ఈ తండ్రి చేసింది తప్పా.. ఒప్పా మీరే చెప్పాలి.. అయితే వీడియో చూడండి

సాధారణంగా ఏ తల్లిందండ్రులైన వారి పిల్లలపైనా విపరీతమైన ప్రేమను చూపిస్తారు. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఈ ప్రేమ కొన్ని సార్లు ప్రమాదాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఇటీవల ఒక వ్యక్తి బైకుపై నిద్రిస్తున్న కొడుకుని పట్టుకుని స్కూటర్ రైడ్ చేస్తున్నాడు.

నివేదికల ప్రకారం చండీగర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి స్కూటర్ మీద నిద్ర పోతున్న తన కొడుకుని ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో స్కూటర్ రైడ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అభిషేక్ థాపా అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోని ఇప్పటి వరకు 32,000 మందికి పైగా చూసారు, కాగా 13 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

ఈ తండ్రి చేసింది తప్పా.. ఒప్పా మీరే చెప్పాలి

ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి రోడ్డు పైన స్కూటర్ రైడింగ్ చేస్తూ వెళుతున్నాడు. ఆ సమయంలో వెనుక కూర్చున్న తన కొడుకు నిద్ర పోతున్నాడు. నిద్ర పోతున్న కొడుకుని ఎడమ చేత్తో పట్టుకుని, ఒకే చేత్తో ఆ స్కూటర్ నడుపుతున్నాడు. ఆ రోడ్డు మీద ఇతర వాహనాలు వెళ్లడం కూడా మీరు ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. అయితే ఈ సంఘటన మీద మిశ్రమ స్పంద వస్తోంది.

ఈ వీడియో చూసిన చాలామందిలో కొందరు మారువేషంలో 'సూపర్ మ్యాన్' అని పొగుడుతూ, గొప్ప తండ్రి అని ప్రశంసిస్తున్నారు. అయితే మరికొందరు ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నావ్ జాగ్రత్త అనే రీతిలో స్పందిస్తున్నారు. నిజానికి మనం ఈ వీడియోలో తండ్రి ప్రేమను చూడవచ్చు. కానీ ఇది ఖచ్చితంగా ప్రమాదమే. ఎందుకంటే ప్రజా రహదారులలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఖచ్చితంగా తెలియదు. అలాంటప్పుడు ఒకే చేత్తో రైడింగ్ చేయడం ఎంత ప్రమాదమో అందరికి తెలుసు.

రెండు చేతులతో రైడింగ్ చేసేటప్పుడే ఒక్కోసారి పట్టుని కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాంటిది ఒకే చేత్తో రైడింగ్ చేస్తే వచ్చే ప్రమాదం నిజంగా ఊహాతీతం అనే చెప్పాలి. అలాంటప్పుడు ప్రమాదం జరిగితే రైడింగ్ చేస్తున్న ఆ వ్యక్తి మాత్రమే కాకుండా, వెనుక కూర్చున్న తన కొడుక్కి కూడా చాలా ప్రమాదం. ఈ ప్రమాదంలో ఎటువంటి హాని జరుగుతుందో అనే విషయం కూడా మనం ఖచ్చితంగా అంచనా వేయలేము.

పిల్లలు నిద్రించే సమయంలో ఇలాంటి రైడింగ్స్ చేయడం ప్రమాదం మాత్రమే కాదు, ప్రాణాంతకం కూడా. కావున ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం నిత్యా జీవితంలో ప్రతి రోజు ఎంత మంది రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారనేది చూస్తూనే ఉన్నాము. అలంటి సమయంలో కూడా ఇలాంటి సాహసాలు చేయడం ప్రశంసించదగ్గ విషయం కాదు. కావున తప్పకుండా ప్రతి ఒక్క వాహన వినియోగదారుడు దీనిని గుర్తుంచుకోవాల్సిందే.

ఈ వీడియోలో కనిపించే స్కూటర్ హోండా యాక్టివా అని తెలుస్తోంది. హోండా యాక్టివా దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఈ కారణంగానే మార్కెట్లో ఈ స్కూటర్ మంచి సంఖ్యలో అమ్ముడవుతూ ఉంది. దేశీయ మార్కెట్లో ఈ స్కూటర్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి సంఖ్యలో అమ్ముడవుతూ ముందుకు దూసుకెళ్తోంది. అమ్మకాల పరంగా ఇది గొప్ప మైలురాయిని కూడా ఛేదించింది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ప్రపంచంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగతున్న దేశాల్లో భారతదేశం ఒకటి. కావున భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నాయి. దీనితో పాటు రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించడానికి ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా అంకిత భావంతో ప్రవర్తించాలి. మనం చెప్పుకున్న కథనంలోని ఆ తండ్రి నిజంగానే హీరో. అయితే ప్రమాదం జరిగితే ఆ బాథ్యత ఎవరు వహించారు, కావున ఎప్పుడు ఇలాంటి సాహసాలు చేయకుండా ఉంటే మంచిది.

Most Read Articles

English summary
Love is okay but who is responsible if something happens
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X