కదులుతున్న రైల్లో ఒక్కటైన ప్రేమ జంట.. ఏం ఐడియా గురూ అంటున్న నెటిజన్లు, వీడియో వైరల్.!!
కదులుతున్న రైలే పెళ్లి మండపమైంది. ప్రయాణికులే అతిథులయ్యారు. రైలు ఇంజిన్ శబ్దమే వేద మంత్రమైంది. ప్రయాణికుల చప్పట్లే ఆశీర్వచనాలయ్యాయి. రైలు పట్టాలే వారి వివాహ జీవితానికి సరికొత్త మార్గాన్ని చూపించాయి. ఈ వినూత్న వేదికపై ఓ యువ ప్రేమ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది.
కదులుతున్న రైల్లో ఓ యువ జంట పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా రైలు, బస్సులో యువతీయువకుల మధ్య ప్రేమ పుట్టడం లాంటి సంఘటనలు చూస్తూనే ఉంటాం. కానీ ప్రేమించుకున్న జంటలు.. పెద్దలు వారి ప్రేమను అంగీకరించకపోతే పారిపోయి ఏ గుడిలోనే, రిజిస్ట్రార్ ఆఫీస్‌లోనో లేదంటే ఏ ఆర్యసమాజ్‌లోనో పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం.

కానీ ఇలా జర్నీలోనే పెళ్లి(Couple Married Inside The Train) చేసుకోవడం లాంటి సంఘటనలు ఎప్పుడూ విని ఉండరు. ఈ వీడియో చూసిన నెటిజన్లు లవర్స్ పారిపోయి.. ఇలా రైల్లో పెళ్లి చేసుకోవడం కొత్తగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. పూర్తి వివరాలు ఈ కథనంలో..

పెళ్లి అనేది వెయ్యేళ్ల పంట అని పెద్దలు చెబుతారు. అందుకే బంధుమిత్ర సమేతంగా అత్యంత గ్రాండ్‌గా ఆ వేడుకను జరుపుకొంటారు. ఆ మధుర జ్ఞాపకాలను తీపి గుర్తులుగా దాచుకుంటారు. అయితే ఇవన్నీ పెద్దల ఆశీర్వాదంతో మాత్రమే సాధ్యమవుతాయి. కానీ ప్రేమ జంటలు తమ ప్రేమను అంగీకరించకపోతే పారిపోయి స్నేహితుల సపోర్ట్‌తో సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు.
కాగా తాజాగా వైరల్ అవుతున్న వీడియో రొటీన్‌కు భిన్నంగా ఉంది. రైలు కేవలం ప్రయాణాలకే కాకుండా ఇలాంటి ప్రేమ జంటలకు ఉపయోగపడుతోందని నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇంటి నుంచి పారిపోయిన జంట.. కదులుతున్న రైల్లో ఒక్కటైన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

ఈ వీడియోలో, ఒక యువకుడు బుల్లింగో హెయిర్ స్టైల్‌తో నిలబడి ఉండటాన్ని చూడవచ్చు. యువతి అతనిని హగ్ చేసుకుంది. వారిద్దరి మధ్య కాసేపు సంభాషణ అనంతరం యువకుడు తన చేతిలోని తాళిని తీసి ఆమెకు కట్టాడు. దీంతో తోటి ప్రయాణికులు వారిని అభినందిస్తూ తమ ఫోన్లలో వీడియో తీశారు. ప్రయాణికుల మధ్య వారిద్దరూ ఒక్కటయ్యారు.
అనంతరం వారిద్దరూ దండలు మార్చుకున్నారు. తాళి కట్టిన అనంతరం యువతి అతడిని కౌగిలించుకుంది. దీంతో వీడియో ముగుస్తుంది. అయితే ఇలా ప్రేమ జంట రైల్లో పెళ్లి చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రేమ జంటకు రైలు ప్రయాణం మరిచిపోలేని అనుభూతిగా నిలిచింది.

కానీ రైల్వే నిబంధనల ప్రకారం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చట్టవిరుద్ధం. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే సమాచారం అందుబాటులో లేదు. వెస్ట్ బెంగాల్‌లోని అసన్‌సూల్ నుంచి జార్ఘండ్‌లోని జాసిదికి వెళ్లే రైల్లో జరిగినట్లుగా సమాచారం. ఏదేమైనా ఇలా సరికొత్తగా రైల్లో పెళ్లి చేసుకోవడం ఐడియా అనేది నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








