Just In
- 13 min ago
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- 18 min ago
భారత్‌లో మూడు కొత్త బైకులను విడుదల చేసిన డుకాటీ; వివరాలు
- 2 hrs ago
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- 3 hrs ago
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
Don't Miss
- Sports
IPL 2021: చెన్నై జట్టులోకి రాబిన్ ఊతప్ప.. మీరు మారరంటూ ఫ్యాన్స్ ఫైర్!
- News
అనంత కలెక్టర్‌ను కదిలించిన ఫేస్బుక్ పోస్ట్: 24 గంటల్లోనే బస్సు: స్టూడెంట్స్‌తో కలిసి ప్రయాణం
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- Movies
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చివరకు పట్టుబడ్డ దేశంలోనే అతిపెద్ద దొంగల ముఠా
భారతదేశంలో కార్ల దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. భారత దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలలో ఒకటి ఈ కార్లు మరియు బైక్ ల దొంగతనాలు. ప్రతిరోజూ వందలాది వాహనాలు దొంగలించబడుతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ దొంగతనాలను పూర్తిగా ఆపలేకపోతున్నారు.

వాహనాలు దొంగతనం జరిగినప్పుడు కొన్ని మళ్ళీ పట్టుబడతాయి, అందులో చాలావరకు పట్టుబడవు. కానీ ఇటీవల కాలంలో లక్నో పోలీసులు ఏకంగా 11 కోట్ల విలువ కలిగిన కార్లను దొంగలించిన ముఠాను పట్టుకున్నారు.

పోలీసులు ఈ దొంగల ముఠాను పట్టుకోగా ఇందులో 5 మంది ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఈ ఐదు మంది దొంగలించిన వాటిలో 50 కార్లు, మిగిలిన ఎస్‌యూవీలను జూన్ 21 న స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగల ముఠా దొంగలించిన మొత్తం వాహనాల సంఖ్య మొత్తం 112. ఇందులో 60 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
MOST READ:రెండవసారి పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధర, ఈసారి ఎంతో తెలుసా?

ఇప్పటివరకు దేశంలో ఇది అతిపెద్ద దొంగతనం ఇదే అని లక్నో పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల నివేదిక ప్రకారం ఈ ముఠా గతంలో దొంగిలించిన వాహనాలు మొట్ట 2 వేలకు పైగా ఉన్నాయి.

దొంగలించిన వాహనాలు పట్టుబడకుండా ఉండటానికి వీరు కొన్ని ధ్వంసమైన వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్‌ను, ఇంజిన్ నంబర్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలించిన తరువాత, వారు దొంగిలించిన వాహనాలకు అమర్చడం జరుగుతుంది.
MOST READ:ఇండియన్ ఎయిర్ పోర్స్ లో చేరనున్న రాఫెల్ ఫైటర్ జెట్స్ ; ఎందుకో తెలుసా

సదాహరణగా రహదారి ప్రమాదాల్లో చిక్కుకుని దెబ్బతిన్న కార్లను కూడా ఈ ముఠా కొనుగోలు చేసి, ఈ వాహనాల రిజిస్ట్రేషన్ వివరాలను అప్పుడు దొంగిలించబడిన వాహనాల వివరాలను భర్తీ చేయడానికి ఉపయోగించారు. అప్పుడు ఆ వాహనాలను ఇతరులకు విక్రయించేవారు.

ఈ దొంగల ముఠా బిఎమ్‌డబ్ల్యూ సెడాన్ల వంటి అధిక-విలువైన లగ్జరీ కార్లను మరియు టయోటా ఫార్చ్యూనర్ మరియు టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి అధిక-డిమాండ్ ఉన్న కార్లను లక్ష్యంగా చేసుకునేవారు. అంతే కాకుండా సాధారణ మాస్-సెగ్మెంట్ కార్లను కూడా దొంగలించేవారు.
MOST READ:240 ఇంచ్ చక్రాలతో కొత్త రికార్డ్ సృష్టించిన కార్ [వీడియో]

పోలీసులు దొంగలను గుర్తించి పట్టుకుని విచారించగా దొంగల ముఠాలో ఉన్న నిందితుల్లో ఒకరైన వినోద్ శర్మ ఎంబీఏ డిగ్రీ హోల్డర్ కాగా, శ్వేతా గుప్తా మాజీ బ్యాంక్ క్లర్క్ అని గుర్తించారు. ఈ ముఠా సభ్యులు అప్పుడప్పుడు థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌ను సందర్శించేవారు. అంతే కాకుండా వీరు కింగ్‌పిన్ రిజ్వాన్ హోటళ్లలో ఉండేవారు. ఈ దొంగల ముఠాలోని వారు థాయ్‌లాండ్‌లో ఉన్నప్పుడు తీసిన ఫోటోలు కూడా ఉన్నాయి అని కమీషనర్ నేలం నిలాబ్జా చౌదరి వెల్లడించారు.

చాలా సందర్భాలలో దొంగలు వాహనాల భాగాలను తీసేసిన తరువాత విక్రయిస్తారు. అప్పుడు దొంగిలించబడిన వాహనాలను ట్రాక్ చేయడం దాదాపు అసాధ్యం అవుతుంది. చాలా మంది దొంగ కార్లను నేపాల్ వంటి పొరుగు దేశాలకు అక్రమంగా ఎగుమతి చేసిన తరువాత కూడా అమ్ముతారు.
MOST READ:పోలీసులు స్వాధీనం చేసుకున్న 4 కోట్ల విలువైన లంబోర్ఘిని సూపర్ కార్, కారణం ఏంటో తెలుసా ?

భారతదేశంలోని ఏ కారులోనైనా జీపీఎస్ ఆధారిత భద్రత అవసరం. ఇటీవల కాలంలో కోన్ని వాహనాలు అనేక భద్రతల లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ మరికొన్ని వాటికీ ఎటువంటి భద్రతా ఫీచర్స్ వుండవు. ఈ కారణంగా కార్లు ఎక్కువగా దొంగలించబడుతున్నాయి. కార్లలో జిపిఎస్ ఉన్నట్లయితే కారు ఎక్కడ ఉందొ అనే విషయం మనకు తెలియజేస్తుంది. అంతే కాకుండా యజమాని మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం ద్వారా కారును రిమోట్‌తో ఆపివేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.