హై స్పీడ్‌తో స్కోడా కుషాక్ కారును ఢీకొట్టిన లారీ.. ఆ ఫీచరే వారిని కాపాడింది.!!
దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాటి వల్ల కలిగే ప్రభావాన్ని తగ్గించేందుకు.. వాహన తయారీదారులు అధునాతన సేఫ్టీ ఫీచర్లతో వాహనాలను తయారుచేస్తున్నారు. అందుకే ఘోర ప్రమాదాలు జరిగినా ప్రయాణికులు సురక్షితంగా బయటపడుతున్నారు. ఇటీవల ఓ లారీ.. స్కోడా(Skoda Kushaq) కారును ఢీకొన్నప్పటీకీ కారు క్వాలిటీతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఇటీవల రోడ్డుపై వెళ్తున్న స్కోడా కుషాక్ కారును అనూహ్యంగా(Road Accident) ఓ లారీ ఢీకొట్టింది. అయితే, కారును హై సేఫ్టీ ఫీచర్లతో రూపొందించడంతో కారుకు ఇంకా అందులో ఉన్నవారికి పెద్దగా నష్టం జరగలేదు. ఈ విషయాన్ని స్వయంగా కారు యజమాని వెల్లడించారు. అంతేకాకుండా కారు నాణ్యతను మెచ్చుకున్నారు.

కేవలం మైలేజ్ ఎంత ఇస్తుందనే దాన్ని బట్టి కార్లు కొనే కాలం పోయింది. నేడు, కస్టమర్లు శక్తివంతమైన ఇంజిన్, మైలేజ్, అధునాతన సాంకేతిక ఫీచర్లు, సేఫ్టీ ఫీచర్లు ఉంటేనే కారును కొనుగోలు చేస్తున్నారు. అందుకనుగుణంగా కార్ల తయారీ కంపెనీలు సైతం సాధ్యమైనంత వరకు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటున్నాయి.
గతంలో లగ్జరీ కార్లు, ఖరీదైన కార్లలో మాత్రమే అడ్వాన్స్‌డ్, సేఫ్టీ ఫీచర్లు ఉండేవి. కానీ ఇప్పుడు తక్కువ ధరలో లభించే కార్లలో కూడా ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని కార్లలో టెక్నాలజీని అభివృద్ధి పరుస్తున్నారు. 360-డిగ్రీస్ యాంగిల్ పార్కింగ్ కెమెరా, ADAS మరియు ఇతర భద్రతా ఫీచర్లతో ప్రవేశపెడుతున్నారు. వీటిని క్రాష్ టెస్టులో పరీక్షించిన తర్వాతనే మార్కెట్లోకి ప్రవేశపెడతారు.

ఈ సాంకేతికతలను పొందిన కార్లు గ్లోబల్ NCAP మరియు ఆసియన్ NCAP వంటి ప్రత్యేక క్రాష్ పరీక్షల్లో టెస్ట్ చేస్తారు. వాటిలో పనితీరు ఆధారంగా స్టార్ రేటింగ్ ఇస్తారు. కొన్ని టాటా మరియు మహీంద్రా కార్లు క్రాష్ టెస్టుల్లో మంచి పనితీరును కనబరిచి 5 స్టార్ రేటింగ్ పొందాయి. స్కోడా కుషాక్ SUV కూడా సేఫ్టీలో 5 స్టార్స్ సొంతం చేసుకుంది.
పూర్తి 5 స్టార్లను పొందడానికి, కారు అనేక భద్రతా సాంకేతికతను కలిగి ఉండటమే కాకుండా, కారు బాడీని కూడా బలంగా ఉండేలా నిర్మించాలి. ముఖ్యంగా, ఏదైనా వాహనం స్టాండర్డ్ ఛాసిస్ చాలా బలంగా ఉండాలి. ఈ కారణంగానే ట్రక్కు కారును ఢీకొన్నప్పటికీ స్వల్ప గాయాలతో మాత్రమే బయటపడింది.

కాగా ఈ ఘటనలో ట్రక్కు ఓవర్‌లోడ్ అయిందని చెబుతున్నారు. జూన్ 8, 2023 ఉదయం 6:45 గంటలకు ముంబయి తూర్పు ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ స్కోడా కుషాక్ కారు డ్రైవర్ ట్రాఫిక్ లైట్ వద్ద గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో సరుకుల లోడుతో వెళ్తున్న లారీ కారు వెనుక నుంచి ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన సమయంలో కారు సిగ్నల్ వద్ద ఆగింది. కానీ వెనుక వచ్చిన లారీ డ్రైవర్ సిగ్నల్ వద్ద ఆగలేదు. దీంతో కారును ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదంలో కుషాక్ కారు వెనుక భాగం ధ్వంసమైంది. ముఖ్యంగా కారు వెనుక ఎడమవైపు బాగా దెబ్బతింది.
అదే విధంగా లారీ మెటల్ బంపర్ పాడైపోయినట్లు వీడియోలో చూడవచ్చు. దీంతో ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రమాదం ఎఫెక్ట్ క్యాబిన్ లోపల కనిపించలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని కుషాక్ కారు యజమాని తెలిపారు.
ఈ సంఘటనను వింటే, ఈ ప్రమాదం ఎంత తీవ్రమైనదో అర్థమవుతుంది. స్కోడా కుషాక్ వంటి పటిష్ఠంగా నిర్మించిన కారు కాబట్టి పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ నాణ్యత, సేఫ్టీ తక్కువగా ఉన్న కారు ఆ పరిస్థితుల్లో ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది.


Click it and Unblock the Notifications








