కార్లలో బెస్ట్ ఆడియో సిస్టమ్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో..!

కార్లలో ఒకప్పుడు ఆడియో సిస్టమ్ అనేది ఆప్షనల్ గా మాత్రమే అందుబాటులో ఉండే ఓ విలాసవంతమైన ఫీచర్. అయితే, ఈరోజుల్లో వాహనాలలో వినోదం (ఇన్ఫోటైన్‌మెంట్) అనేది ఇప్పుడు ఓ అవసరమైన ఫీచర్ గా మారిపోయింది. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే సమయంలో కార్లలో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కోసం వాడుకలో ఉన్న సౌండ్ సిస్టమ్స్ మరియు విడిభాగాల మార్కెట్‌లో లభించే కొన్ని మంచి నాణ్యమైన సౌండ్ సిస్టమ్‌లను ఈ పోస్ట్‌లో చూద్దాం రండి.

కార్లలో బెస్ట్ ఆడియో సిస్టమ్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో..!

హర్మాన్ కార్డన్

హార్మన్ కార్డన్ అనేది 1953 లో యునైటెడ్ స్టేట్స్‌లో సృష్టించబడిన ఓ హై-ఎండ్ ఆడియో బ్రాండ్. ప్రారంభంలో ఇది లగ్జరీ కార్లలో మాత్రమే అందించబడింది. అయితే, ఇటీవలి కాలంలో టాటా మోటార్స్ వంటి దేశీయ కంపెనీలు కూడా తమ కార్లలో ఈ ఆడియో సిస్టమ్ ను ఉపయోగిస్తున్నాయి. టాటా టియాగో తక్కువ ఖరీదైన కార్లలో కూడా ఇప్పుడు హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్‌ను లభిస్తోంది.

కార్లలో బెస్ట్ ఆడియో సిస్టమ్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో..!

బోష్

బోస్ కార్పొరేషన్‌ను 1964 లో భారతీయ ఎలక్ట్రికల్ ఇంజనీర్ మరియు ప్రొఫెసర్ అయిన అమర్ జి బోస్ స్థాపించారు. ప్రస్తుతం, దక్షిణ కొరియా కార్ బ్రాండ్లు అయిన హ్యుందాయ్ మరియు కియా వంటి కంపెనీలు భారతదేశంలో విక్రయించే కొన్ని కార్లలో ఈ ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్ ను ప్రధాన ఎంపికగా ఇస్తున్నాయి. అంతర్జాతీయ కస్టమర్లు కూడా బోస్ సౌండ్ సిస్టమ్‌ను విడిభాగాల మార్కెట్‌లో ప్రత్యేకంగా కొనుగోలు చేయవచ్చు.

కార్లలో బెస్ట్ ఆడియో సిస్టమ్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో..!

జెబిఎల్

భారతదేశంలో ప్రసిద్ధ సౌండ్ సిస్టమ్ బ్రాండ్లలో జెబిఎల్ కూడా ఒకటి. ఇది హర్మాన్ కార్డన్ కంపెనీకి చెందిన సబ్ బ్రాండ్. ప్రస్తుతం టాటా హారియర్, టాటా సఫారి, టొయోటా ఫార్చ్యూనర్ మరియు నిస్సాన్ మాగ్నైట్‌తో సహా పలు భారతీయ కార్లలో ఈ జేబిఎల్ ఆడియో సిస్టమ్ అందించబడుతుంది. అలాగే JBL స్పీకర్లు, యాంప్లిఫయర్లు మరియు సబ్ వూఫర్లు వంటి విడిభాగాల మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

కార్లలో బెస్ట్ ఆడియో సిస్టమ్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో..!

ఇన్ఫినిటీ

హర్మాన్ కార్డన్ బ్రాండ్ నిర్వహిస్తున్న మరొర సబ్ ఆడియో బ్రాండ్ ఇన్ఫినిటీ. 1968 లో స్థాపించబడిన ఇన్ఫినిటీ బ్రాండ్ కార్ ఆడియో సిస్టమ్‌లను మాత్రమే కాకుండా హోమ్ ఆడియో సిస్టమ్‌లను కూడా విక్రయిస్తోంది. మల్టీ-ఛానల్ సౌండ్ హోమ్ థియేటర్ సిస్టమ్‌లు, అలాగే వాల్-మౌంటెడ్ స్పీకర్లు మొదలైన వాటిని ఇన్ఫినిటీ బ్రాండ్ విక్రయిస్తోంది.

కార్లలో బెస్ట్ ఆడియో సిస్టమ్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో..!

