చిన్న పొరపాటు పెద్ద తప్పిదం.. వేగంగా వస్తున్న లారీకి అడ్డు వెళ్లిన బైక్.. తప్పించబోయి బోల్తా పడిన లారీ

దేశంలో ప్రతి నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ఓ కారణం అయితే.. డ్రైవింగ్‌పై అవగాహన లేకపోవడం కూడా మరో కారణంగా నిలుస్తోంది. రద్దీగా ఉండే రహదారులపై పోలీసులు కఠినమైన నియమాలు అవలంభిస్తున్నారు. కానీ నగర శివార్లలో, జాతీయ రహదారులపై పోలీసుల నిఘా తక్కువ.

దేశంలో జాతీయ రహదారులపై సీసీ కెమెరాలు ఉన్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పశువులు అడ్డం రావడం కారణంగా పలు ప్రమాదాలు జరిగిన ఘటనలు చూశాం. ఈ నేపథ్యంలో భారీ వాహనాలతో రోడ్లపై వెళ్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు ఈ ఘటనే ఉదాహరణ. పూర్తి వివరాల్లోకి వెళితే..

Accident-Viral-Video

తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్‌లో హైవేపై జరిగిన ఓ ప్రమాదం భయాందోళనకు గురిచేస్తుంది. ఓ లారీ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఘటనలో పలువురికి గాాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోను పరిశీలించినట్లయితే ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డుకు ఎడమ వైపుగా ప్రయాణిస్తున్నాడు. అయితేే అనుకోకుండా అటూ ఇటూ వాహనాలు గమనించకుండా ముందుకు సాగుతూ రోడ్డుకు కుడివైపునకు వస్తున్నాడు. ఎడమ వైపు లేన్ నుంచి కుడి వైపున లేన్‌కు ప్రయాణిస్తూ ముందుకు వచ్చాడు. వెనుక వస్తున్న వాహనాలను గమనించలేదు.

Accident-Viral-Video

ఇంతలో వెనుక వస్తున్న కంటైనర్ లారీ డ్రైవర్ ద్విచక్ర వాహనాన్ని గమనించాడు. దీంతో బైక్‌ను తప్పించబోయి అనుకోకుండా లారీ డివైడర్ పైకి దూసుకెళ్లింది. అంతేకాకుండా సీసీ కెమెరాను అమర్చిన స్తంభాన్ని ఢీకొట్టి పక్కకు దూసుకుపోయి బోల్తా పడింది. ఘటనలో ద్విచక్ర వాహనదారుడిని కాపాడాలని కంటైనర్ డ్రైవర్ ప్రయత్నించినా బైకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

లారీ బోల్తా పడటంతో డ్రైవర్‌కు గాయాలు కావడంతో వారిద్దరినీ సమీపంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డుపై లారీ బోల్తా పడటంతో ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. క్రేన్ సహాయంతో పోలీసులు లారీని పక్కకు తొలగించారు. లారీ రాజస్థాన్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా వాఘపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. రోడ్డు మధ్యలోకి రాకముందే ట్రాఫిక్‌ను గమనించి సమయపాలన పాటించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇంకా లారీ డ్రైవర్ అప్రమత్తతే వల్లే బైక్ రైడర్ ప్రాణాలతో బయటపడ్డాడు.

ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, ప్రతి ద్విచక్ర వాహనదారుడు బండి నడుపుతున్నప్పుడు తెలుసుకోవలసిన కొన్ని క్లిష్టమైన అంశాల ప్రాముఖ్యతను ఈ సంఘటన హైలైట్ చేస్తుంది. ద్విచక్ర వాహనంపై వెళ్లే సమయంలో అనవసరంగా టర్నింగ్‌లు తీసుకోవడం వల్ల ప్రమాదాలు తప్పడం లేదు. నిబంధనలపై అవగాహన ఉన్న వారు ఇలా చేయడం లేదు.

వాహనదారులు వెనుక వస్తున్న వాహనాలను మిర్రర్ ద్వారా పరిశీలించడం.. ఇండికేటర్లు ఉపయోగించి వెనుక వాహనాలకు అలర్ట్ ఇవ్వడం.. మరీ ముఖ్యంగా మలుపు తీసుకునే ముందు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ మనం వీడియోలో చూసిన రైడర్ ఇక్కడ మనం చెప్పుకున్న ఏ ట్రాఫిక్ నిబంధనలను పాటించలేదు. ఇది పూర్తిగా బైక్ రైడర్ పొరపాటుగానే భావంచవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, August 10, 2023, 13:40 [IST]
English summary
Lorry hit divider on national highway while avoiding two wheeler video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+