నడుము లోతు వరదలో కారులో చిక్కుకుపోయిన కుటుంబం.. వాళ్లే లేకపోతే.. వీడియో వైరల్‌

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి . అంతే కాకుండా దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో దశాబ్దాలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాజధాని మరియు పరిసర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన రహదారులు జలమయం కావడంతో ఓ కుటుంబం కారులో చిక్కుకుపోయిన వీడియో వైరల్‌గా మారి ఆందోళనను కలిగించింది.

భారీ వర్షాలకు రోడ్లపై వరదల్లో వాహనాలు నిలిచిపోవడం మనం చూస్తూనే ఉంటాం. చాలా సందర్భాల్లో వాహనాలు సవ్యంగా ముందుకు సాగేలా ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకుంటారు. కొన్ని సార్లు వరదల్లో చిక్కుకున్న వారిని వాలంటీర్ల సాయంతో రక్షించిన సందర్భాలు ఉన్నాయి. ఈ వీడియోను చూసినట్లయితే వారు ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తే హృదయం కలిచివేయక తప్పదు.

Floods-Viral-Video

ఈ వీడియోలో, వరదలో మునిగిపోయిన రహదారి మధ్యలో కారు ఇరుక్కుపోవడాన్ని మనం చూడవచ్చు. కారులో చిక్కుకున్న వారిని స్థానికులు కాపాడటాన్ని మనం గమనించవచ్చు. ఈ వీడియోను కొందరు ఓ భవనం పైనుంచి చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో అప్‌లోడ్‌ చేశారు. నీటి మట్టం కారు బానెట్ స్థాయికి చేరుకుంది. కారులోని ప్రయాణికులు తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి.

కారులో ఉన్న మహిళా ప్రయాణీకురాలు మరొకరి భుజాలపై ఎక్కి కారు పైకప్పుపైకి ఎక్కడం మనం గమనించవచ్చు. వరద నీరు నడుము లోతు నీటిలో ఉండటంతో పిల్లలు కిందకు దిగితే పూర్తిగా మునిగిపోతున్నారు. కాబట్టి వారికి ఉన్న ఏకైక ఆలోచన కారు పైకప్పు పైకి ఎక్కించడం. కానీ అలా అందరూ ఎక్కితే కారు పైకప్పు పాడైపోయి విరిగిపోయో అవకాశం ఉంది.

Floods-Viral-Video

ఈ విషయాన్ని గ్రహించిన ఓ స్థానిక యువకులు కారులో ఉన్న వారికి సాయం చేసేందుకు కారు వైపు వెళ్తున్న దృశ్యాలు వీడియోలో చూడవచ్చు. వీడియో నిడివి తక్కువగా ఉండటంతో చివర్లో ఏం జరిగిందనే వివరాలు పూర్తిగా తెలియవు. కానీ అందరూ సురక్షితంగా బయటపడ్డారని సమాచారం. కారులో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.

ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో యమునా నదిలో నీటిమట్టం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. యమునా నది 206 మీటర్ల మార్కును దాటితే, నదీతీర నివాసితులను ఖాళీ చేయిస్తామని చెప్పారు.

హిమాచల్ ప్రదేశ్ సహా ఉత్తర భారత్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున రానున్న 24 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రజలకు సూచించారు. అక్కడి పరిస్థితులపై అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పంజాబ్ చీఫ్ చెప్పారు.

వరదనీరు ఉన్న రోడ్డుపై ప్రయాణం ప్రమాదం : మీ ప్రయాణంలో వరద నీటితో ఉన్న రోడ్డు ఎదురైతే.. అక్కడి పరిస్థితులు మీకు తెలియనప్పుడు ముందుకు వెళ్లకపోవడమే మంచిది. చాలా రోడ్లపై నీటి అడుగున లోతైన గుంతలు ఉండే అవకాశం ఉంది. ఇది మీ వాహనానికి డ్యామేజీని కలిగించే ప్రమాదం ఉంది.

మీరు తప్పనిసరిగా అవతలి వైపునకు వెళ్లవలసి వస్తే, నీటి లోతును అంచనా వేయడానికి ఇతర వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు గమనించండి. అప్పుడు సురక్షితంగా మీ వాహనాన్ని నావిగేట్ చేసే అవకాశం ఉంటుంది. చాలా ఆధునిక వాహనాలు ఎలక్ట్రికల్ సిస్టమ్‌లపై ఆధారపడతాయి. కాబట్టి, వరద నీటితో ఉన్న రహదారులపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం.

More from DriveSpark

Article Published On: Monday, July 10, 2023, 17:05 [IST]
English summary
Locals rescue a family stuck in car from flooded roads in delhi ncr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+