బ్యాంగ్ అండ్ ఓలుఫ్సన్

మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి లగ్జరీ కార్ బ్రాండ్‌ల ఉత్పత్తులలో అందించబడే సౌండ్ సిస్టమ్ ఇది. బ్యాంక్ అండ్ ఒలుఫ్సెన్ బ్రాండ్ 1925లో స్థాపించబడింది, ఆ సమయంలో ఇధి రేడియోలను విక్రయించేది. ఆ సమయంలో ఇవి అత్యధికంగా అమ్ముడయ్యే రేడియోలు. అయితే, ఈ బ్రాండ్ యొక్క స్పీకర్లు భారతదేశంలోని విడిభాగాల మార్కెట్‌లో అందుబాటులో లేవు. కాబట్టి మీరు దాని స్పీకర్లను పొందాలనుకుంటే, లగ్జరీ కార్లను కొనుగోలు చేయడమే ఏకైక మార్గం లేదా విదేశాల నుండి వీటిని దిగుమతి చేసుకోవచ్చు.

కార్లలో బెస్ట్ ఆడియో సిస్టమ్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో..!

ఆల్పైన్

ఆల్పైన్ భారతదేశంలోని పురాతన ఆడియో బ్రాండ్‌లలో ఒకటి. ఆల్పైన్ బ్రాండ్ ని నిజానికి ఆల్ప్స్ మోటరోలా అని పిలుస్తారు, ఆల్ప్స్ ఎలక్ట్రిక్ మరియు మోటరోలా కంపెనీల కన్సార్టియం ద్వారా ఏర్పడిన బ్రాండ్ ఇది. ఆల్పైన్ కార్లలో క్యాసెట్ లిజనింగ్‌ను ప్రవేశపెట్టిన భారతదేశంలో మొట్టమొదటి బ్రాండ్ కావడం విశేషం.

కార్లలో బెస్ట్ ఆడియో సిస్టమ్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో..!

జెఎల్ ఆడియో

జెఎల్ ఆడియో అధిక నాణ్యత గల ఆడియో సిస్టమ్‌లకు ప్రసిద్ధి చెందింది. జెఎల్ ఆడియో యునైటెడ్ స్టేట్స్‌లో హోమ్ స్పీకర్లు, మొబైల్, పవర్‌స్పోర్ట్స్ మరియు మెరైన్ ఆడియోకి సంబంధించిన ఉత్పత్తులను సరఫరా చేయడంలో ప్రత్యేకత కలిగిన బ్రాండ్. యూఎస్ కి చెందిన ఈ జెఎల్ బ్రాండ్ ఆడియో ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.

కార్లలో బెస్ట్ ఆడియో సిస్టమ్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో..!

సోనీ

అందరికీ తెలిసిన ఆడియో బ్రాండ్ ఇది. సోనీ బ్రాండ్ కు భారత్‌లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జపాన్‌లోని టోక్యోలో ప్రధాన కార్యాలయంగా ఉన్న సోనీ ఇయర్‌ఫోన్‌ల నుండి పెద్ద గృహోపకరణాల వరకు వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయిస్తుంది. అలాంటి కంపెనీ కార్లకు ఆడియో సిస్టమ్‌ను కూడా అందించడంలో ఆశ్చర్యం లేదు. కార్లలో సోనీ ఆడియో సిస్టమ్స్ కి ప్రత్యేకమైన డిమాండ్ ఉంది.

కార్లలో బెస్ట్ ఆడియో సిస్టమ్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో..!

పయనీర్

పయనీర్ ఒక జపనీస్ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్విప్‌మెంట్ మేకర్. 1938లో నోజోము మాట్సుమోటో ద్వారా కేవలం రేడియో మరియు స్పీకర్ రిపేర్ షాప్‌గా స్థాపించబడిన పయనీర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రోడక్ట్ మార్కెటింగ్ హబ్‌గా ఎదిగింది. ఈ బ్రాండ్ నుండి స్పీకర్లు భారతదేశంలోని విడిభాగాల మార్కెట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.

కార్లలో బెస్ట్ ఆడియో సిస్టమ్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో..!

పానాసోనిక్

పానాసోనిక్, 1918 లో మత్సుషిడా ఎలక్ట్రిక్ ఇండస్ట్రియల్ కంపెనీగా స్థాపించబడింది, మరొక జపనీస్ కంపెనీ విక్టర్ కంపెనీతో కలిసి వీడియో రికార్డ్‌లను సృష్టించింది. 2008 నుండి పానాసోనిక్ అని పిలువబడే ఈ బ్రాండ్ నుండి కార్ ఆడియో సిస్టమ్‌లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. చీప్ అండ్ బెస్ట్ ఆడియో సిస్టమ్ లను అందించడంలో పానాసోనిక్ ప్రసిద్ధి చెందినది.

Most Read Articles

English summary
Looking for best audio system brands in cars here is few
Story first published: Sunday, May 22, 2022, 13:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X