Log9 Materials ఎలక్ట్రిక్ వాహనాల కోసం దేశంలో తయారు చేసిన లిథియం అయాన్ బ్యాటరీలు విడుదల

బెంగుళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ లాగ్9 మెటీరియల్స్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మొదటి బ్యాటరీ సెల్‌ను విడుదల చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ బ్యాటరీ సెల్‌ను కంపెనీ పూర్తిగా స్థానిక టెక్నాలజీతో తయారు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు...

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలకు శక్తినిచ్చే విధంగా వీటిని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఇవి అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలకు వెచ్చిస్తున్న ఖర్చులలో గణనీయమైన తగ్గుదల ఉండబోతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దాదాపు 40-50శాతం మధ్య ఖర్చు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Log9 Materials

ఈ అత్యాధునిక Li-ion సెల్ తయారీ కేంద్రం బెంగళూరులోని జక్కూర్‌లోని Log9 క్యాంపస్‌లో ఉంది. దీని తయారీ ప్రారంభ సామర్థ్యం 50MWh వద్ద రేట్ చేయబడిందని సంస్థ పేర్కొంది. స్థానికంగా అభివృద్ధి చేయబడిన బ్యాటరీ సెల్‌లు కారణంగా 40 శాతం నుంచి 50 శాతం తగ్గించడంలో సహాయపడుతుందని Log9 చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ, వినియోగదారులకు ఖర్చును తగ్గించడంలో ఇది ఉపయోగపడనుంది.

బ్యాటరీ సెల్ నుంచి అధిక సామర్థ్యాన్ని, ధీర్ఘకాలం పనిచేసేలా దీనిని రూపొందించారు. దీనికి 'చార్విక్' అని నామకరణం చేశారు. కంపెనీ దీనికి తన స్వంత బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ (BMS) ను కూడా అభివృద్ధి చేసింది. Log9 కంపెనీ తయారు చేయాలనుకుంటున్న LTO (లిథియం టైటనేట్ ఆక్సైడ్) మరియు LFP (లిథియం ఫెర్రో ఫాస్ఫేట్) బ్యాటరీ సెల్‌లను కూడా ఆవిష్కరించింది.

Log9 Materials

మెరుగైన సెల్ డిజైన్, అధునాతన సెల్ కంట్రోల్ మెకానిజమ్‌ల అమలను సంస్థ కొనసాగించనుంది. పబ్లిక్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌లలో LFP బ్యాటరీల ద్వారా వేగవంతమైన ఛార్జింగ్‌ ప్రారంభించడం కోసం Log9 మెటీరియల్స్ దాని టెక్ స్టాక్ ప్లాన్‌ను వెల్లడించింది. ఇది ఫ్యూచర్ లో మరింతగా ఉపయోగపడనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ LFP బ్యాటరీ సెల్‌లు ఫాస్ట్ ఛార్జింగ్ చేయగలవు. 30 డిగ్రీల నుంచి 60 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలలోనూ ఇవి స్థిరంగా ఉంటాయి. స్థానికంగా నిర్మించిన బ్యాటరీ సెల్‌ల రాకతో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగానికి పెద్ద మార్పుగా చెప్పవచ్చు. అయితే Log9-అభివృద్ధి చేసిన బ్యాటరీ సెల్‌లు విపణిలోకి రావడానికి కాస్త సమయం పట్టవచ్చు.

ప్రస్తుతం దీని ఉపయోగంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విడుదల చేయడానికి ముందు అన్ని టెస్ట్ లు పూర్తి చేసుకున్నాకే ఇది మార్కెట్ లోకి రానుంది. ఇందుకోసం మరికొన్ని నెలల సమయం పట్టనుంది. కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులతో పాటు మోటార్, కంట్రోలర్ తయారీదారులతో భాగస్వామ్యమై దాని సొంత పర్యావరణ వ్యవస్థను కూడా నిర్మిస్తోంది. ఓ విధంగా పర్యావరణానికి ఈ సంస్థ తమ వంతు సాయాన్ని చేస్తుందని చెప్పవచ్చు.

ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ విజయ్ రాఘవన్, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె శివన్, ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ రంగన్ బెనర్జీ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న IITల నుంచి పలువురు కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, April 21, 2023, 20:12 [IST]
English summary
Log9 materials indias first commercial li ion cell launched in bangalore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+