ్జయిన కారు.. కానీ ఒక్కరికీ గాయాలు కాలేదంటే నమ్ముతారా.!!
దేశంలో రోడ్లపై నిత్యం ఎన్నో ప్రమాదాలను చూస్తూ ఉంటాం. అదృష్టవశాత్తు కొన్ని ప్రమాదాల్లో తీవ్రంగా ప్రాణనష్టం సంభవిస్తుండగా.. మరికొన్నిప్రమాదాల్లో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నా.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటం లక్ అనే చెప్పవచ్చు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితేే..
గుజరాత్‌లోని సూరత్‌లో ఓ కంటైనర్ అదుపుతప్పి ఆ పక్కనే వెళ్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారుపై పడిన ఘటన చోటుచేసుకుంది. పూర్తి లోడుతో ఉన్న కంటైనర్ ట్రక్కు.. మహీంద్రా XUV 700పై బోల్తా పడింది. అదృష్టవశాత్తు అందులో ఉన్న ప్రయాాణికులు క్షేమంగా బయటపడ్డారు.

సమాచారం ప్రకారం కంటైనర్ లోడ్ తీసుకువెళుతోంది. ఈ సమయంలో మార్గమధ్యంలో లారీ చెడిపోవడంతో రోడ్డు పక్కన ఆపి మరమ్మతులు చేస్తున్నారు. హైడ్రాలిక్ జాక్ పెట్టి లారీని కాస్త పైకి లేపినట్లు సమాచారం. అదే సమయంలో, హైడ్రాలిక్ జాక్ పట్టు తప్పడంతో అకస్మాత్తుగా కంటైనర్ ట్రక్ అటుగా వెళుతున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 700పై బోల్తా పడింది.
మహీంద్రా XUV 700పై కంటైనర్ బోల్తా పడటంతో ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. అయితే కారులో ఉన్న ప్రయాణికులంగా అదృష్టవశాత్తు అద్భుతంగా బయటపడ్డారు. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. XUV 700 పిల్లర్‌లు కొంతమేర కూలిపోవడంతో పాటు ట్రక్కు బరువును తట్టుకునేలా చేయడంతో కారు మాత్రమే మొత్తం డ్యామేజ్ అయింది.

ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికుల వివరాలు తెలియరాలేదు. ఈ ప్రమాదం నుంచి కారులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం అనంతరం పరిశీలిస్తే కారు నాణ్యత అందరినీ రక్షించిందనడంలో సందేహం లేదు. ఎందుకంటే మహీంద్రా XUV 700 SUV ప్రస్తుతం 5-స్టార్ రేటింగ్‌తో దేశంలోని కొన్ని సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటి.
మహీంద్రా XUV 700 5-స్టార్ రేటింగ్: క్రాష్ టెస్ట్‌లలో అసాధారణమైన పనితీరు కారణంగా మహీంద్రా యొక్క కొత్త SUV గ్లోబల్ NCAP నుంచి 'సేఫ్ ఛాయిస్' అవార్డును అందుకుంది. మహీంద్రా XUV 700 మహీంద్రా చరిత్రలో ఖచ్చితమైన 5 రేటింగ్‌ను సాధించిన రెండవ కారుగా నిలిచింది. మహీంద్రా XUV 700 యొక్క బాడీ షెల్ మరియు ఫుట్‌వెల్ ప్రాంతం స్థిరంగా ఉన్నట్లు అంచనా వేశారు.

ఇంకా గ్లోబల్ NCAP పరీక్షలో మహీంద్రా XUV 700 17 పాయింట్లకు 16.03 స్కోర్ చేసింది. క్రాష్ టెస్టులో ముందు కూర్చునే ప్రయాణికుడికి గాయాలయ్యే అవకాశం తక్కువగా ఉందని సూచించింది. ముఖ్యంగా, చైల్డ్ సేఫ్టీ టెస్ట్‌లకు గురైనప్పుడు, ఈ కారు ఏ మేడ్ ఇన్ ఇండియా కారు కంటే అత్యధిక స్కోర్ సాధించడం చెప్పుకోదగ్గ విషయం.
గ్లోబల్ NCAP యొక్క 'సేఫ్ కార్స్ ఫర్ ఇండియా' ప్రచారంలో పరీక్షించిన అన్ని కార్లలో XUV 700 సాధించిన స్కోర్లు అత్యధికం అని చెప్పడంలో సందేహం లేదు. దీనితో XUV 700 పూర్తి 5-స్టార్ రేటింగ్‌ను సంపాదించింది. ఇంకే ఆసక్తికరమైన విషయమేమంటే ఇది స్కార్పియోN XUV 700 కంటే ఎక్కువ స్కోర్ చేసింది.
అయితే నడిరోడ్డుపై ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే.. ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చా అని సందేహం మీకు రావచ్చు. నివారించవచ్చు.. కానీ పూర్తిగా కాదు. ట్రక్కుల వంటి భారీ వాహనాల పక్కన డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఈ పెద్ద వాహనాల పక్కన లేదా వెనుక ప్రయాణించడాన్ని తగ్గించడం ద్వారా ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చు. అందుకోసం ఓవర్‌టేకింగ్ టక్నిక్లు తెలిసి ఉండాలి.


Click it and Unblock the Notifications








