'లోరైడర్స్' అసలు ఎవరు వీళ్లు? (వీడియోతో పాటుగా)

By Ravi

కొందరికి కార్లు కేవలం రవాణా సాధనాలు మాత్రమే కాదు, అవే వారికి జీవన మార్గాలు కూడా. యునైటెడ్ స్టేట్స్‌లో ఎక్కడ చూసిన 'లోరైడర్' అని పిలిచే ఓ కారు తప్పనిసరిగా కనిపిస్తుంది. మీరెప్పుడైనా దీని గురించి విన్నారా? వినకపోయిన ఫర్వాలేదు, ఈనాటి మన ఆఫ్‌బీట్ కథనంలో పాపులర్ లోరైడర్స్ గురించి తెలుసుకుందాం.

లోరైడర్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే కారు ఎత్తు నేలను తాకుతున్నట్లు అనిపించే అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన కార్లు. వీటిని చిన్న డయామీటర్ చక్రాలతో, సస్పెన్షన్లను భారీగా మోడిఫై చేస్తారు. లోరైడర్ అనే పదాన్ని కేవలం ఇలాంటి కారుకే కాకుండా, ఆ కారును నడిపే డ్రైవర్‌కు వర్తింపజేశారు. అందుకే ఈ కార్లను నడిపే డ్రైవర్లను కూడా లోరైడర్స్ అని పిలుస్తారు.

ఈ లోరైడర్ ట్రెండ్ ఇప్పటిది కాదు, 1940వ దశకం నుంచే అమెరికాలో ఈ ట్రెండ్ మొదలైంది. 'హాట్ రాడ్' మోడిఫికేషన్ అంటూ అప్పట్లో కార్లను ఇలా మోడిఫై చేసుకునేవారు. అయితే, ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చి మాత్రం 1960-70వ దశకంలోనే. ప్రస్తుతం లోరైడర్లు హిప్ హాప్ మరియు అర్బన్ కల్చర్‌లో ఓ భాగమైపోయాయి. మరిన్ని ఆసక్తిర విషయాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

'లోరైడర్స్' అసలు ఎవరు వీళ్లు?

లోరైడర్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తిర విషయాలను తర్వాతి స్లైడ్‌లలో చూడండి.

'లోరైడర్స్' అసలు ఎవరు వీళ్లు?

లోరైడర్‌లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నెలకు అంటుకుపోయినట్లు ఉండే ఈ కార్లు గాల్లోకి లేవటం, పూర్తింగా జంపింగ్ చేయటం లేదా రెండు చక్రాలపై లేచి నిటారుగా పైకి నిలబటం మొదలైన ఫీట్లు. కార్ సస్పెన్షన్‌లో భారీగా చేయబడిన మార్పుల కారణంగా లోరైడర్ కార్లతో ఈ ఫీట్లు చేయటం సాధ్యమవుతుంది. స్ప్రింగ్, షాక్స్ స్థానంలో ఎయిర్‌బ్యాగ్స్‌ను రీప్లేస్ చేయటం లేదా హైడ్రాలిక్ సిస్టమ్‌ను ఉపయోగించడం చేస్తుంటారు. కారులో ఉండే స్విచ్‌ల సాయంతో కంట్రోల్ చేస్తుంటే, ఈ కార్లు డ్యాన్స్ చేస్తాయి.

'లోరైడర్స్' అసలు ఎవరు వీళ్లు?

ఈ హైడ్రాలిక్ సిస్టమ్ పనితీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో వేగంగా ఫ్లూయిడ్స్‌తో నింపబడే ఓ హైడ్రాలిక్ యాక్ట్యుయేటర్ లేదా ఓ బ్లాడర్ ఉంటుంది. ఈ బ్లాడర్ ఓ కంప్రెసర్‌కు అనుసంధానం చేయబడి ఉంటుంది, ఆ కంప్రెసర్ ఇందులోని ఫ్లూయిడ్‌ని వేగంగా బ్లాడర్‌లోకి పంప్ చేస్తుంది. ఇలా చేయటం సిస్టమ్ ఎక్స్‌పాండ్ అవటం, ఎక్స్‌ప్లోడ్ అవటం జరుగుతుంది. ఈ ప్రక్రియ వలన కారు హఠాత్తుగా భూమిపై నుంచి ఎగరటం, డాన్స్ చేయటం మొదలైన స్టంట్స్‌కు సహకరిస్తుంది.

'లోరైడర్స్' అసలు ఎవరు వీళ్లు?

లోరైడర్ హాపింగ్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే.. మన రెండు కాళ్లతో గాల్లోకి ఎగిరినప్పుడు మన కాళ్లకి మరియు భూమికి మధ్య ఏర్పడే గురుత్వ బలం వలన మన పైకి ఎగురడం జరుగుతుంది. అలాగే, కొంత ఎత్తుకు ఎగిరిన తర్వాత ఈ బలం శూన్యమై మనం క్రిందికి వచ్చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ లోరైడర్ సస్పెన్షన్ సిస్టమ్ కూడా పనిచేస్తుంది.

