గగనయానం చేసి విజయవంతంగా తిరిగి వచ్చిన 70 ఏళ్ల వ్యక్తి.. ఇప్పుడు అతడే హాట్ టాపిక్

మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు ఎన్నో, ఎన్నెన్నో కళలు కంటూ ఉంటారు. కానీ కన్న ప్రతి కల నిజం అవ్వొచ్చు లేదా అవ్వకపోవచ్చు. చాలా మంది ఆకాశానికి వెళ్లి అక్కడ నుండి భూమిని చూడాలని కలలుకంటుంటారు. కానీ కొద్దిమందికి మాత్రమే ఈ కల నిజం అవుతుంది. ఇలాంటి కళలు నిజం చేసుకోవడం అంత సులభమేమి కాదు. లెక్కకు మించిన డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

గగనయానం చేసి విజయవంతంగా తిరిగి వచ్చిన 70 ఏళ్ల వ్యక్తి.. ఇప్పుడు అతడే హాట్ టాపిక్

ఇటీవల వర్జిన్ గెలాక్సీ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రయాణించిన టీమ్ లో ఏడు పదుల వయసున్న రిచర్డ్ బ్రాన్సన్ ప్రయాణించిన సంగతి తెలిసిందే. దీని గురించి ఇంతకుముందు నుంచి కూడా చాలా చర్చ జరుగుతోంది. రిచర్డ్ బ్రాన్సన్ విజయవంతంగా అంతరిక్షంలో విహరించి భూమిపై కాలుమోపాడు.

గగనయానం చేసి విజయవంతంగా తిరిగి వచ్చిన 70 ఏళ్ల వ్యక్తి.. ఇప్పుడు అతడే హాట్ టాపిక్

లండన్ కి చెందిన రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గ్రూప్ చైర్మన్. అతను ప్రపంచంలో ఉన్న అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరుగా ఉన్నారు. అతని వయసు 70 సంవత్సరాలు. ఇతడు ఆదివారం 5 మంది బృందంతో అంతరిక్షయానం చేసి, ఇలాంటి ప్రయాణాలకు వయసుతో సంబంధం లేదని ఋజువు చేసాడు.

గగనయానం చేసి విజయవంతంగా తిరిగి వచ్చిన 70 ఏళ్ల వ్యక్తి.. ఇప్పుడు అతడే హాట్ టాపిక్

ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్ యాజమాన్యంలోని విఎస్ఎస్ యూనిటీ అంతరిక్ష నౌక ద్వారా రిచర్డ్ బ్రాన్సన్ అంతరిక్షంలోకి వెళ్లారు. వీరి టీమ్ లో రిచర్డ్ బ్రాన్సన్ తో సహా శిరీష బండ్ల, డేవ్ మెక్‌కే, మైఖెల్ మసూక్కీ, సీజే స్టర్‌కోవ్ మరియు కెల్లి ల్యాటిమర్ ఉన్నారు.

గగనయానం చేసి విజయవంతంగా తిరిగి వచ్చిన 70 ఏళ్ల వ్యక్తి.. ఇప్పుడు అతడే హాట్ టాపిక్

ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు జెఫ్ బెజోస్ ఈ నెల 20 న అంతరిక్షల్లోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. అతనికంటే ముందు తాను అక్కడ అడుగు పెట్టాలనే లక్ష్యంతో రిచర్డ్ బ్రాస్నన్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ ఎంతో వేగంగా పూర్తి చేసుకున్నారు.

గగనయానం చేసి విజయవంతంగా తిరిగి వచ్చిన 70 ఏళ్ల వ్యక్తి.. ఇప్పుడు అతడే హాట్ టాపిక్

చిన్నప్పటినుంచి అంతరిక్షంలో ప్రయాణించాలని కల కన్నానని, ఆ కల ఇప్పుడు నెరవేరిందని, ఈ సందర్భంలో ఎంతో సంతోషం వ్యక్తం చేసాడు రిచర్డ్ బ్రాన్సన్. గగనయానం చేసి తిరిగి వస్తున్న దృశ్యాలు ఇక్కడ మీరు చూడవచ్చు.

గగనయానం చేసి విజయవంతంగా తిరిగి వచ్చిన 70 ఏళ్ల వ్యక్తి.. ఇప్పుడు అతడే హాట్ టాపిక్

ఈ సందర్భంగా రిచర్డ్ బ్రాన్సన్ మాట్లాడుతూ, అతను భారతదేశ సంతతికి చెందినవారని చెప్పుకొచ్చారు. అతని పూర్వికులు తమిళనాడులోని కడలూరుకు చెందినవారని డిఎన్‌ఎ పరీక్షలో తేలిందని చెప్పారు. 2019 లో ముంబై నుండి లండన్‌కు వర్జిన్ అట్లాంటిక్ ప్రత్యక్ష విమాన ప్రయాణాన్ని ప్రారంభించిన సందర్భంగా బ్రాన్సన్ తెలిపారు.

గగనయానం చేసి విజయవంతంగా తిరిగి వచ్చిన 70 ఏళ్ల వ్యక్తి.. ఇప్పుడు అతడే హాట్ టాపిక్

"భారతదేశంలో నివసించిన నా పూర్వీకులు నాకు తెలుసు, కాని మా సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో గ్రహించలేదు. 1793 నుండి, దాదాపు నాలుగు తరాలు తమిళనాడులోని కడలూరులో నివసించాయని ఆయన తెలిపాడు. ఏది ఏమైనా ఇప్పుడు అంతరిక్షయానం చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

Most Read Articles

English summary
London Based Billionaire Richard Branson Goes For Space Trip. Read in Telugu.
Story first published: Tuesday, July 13, 2021, 11:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X