Viral video పబ్లిక్‌ రోడ్డులో బైక్‌పై లవర్స్‌ రొమాన్స్‌.. ఝలక్‌ ఇచ్చిన పోలీసులు.. వైరల్‌ అవుతున్న వీడియో

ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యేందుకు యువత పిచ్చి పనులకు పాల్పడుతున్నారు. పబ్లిక్‌ ప్రాంతాలని కూడా చూడకుండా అసభ్యకర పనులకు పాల్పడుతున్నారు. వీరి కారణంగా ఇతర వాహనదారులు, తోటి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు జరిమానా విధించినా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.

పబ్లిక్‌ రహదారులపై బైక్‌పై వెళ్తూ ప్రేమికులు ముద్దులు పెట్టుకుంటున్న, కౌగిలించుకున్న సంఘటనలు ఇటీవల చాలా జరిగాయి. సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యేందుకు ఇలా చేస్తున్నారు. అవి ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి వెళ్లడంతో సదరు చర్యలకు పాల్పడిన వారికి జరిమానా సైతం విధించారు. అయినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది.

Romance-On-Bike

ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని 9వ నెంబరు జాతీయ రహదారిపై ఇద్దరు ప్రేమికులు బైక్‌పై రొమాన్స్‌ చేసుకుంటూ ప్రయాణిస్తున్నారు. ప్రాణ భయం లేకుండా కదులుతున్న బైక్‌పై ఒకరినొకరు కౌగిలించుకుని వెళ్తున్నారు. యువతి ఇంధన ట్యాంకుపై కూర్చొని ఉండగా, యువకుడు బైక్ నడుపుతున్నాడు. హెల్మెట్ లేకుండా, భద్రతా నిబంధనలు పాటించకుండా బైక్‌ నడుపుతున్నాడు.

ఈ దృశ్యాన్ని బైక్‌ వెనుక వస్తున్న వాహనంలోని ప్రయాణికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనిపై నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఏ మాత్రం ప్రాణ భయం లేకుండా ఇలా సంచరించడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వీరు ఇలా చేయడం ఇతర వాహనదారులకు సైతం ఇబ్బందిని కలిగిస్తుంది.

Romance-On-Bike

ప్రస్తుతం, ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అమ్మాయి ఆరోగ్యం సరిగానే ఉందా. ఇలా వెనుక కూర్చోకుండా ముందు కూర్చొని ఉండవచ్చు కదా అని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇంకోసారి ఇలా చేయొద్దని పోలీసులు వారికి తగిన సలహా ఇవ్వాలని మరొకరు ట్వీట్‌ చేశారు.

ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారడంతో ఘజియాబాద్ పోలీసుల దృష్టికి వెళ్లింది. పోలీసులు బైక్ యజమానికి రూ. 21,000 జరిమానా విధించారు. ఇందులో హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు రూ.1,000, తప్పు నంబరు ప్లేటుకు రూ. 5,000, వాయు కాలుష్య నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.10,000, పబ్లిక్ రోడ్డుపై బైక్‌ను వేగంగా నడిపినందుకు రూ.5,000 జరిమానా విధించారు.

కొన్ని నెలల క్రితం రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ జంట బైక్‌పై రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత అప్రమత్తమైన అజ్మీర్ పోలీసులు బైక్‌ యజమానిపై కేసు నమోదు చేసి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సోషల్‌ మీడియాలో క్రేజ్‌ కోసం ప్రస్తుతం దేశంలో ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ తరహా చర్యలకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి చేయకూడదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పబ్లిక్‌ రోడ్లపై ఈ తరహా విన్యాసాలకు పాల్పడే ముందు యువతీ యువకులు తమ కుటుంబం గురించి ఆలోచించాలని అభిప్రాయపడుతున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, June 23, 2023, 17:45 [IST]
English summary
Lovers romance on moving motorcycle police issued challan video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+