'లోరైడర్స్' అసలు ఎవరు వీళ్లు?

హైడ్రాలిక్ యాక్యుటేటర్స్ పనిచేయటానికి చాలా శక్తి అవసరం అవుతుంది, అందుకే కారు బూట్ లేదా లోడ్ బేలో అనే కార్ బ్యాటరీలను అమర్చుతారు. ఈ బ్యాటరీల శక్తితో ఇది పనిచేస్తుంది. ఈ బ్యాటరీల చేరిక కారణంగా కారు కూడా హెవీగా మారుతుంది. అందుకే ఈ కార్లు వేగంగా వెళ్ల లేవు, ల్యాండ్ స్పీడ్ రికార్డులు సృష్టించలేవు, కొండలు ఎక్కలేవు. వాస్తవానికి ఈ కార్లు కేవలం స్టైల్ కోసం మాత్రమే ఉద్దేశించబడి మోడిఫై చేస్తారు.

'లోరైడర్స్' అసలు ఎవరు వీళ్లు?

ప్రస్తుతం అనేక రకాల కార్లను లోరైడర్లుగా మారుస్తున్నప్పటికీ, అత్యంత పాపులర్ అయిన కార్లు మాత్రం 1960కి చెందిన షెవర్లా ఇంపాలా, 1970 మరియు 1980కి చెందిన షెవర్లే మోట్ కార్లో, బుయిక్ రీగల్స్, ఓల్డ్‌స్మోబిల్ కట్లాస్ సుప్రీమ్స్ కార్లతో పాటుగా షెవర్లే ఈఐ కామినో ట్రక్స్ కూడా మంచి పాపులారిటీని కలిగి ఉన్నాయి. ఆకర్షనీయమైన పెయింట్, స్టయిలిష్ రిమ్స్ వంటి అనేక కస్టమ్ వర్క్స్‌ను ఈ కార్లలో చూడొచ్చు.

'లోరైడర్స్' అసలు ఎవరు వీళ్లు?

అమెరికాలో ఏడాది పొడవునా లోరైడర్ షోలో జరుగుతూ ఉంటాయి, ఇందులో కొన్ని పాపులర్ డ్యాన్స్ కాంటెస్ట్‌లు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమం చూడటానికి వీనుల విందుగా ఉంటుంది. పురాతన క్లాసిక్ కార్లు, అందులోనూ నృత్యం చేసే కార్లను చూస్తుంటే, ఆ ఫన్ మాటల్లో చెప్పడం సాధ్యం కారు. మరి ఆ వింతను మీరు కూడా చూడాలనుకుంటున్నారా..? అయితే తర్వాతి స్లైడ్‌లో వీడియోని తప్పకుండా చూడండి.

వీడియో

ఒకవేళ మీరు లోరైడర్ అయితే, మీరు అతి వేగంగా డ్రైవ్ చేయరు. ఇది నిజం, ఎందుకంటే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూడాలనే ఉద్దేశ్యంతో నెమ్మదిగా నడుపుతారు. వార్ అనే మ్యూజికల్ బ్యాండ్ సంగీతాన్ని అందించిన ఈ లోరైడర్ వీడియోని మీరు కూడా వీక్షించండి.

'లోరైడర్స్' అసలు ఎవరు వీళ్లు?

ఈ లోరైడర్ కల్చర్ మాత్రం మన ఇండియాకు వచ్చే అవకాశాలు ఏకోశాన లేవు. ఎందుకంటే, మనదేశంలో ఇలాంటి క్లాసిక్ అమెరికన్ కార్లు లేవు అంతేకాదు, ఇలాంటి లోరైడ్ స్టంట్స్ చేయటానికి అనువైన/అందమైన రోడ్లు కూడా అస్సలే లేవు. ఒకవేళ ఎవరైనా ఇలా చేయాలని ప్రయత్నించినా ఓ కాంటెస్సా కారునో లేదా అంబాసిడర్ కారునో ఇలా కన్వర్ట్ చేసే అవకాశం ఉంది.

'లోరైడర్స్' అసలు ఎవరు వీళ్లు?

లోరైడర్స్ సంబంధించిన ఈ కథనం మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసిందని మేము ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, April 26, 2014, 12:22 [IST]
English summary
For some, cars are not just transport, but a way of life. Across the world to the United States, to a kind of car called a ‘lowrider'. Heard of it? If you haven't, we'll give you a rough definition first - a ‘lowrider' is a car whose height is lowered so it skims the ground, with smaller diameter wheels than stock and modifications to the suspension. The term can also be used to refer to the driver of the car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+