కచోరి కోసం ట్రైన్ ఆపిన లోకోపైలేట్.. ప్రతి రోజూ ఇదే వరుస.. ఎక్కడో తెలుసా?
ఒకప్పుడు పాకిస్తాన్ లో పెరుగు కోసం ట్రైన్ ఆపిన లోకోపైలట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఇలాంటి నేపధ్యానికి చెందిన మరో సంఘటన ఇప్పుడు రాజస్థాన్‌లో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపైన ఎక్కువమంది ఆగ్రహం చేస్తుంటే, మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీని గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

నివేదికల ప్రకారం, రాజస్తాన్‌లోని అల్వార్‌లోని దౌడ్‌పూర్‌లో ఒక లోకో పైలట్ కచోరీ కోసం ట్రైన్‌ను ఆపాడు. నిజానికి ఈ లోకో పైలట్ ప్రతి రోజూ ఇలాగే చేస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వీడియో మీరు ఇక్కడ చూడవచ్చు.

మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే కచోరీ పార్శిల్‌తో ఓ వ్యక్తి సిద్ధంగా రైల్వే ట్రాక్ వద్ద సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ సమయంలో త్రం యొక్క లోకో పైలట్ ఆ కచోరి కోసం ట్రైన్ ఆపుతాడు, ట్రైన్ ఆగగానే ఆ వ్యక్తి లోకోపైలెట్ కి ఆ కచోరి అందిస్తాడు. ఆ పార్సిల్ తీసుకోగానే మళ్ళీ ట్రైన్ ముందుకు కదులుతుంది. ఈ సంఘటన మొత్తం ఒక్క రోజు జరిగినది కాదు. ప్రతి రోజూ ఇలాగె జరుగుతూ ఉందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు ట్రైన్ లోకో పైలట్ దౌడ్‌పూర్ రైల్వే గేట్ వద్ద రైలును ఆపుతాడని, అప్పటికే కచోరీతో ఓ వ్యక్తి అక్కడ సిద్దంగా ఉంటాడని చెబుతున్నారు. ఆ ట్రైన్ ఆగడం వల్ల అక్కడి వ్యక్తులకు చాలా ఇబ్బందిగా ఉంటుందని, అంతే కాకూండా ప్రయాణికులకు కూడా ఇది చాలా ఇబ్బందికరంగా ఉందని చెబుతున్నారు. ఈ కారణంగా రైల్వే గేట్ వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.

సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు ఈ వీడియో చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖను డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం జైపూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ దృష్టికి వెళ్లడంతో సదరు లోకో పైలట్‌పై, అతనితో పాటు మరో లోకో పైలట్, ఇద్దరు గేట్‌మెన్లను సస్పెండ్ చేసారు.

ఈ సంఘటనపైన అల్వార్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ఆర్‌ఎల్ మీనా మాట్లాడుతూ, లోకోపైలట్ చేస్తున్నపనిని తీవ్రంగా ఖండించారు. లోకో పైలట్లు తమ వ్యక్తిగత అవసరాలకోసం ఉపయోగించుకోకూడదని వారు తెలిపారు. కచోరి కోసం కదులుతున్న రైలును ఆపడం సరైన పని కాదని అన్నారు. దీనిపైన విచారణ పూర్తయిన తర్వాత తుది చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు చెబుతున్నారు.
రాజస్థాన్‌లోని స్థానిక హిందీ వార్తాపత్రికలు ఈ చర్యపైన తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు క్రాసింగ్ మూసివేయబడిందని, తద్వారా రైలులో కచోరి చేరుకోవచ్చని వార్తాపత్రికలు రాశారు. సాధారణంగా ఇది రద్దీగా ఉండే సమయం, దీని కారణంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

సాధారణంగా భారతదేశంలో అతిపెద్ద వ్యవస్థ రైల్వే. దేశంలో మొత్తం మీద ఇది ప్రజలకు సేవలు చేస్తున్నాయి. అలాంటి రైల్వే లో ఇలాంటి సంఘటనలు జరగటం అనేది ఈ రోజు విమర్శలకు గురవుతోంది. దీనిపైన తగిన చర్యలు త్వరలో తీసుకోవడం జరుగుతుంది.


Click it and Unblock the Notifications








